Tuesday, September 19, 2023

Editorial – విప‌క్షాల ఐక్య‌త‌రాగం …

ప్రతిపక్ష ఇండియా కూటమి ముంబై భేటీతో మరి కొంత స్పష్టత వచ్చింది. రెండు రోజుల చర్చలు మూడు తీర్మానాలను తేగలిగాయి. ఉమ్మడి స్వరం పెరిగింది. కొత్త నినాదానికి జీవం పోసింది. బీజేపీకి వ్యతిరేకంగా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు ప్రతి పక్షాలు నిర్ణయించడం ముందడుగు. ప్రతిపక్షాల ఐక్యత యత్నాలు కొలిక్కి వచ్చినట్టుగా కనిపిస్తోంది. అనుమా నాలు, అపోహలతో ప్రారంభమైన ఐక్యత యత్నాలు ఈ మాత్రం ముందుకు కదులుతాయని ఎవరూ ఊహించ లేదు. గతంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ కూట మి కేంద్రంలో పదేళ్ళ పాటు అధికారంలో కొనసాగిన దృష్ట్యా, ఈసారి కూడా ప్రతిపక్షాల కూటమి నాయకత్వా న్ని తమకే ఇవ్వాలని కాంగ్రెస్‌ నాయకులు తొలిదశలో ఆశించారు. తమ ఆకాంక్షను బహిరంగంగానే వ్యక్తం చేశారు. అయితే, కాంగ్రెస్‌ నేతృత్వంలో పని చేసేందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తదితరులు ఆదిలోనే వ్యతిరేకించడంతో ఐక్యత యత్నాలు ముందుకు సాగ లేదు. ఒక రకంగా ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చిన ఘనత ప్రధాని నరేంద్రమోడీదే. ప్రతిపక్షాలు దీక్షాబద్ధు లై ముంబై దాకా రావడం కూడా ఆయన చలువే అన్నా అతిశయోక్తి కాదు.

ప్రతిపక్షాలను గడ్డిపోచలా తృణీకరిం చడం… ఇత్యాది పరిణామాల నేపథ్యంలో ఏకతాటిపైకి రావడం అనివార్యంగా భావించాయి. కేంద్రం పోకడలు చూస్తుంటే ఏ క్షణాన అయినా ఎన్నికలు రావచ్చన్న అను మానాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. ఈ తరుణంలో ప్రతిపక్షాలు నాయకత్వం కోసం పట్టుపట్టడం వల్ల ప్రయోజనం లేదని నిర్థారణకు వచ్చి ఉంటాయి. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ప్రకటించారు. ప్రతిపక్షాలు ఐక్యం కాలే వన్న బీజేపీ అంచనాలు తలకిందులయ్యాయని ఆయన అన్నారు. లోక్‌సభలోని అన్ని స్థానాలకూ ఇండియా కూటమి అభ్యర్థులు పోటీచేసే రీతిలో సీట్ల సర్దుబాటు చేసుకుంటామని రాహుల్‌ వెల్లడించారు. దేశంలో 60 శాతం మంది ప్రజలకు తమ కూటమి ప్రతీకగా నిలుస్తుం దన్నారు. ప్రతిపక్షాల ఉమ్మడి లక్ష్యం ముందు సీట్ల సర్దు బాట్లు,వ్యక్తిగత ఆభిజాత్యాలు చాలా చిన్నవి. అయినా, ఈ కూటమిలోని పార్టీలన్నీ యూపీఏ కూటమిలో భాగ స్వామ్యాన్ని కలిగి ఉన్నవే.కొన్ని పార్టీలూ, వ్యక్తులు వ్యక్తిగత విభేదాల వల్ల వేరు పడినా, మళ్ళీ తిరిగి కలుసు కోవడంలో ఆశ్చ ర్యం లేదు.

