Wednesday, November 29, 2023

Editorial – మాల్దీవుల నోట చైనా మాట‌…

హిందూ మహాసముద్రంలో దీవుల సముదా యమైన మాల్దివుల్లో కొలువుదీరనన్న కొత్త ప్రభుత్వం వరస మారింది. మాల్దివుల్లో ఇంతవరకూ భారత్‌ అను కూల ప్రభుత్వం అధికారంలో కొనసాగింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో చైనా అనుకూలవాది అయిన మహ్మద్‌ ముయిజ్జు నేతృత్వంలోని పార్టీ మరి కొద్ది రోజుల్లో అధికారాన్ని చేపట్టనున్నది. మాల్దివుల్లో ముయిజ్జు ఇంకా అధికారాన్ని చేపట్టకుండానే చైనా అనుకూల వైఖరిని బయటపెట్టుకున్నారు. పదవీ విరమణ చేయ నున్న అధ్యక్షుడు సోలేహ్‌ ఇండియా ఫస్ట్‌ నినాదంతో తమ దేశంలో భారత పెట్టుబడులకు ప్రాధాన్యం ఇచ్చా రనీ, దీనివల్ల తమ దేశం స్వతంత్రతను కోల్పో యిందన్నది కొత్త నాయకత్వం మాట. భారత వ్యతిరేక నినాదంతోనే ఇటీవల ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. అయితే, మాల్దిdవులకు భారత్‌ ఏ మేరకు సాయపడిందీ, ఎంత సాయపడిందీ ఆయన ఒక్క ప్రసంగంలో కూడా ఉదహరించలేదు. నిజానికి మాల్దిdవుల్లో ఆరోగ్య, ఆర్ధిక రంగాల్లో సాధించిన అభివృద్ధి అంతా భారత్‌ పుణ్యమే. అలాంటి మిత్రదేశం ఏమనుకుంటుందోనన్న భీతి లేకుండా భారత సైనికులంతా తమ దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలంటూ హుకుం జారీ చేశారు.

నిజానికి అధికారాన్ని చేపట్టిన తర్వాతే ఆయనకు ఆ హక్కు వస్తుంది. కానీ, చైనా అండ చూసుకుని ఆయన తన కడుపులో ద్వేషాన్ని ఆయన గద్దె నెక్కకుండానే కక్కేశారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని దీవుల్లో, తీర ప్రాంతాల్లోని దేశాల్లో తన ప్రాబల్యం పెంచుకోవడానికి చైనా ఎంతో కాలంగా ప్రయత్నిస్తోంది. శ్రీలంక రాజధాని కొలంబో సమీపంలో ఓడరేవు నిర్మాణానికి చైనా కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. వాటిపై వడ్డీలకు వడ్డీలను వసూలు చేశాయి. గడువులోగా తీర్చలేకపోయినందున ఆ ఓడరేవుపై హక్కును డిమాండ్‌ చేశాయి. చైనా అందించే సాయం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. చైనా కంపెనీలు వసూలు చేసే వడ్డీలు కాబూలీ వడ్డీలను మించిపోయి ఉంటాయి. నిజానికి కొలంబో సమీపంలోని అంబొత్తాబాద్‌ ఓడరేవు పూర్తి కాకుండానే, దానిపై ఆదాయం ఇంకా రాకుండానే, వాయిదాల సొమ్ముకోసం డిమాండ్‌ చేయడం చైనా కంపెనీల నైజాన్ని తెలియజేస్తోంది.

- Advertisement -
   

శ్రీలంక ఆస్తులను సొంతం చేసుకున్నట్టుగానే మాల్దిdవులలోని ఆస్తులను కబ్జా చేసేందుకు చైనా తన అనుకూల పార్టీని ఇటీవల ఎన్నికల్లో గెలిపించుకునేందుకు నానా తంటాలు పడింది. మాల్దిdవుల్లో అధికారాన్ని చేపట్టనున్న మహ్మద్‌ ముయిజ్జు భారత్‌ సైనికులు వెళ్ళిపోవాలంటూ హుకుం జారీ చేయడానికి అదే కారణం. భారత్‌ సైనికుల వల్ల మాల్దిdవులకు మేలు జరిగింది. ఎన్నికల ముందు ఆ దేశంలో ఎన్నో సంఘటనలు జరిగాయి. శాంతిభద్రతల సమస్యలేర్పడ్డాయి. ఆనాడు అధికారంలో ఉన్న సలేహ్‌ ప్రభుత్వం కోరితేనే మన సైనికులను మోడీ ప్రభుత్వం పంపింది. మోడీతో చాలా సామరస్య ధోరణిలోనే చర్చలు జరిపారు. దక్షిణ చైనా సముద్రంలో దీవులను కబళించేందుకు చైనా భారీ ఎత్తున యత్నాలు ప్రారం భించింది. ఆ దీవుల్లో అమూల్యమైన ఖనిజాలు, ఇంధన వనరులు ఉన్నాయి.

వాటిని సొంతం చేసుకోవడానికి చైనా సాగిస్తున్న యత్నాలను ఆ దీవుల పరిసరాల్లోని దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మాల్దిdవులు 1200 పగడపు ద్వీపాలు, ఇసుక దిబ్బలను కలిగి ఉన్న స్వతంత్ర దేశం. శ్రీలంకకు నైరుతి దిశలో 700 మైళ్ళ దూరంలో ఉంది. బౌద్ధుల కాలం నుంచి ఈ దీవుల్లో నాగరికత అభివృద్ధి చెందింది. మాల్దిdవుల ప్రజలు మొదటి నుంచి భారత్‌తో సన్నిహితంగా ఉండేందుకే ప్రయత్నిస్తు న్నారు. అయితే, చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకోవ డానికి భారత్‌ వ్యతిరేక భావజాలాన్ని పెంచి పోషిస్తున్నది. మాల్దిdవుల్లో ఉత్పత్తులన్నీ భారత్‌కోసం నిర్దేశించబడినవే. భారత్‌తో వాణిజ్య సంబంధాలు తమకు అనుకూలంగా ఉంటాయని వారు పేర్కొంటూ ఉంటారు. తమ సంపదను దోచుకోకుండా, శ్రమకు తగి న ఫలితం దక్కేందుకు భారత్‌తో వాణిజ్యమే మేలైందని వారు భావిస్తారు. పర్యాటక రంగం ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు మాల్దిdవుల ప్రభుత్వం ప్రయత్ని స్తోంది. మాల్దిdవుల ప్రజల్లో సమైక్యతా భావాన్ని వ్యాపిం పజేసినది భారతీయులే.

అయితే, భారత్‌ పట్టును దెబ్బతీసి, తన ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు మన ఇరుగుపొరుగు దేశాల్లో పాగా వేసేందుకు చైనా చేయని కుయుక్తి లేదు. మన దాయాది పాకిస్తాన్‌ను సర్వకాల మిత్రురాలిగా పేర్కొనే చైనా, నేపాల్‌తోనూ మనకు దూరాన్ని పెంచే ప్రయత్నం చేసింది. శ్రీలంక, భూటాన్‌, మయన్మార్‌లలోనూ అదే ప్రయత్నం చేస్తున్న బీజింగ్‌ ఇప్పుడు మాల్దిdవుల్లో భారత్‌ వ్యతిరేకతను ప్రోత్స హిస్తోంది. భారత ప్రభుత్వం అప్రమత్తమై వ్యవహ రించాల్సిన తరుణం ఇది.

Advertisement

తాజా వార్తలు

Advertisement