Tuesday, September 19, 2023

Editorial – బ్రిటిష్ చ‌ట్టాల‌కు చెల్లు చీటి…

మన దేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాల్లో చాలా మటుకు బ్రిటిష్‌ వారి కాలం నాటివే. అలాంటి బ్రిటిష్‌ కాలంనాటి చట్టాలను మార్చి, మరింత పదును తేల్చిన కొత్త చట్టాలను కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభు త్వం అమలు చేయడానికి అడుగులు వేస్తోంది. ప్రత్యేకిం చి భారతీయ శిక్ష్మాస్మతి, ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ వంటివాటిలో శిక్షలు కఠినతరం చేస్తూ అనేక ప్రతిపాదన లతో కొత్త చట్టాలకు సంబంధించిన బిల్లులను పార్లమెం ట్‌లో ప్రవేశపెట్టారు. వలసపాలకులైన బ్రిటిషర్లు ప్రజలు తిరుగుబాటు చేయకుండా తమకు అనుకూలమైన రీతిలో వారు అప్పట్లో చట్టాలను రూపొం దించారు. స్వాతంత్య్ర సమరంలో స్వరాజ్యం మా జన్మహక్కు అని నినదించిన లోకమాన్య బాలగంగాధర తిలక్‌ వంటి మహాశయులపై ఆనాటి పాలకులు రాజద్రోహం చట్టం కింద శిక్షలు విధించేవారు.

రాజులే లేనప్పుడు రాజ ద్రోహం చట్టాన్ని కొనసాగించడంపై విమర్శలున్నాయి. కాలం చెల్లిన రాజద్రోహ నేరం కింద కేసులను ఇప్పటికీ అధికా రంలో ఉన్న వారు తమ ప్రత్యర్థులపై బనాయిస్తు న్నారు. ఈ చట్టాలన్నీ వాక్‌ స్వేచ్ఛను, ప్రజల ప్రాథమిక హక్కులనూ హరిస్తున్నాయని న్యాయశాస్త్ర నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు దేశద్రోహ చట్టాన్ని రద్దు చేసి, దాని స్థానే భారత న్యాయ సంహిత బిల్లును తీసు కుని రానున్నారు. ఇందుకు సంబంధించి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా లోక్‌సభలో ఒక ప్రకటన చేశారు. మూక దాడు లు, మైనర్లపై లైంగిక దాడులకు పాల్పడి నవారికి మరణ శిక్ష విధించాలన్న ప్రతిపాదనలు ఇందు లో ఉన్నాయి. చిన్న నేరాలకు పాల్పడే వారికి సమాజ సేవ వంటి శిక్షను అమలు జేసేందుకు ప్రతిపాదనలను కూడా చేశారు. సాయుధ తిరుగుబాటు, విధ్వంసక చర్యలు, వేర్పాటు వాద కార్యకలాపాలను, దేశ సార్వ భౌమత్వానికి ముప్పుగా పరిగణించి శిక్షలు విధించే ప్రతిపాదనలను కూడా ఇందులో చేర్చారు. నిందితులు పరారీలో ఉన్నా, వారిపై విచారణ జరిపే నిబంధనను ఈ కొత్త చట్టంలో చేర్చను న్నారు.

పోలీసులు గాలింపు చర్యల సందర్భంగా వీడియో తీసే అధికారం కల్పించ నున్నారు. తీవ్రమైన నేరాల్లో నేరం జరిగిన ప్రదేశానికి పోలీసులు వెళ్ళి పరిశీ లించాలని నిర్దేశించనున్నారు. భారతీయ క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (ఐపీసీ) స్థానే భారతీయ న్యాయ సంహిత, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ స్థానే భారత నాగరిక సురక్ష సంహిత, ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ స్థానే భారతీయ సాక్ష్య బిల్లును హోం మంత్రి పార్లమెంటులో ప్రవేశపెట్టా రు. మన చట్టాల్లో పాత కాలం నాటివి సుమారు1100 పైగా మోడీ అధికా రంలోకి రాగానే రద్దు చేశారు. ఇంకా బ్రిటిష్‌ కాలం నాటి చట్టాలు అమలులో ఉన్నాయి. వీటిని మార్చాలనీ, లేదా ఎత్తివేయాలని సమయం వచ్చినప్పు డు రాజకీయ పక్షాల నాయకులు డిమాండ్‌ చేయడం పరిపాటి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాత చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేసిన పార్టీలే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యర్థులపై ఆయా చట్టాలను ప్రయో గించడం మన దేశంలో చూస్తున్న విచిత్ర వైఖరి.

- Advertisement -
   

ప్రస్తు తం అమలులో ఉన్న చట్టాలు 19వ శతాబ్దం నాటివని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్న మాటల్లో అణు వంతైనా అసత్యం లేదు. బ్రిటిష్‌ వారు మన స్వాతంత్య్ర సమరయోధులపై ప్రయోగించిన చట్టాలనే ఇప్పుడు మన వారిపై మన పాలకులు ప్రయోగించడాన్ని రాజకీ య నాయకులు పలు సందర్భాల్లో తీవ్రంగా విమర్శిస్తూ ఉంటారు. చట్టాల్లో లొసుగులను ఆసరాగా తీసుకుని తీవ్రమైన నేరాలు చేసిన వారు అరెస్టుల నుంచి తప్పించు కోవడమో, అరెస్టు అయిన కొద్ది రోజులకే బెయిల్‌ సంపా దించడం జరుగుతోంది. ఇలాంటివి జరగకుండా కొత్త చట్టాల్లో తగిన బిగింపులు ఉండాలి. కాగా, కొత్తగా తీసు కువచ్చే మూడు చట్టాలలో మొత్తం 313 మార్పులు చేయనున్నారు. సామూహిక అత్యాచారం కేసుల్లో మరణశిక్ష లేదా 20 ఏళ్లు లేదా జీవిత కాలం జైలు శిక్ష విధించాలని ప్రతిపా దించారు.

గొలుసు దొంగతనాలను నేరంగా పరిగణిస్తా రు. పెళ్ళి, ఉద్యోగం, ప్రమోషన్‌ వంటి వ్యక్తిగత విషయా లను దాచిపెట్టి మహిళలపై లైంగిక దాడులకు పాల్పడ టం నేరంగా పరిగమిస్తారు. 2027నాటికి అన్ని కోర్టుల్లో కంప్యూటీకరణ, డిజిటల్‌ ఎఫ్‌ఐఆర్‌ల నమోదు తప్పని సరి చేస్తారు. లైంగిక వేధింపుల కేసుల్లో బాధితుల స్టేట్‌మెంట్‌, రికార్డింగ్‌ తప్పనిసరి చేయనున్నారు. బాధితుల వాదన వినకుండా కేసులు ఉపసంహరించు కునే అవకాశం ఉండదు. శిక్ష పరమార్థం నేరస్థుల్లో పరివర్తన తీసుకుని రావడం. ప్రస్తుత చట్టాల కింద విధిస్తున్న శిక్షలు తేలికై నవనే భావన నిందితుల్లో ఉంది. వాటిని తప్పించు కోవ డం కష్టం కాదనే అభి ప్రాయం కూడా ఉంది.చట్టాలు ఎప్పుడూ మంచివే, పదునైనవే. వాటిని అమలు జేసే వారిలోనే లోపం ఉంది. నిందితుల్లోనే కాదు. చట్టాలను అమలు జేసే వారిలో పరివర్తన వస్తేనే చట్టాల సార్థకత.

Advertisement

తాజా వార్తలు

Advertisement