- Advertisement -
   

ఉదాహరణకు యూపీఏ హయాంలో కాంగ్రెస్‌లో కీలక పాత్ర వహించిన కపిల్‌ సిబాల్‌ శుక్రవా రం నాడు ముంబాయిలో ఇండియా కూటమి సమావే శానికి ఎవరూ పిలవకుండానే హాజరు కావడం. నిజానికి ఈ కూటమిలోని పార్టీలన్నింటికన్నా సిబాల్‌ బీజేపీ విధానాలపై తీవ్రంగా పోరాడుతున్నారు. ఆయన పేరు మోసిన న్యాయవాది, కాలమిస్టు. వివిధ పత్రికల్లో, టీవీ చర్చల్లో తన అభిప్రాయాలను ఇప్పటికే నిష్కర్షగా వెల్లడించారు. వెల్లడిస్తున్నారు. ఉమ్మడి పౌరసత్వంపై బీజేపీ నాయకుల ఆలోచనలను సమర్థ వంతంగా తిప్పి కొట్టారు. రాజ్యాంగ బద్ధంగా అవి చెల్లు బాటు కావని నిక్కచ్చిగా స్పష్టం చేశారు. ఉమ్మడి పౌరస త్వంపై ఇంత గట్టిగా, సిద్ధాంతపరంగా వ్యతిరే కించిన వారు ఎవరూ లేరు. ఆయన రాజ్యాంగంలోని వివిధ అధి కరణాలనూ, నియమనిబంధనలను ఉదహ రిస్తూ ఉమ్మడి పౌరసత్వం మన దేశానికి సరిపడదని వాదిస్తు న్నారు. ఆయన్ని ప్రతిపక్షాలే ఆహ్వానించి ఉండాల్సింది. కానీ, ఆయనే స్వచ్ఛందంగా శుక్రవారం నాటి సమావెె శానికి హాజరు కావడం కలిసొచ్చిన అంశం. ఈ మాది రిగా కొత్త కూటమికి రాహుల్‌ నాయకత్వం ప్రతిపాదన ను వ్యతిరేకిస్తూ బయటికి వెళ్లినవారంతా తిరిగి రావడా నికి అవకాశం ఏర్పడుతున్నదని భావిం చవచ్చు.

ఇండి యా కూటమి సమావేశానికి 28 పార్టీల నాయకులు, ప్రతినిధులు హాజరయ్యారు. కూటమి ఇప్పటికి మూడు సార్లు సమా వేశమైంది. ప్రతిసారీ మరింత బలాన్ని పుం జుకుంటోం దన్న మమతా బెనర్జీ మాటల్లో అసత్యం లేదు. ప్రతిపక్షా ల కూటమికి ఇండియా అని పేరు పెట్టడా న్ని ఎద్దేవా చేసిన వారు ప్రతిపక్షాల ఐక్యతా యత్నాలు ఉపేక్షించద గినవి కావని భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నిక లను ముందుకు జరపాలన్న ఆలోచన ప్రభుత్వాధి నేతల్లో ఈ కారణంగానే వచ్చి ఉండవచ్చునని అనుకుం టున్నారు. ప్రతిపక్షాల్లో ఏ పార్టీకి ఎక్కడ బలం ఉంటే అక్కడ సీట్ల సర్దుబాటులో ప్రాధాన్యం ఉండవచ్చు. కూటమికి వచ్చే సీట్లను బట్టే భాగస్వామ్య పార్టీలకు నాయకత్వ పదవి లభించవచ్చు. ఈసారి కలిసి సాగక పోతే మరిన్ని బాధలు అనుభవించాల్సి వస్తుందన్న భయాందోళనలు అన్ని పార్టీల్లో కనిపిస్తున్నాయి. ఐక్యత కు మూలసూత్రం అదే. ఈనెలలో జరిగే పార్లమెం టు ప్రత్యేక సమావేశాల్లో ప్రభుత్వమూ, ప్రతిపక్షాలు ఎలాం టి నిర్ణయాలు తీసుకుంటాయో వేచిచూడాలి. ప్రభు త్వం తీసుకునే నిర్ణయాలను బట్టి ప్రతిపక్షాలు తమ వ్యూహానికి మరింత పదును పెట్టే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement