Sunday, April 28, 2024

Editorial: కాశ్మీర్‌లో చైనా… పాక్‌ కుట్ర

జమ్ములోని పూంఛ్‌లో మాటువేసి ఉగ్రవాదులు చేసి న దాడిలో ఐదుగురు భారత జవాన్ల మరణం యావత్‌ దేశాన్ని కలచివేసింది. కాశ్మీర్‌ విభజన జరిగిన తర్వాత క్రమంగా ప్రశాంతత నెలకొంటున్న ప్రాంతంలో ఒక్కసారిగా ఉగ్రవాదులు ఎలా విరుచుకుని పడ్డారు? వీరంతా పాక్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదులుగా సాధారణంగా అనుమానిస్తున్నప్పటికీ,వీరికి చైనా నుంచి సహాయ సహకారాలు అంది ఉండవచ్చునని తాజా సమాచారం.

చైనా నిర్మిస్తున్న అక్రమ కట్టడాలు, చేపడుతున్న ఆక్రమణలకు పాక్‌ వత్తాసు పలుకుతోంది. అలాగే, ఆక్రమిత కాశ్మీర్‌ విషయంలో పాక్‌కి చైనా మద్దతు ఇస్తోంది. ఆక్రమిత కాశ్మీర్‌ని పాక్‌ కబ్జా చేయగా, లడఖ్‌ని చైనా ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తోంది. లడక్‌లోని చాలా ప్రాంతాలను ఇప్పటికే చైనా తన అధీనంలోకి తెచ్చుకున్నది. పొరుగు దేశాలు రెండింటివీ ఆక్రమణ ఎత్తులే. అందుకే, భారత్‌ భూభాగంలోని ప్రాంతాలను ఆక్రమించుకోవడానికి చేతులు కలిపాయి. పూంచ్‌లో ప్రమాదకరమైన మలుపు వద్ద నెమ్మదిగా వెళ్తున్న మన సైనికుల వాహన శ్రేణిపై ఉగ్రవాదులు కొండల్లో నక్కి కాల్పులు జరిపినట్టు ప్రాథమిక సమాచా రం. పూంచ్‌లో మన భద్రతాదళాలను ఏమరు పాటుగా ఉండేట్టు చేసి లడఖ్‌ని ఆక్రమించుకుందామనేది చైనా వ్యూహం. ఇందుకు పాక్‌ ఉగ్రవాదులను చైనా పావులుగా వాడుకుంది. గాల్వాన్‌లో మూడేళ్ళ క్రితం చైనా, భారత్‌ సైనికుల మధ్య ఘర్షణ అనంతరం ఆ ప్రాంతంలో భారత్‌ సైనికుల సంఖ్య బాగా పెరిగింది. వారందరూ అక్కడ నుంచి వెనక్కి వెళ్ళేట్టు చేయడం కోసం చైనా ఉగ్రవాదు లను ఈ దాడి కోసం ఉపయోగించుకుంది. లడఖ్‌ నుంచి భారత సైనికుల దృష్టిని మళ్ళించేందుకు చైనా గత నెలలో కూడా రాజౌరీ జిల్లాలో ఉగ్రవాదులను భారత సైనికుల పైకి ఉసిగొల్పింది. కిందటి నెల దాడిలో కూడా ఇలాగే, యువ కెప్టెన్‌లు, జవాన్లను మన దేశం కోల్పోయింది. లడఖ్‌లో గాల్వాన్‌ ఉద్రిక్తత తర్వాత ఆ ప్రాంతానికి పూంచ్‌ నుంచి బలగాలను మన దేశం పంపింది. వాటి వల్ల లడఖ్‌లో తమ కార్యకలాపాలకు అడ్డంకి ఏర్పడటం తో చైనా ఈ కొత్త వ్యూహాన్ని అమలు జేసింది.ఈ వ్యూహా నికి పాక్‌ ప్రేరేపితుగ్రవాదులను ఉపయోగించుకుంది. పూంచ్‌లోని సురాన్‌ కోట్‌లో మన సైనిక దళాలు సర్ప్‌ వినాశ్‌ ఆపరేషన్‌లో భాగంగా బలగాలను మోహరించిం ది. వాటిని అక్కడి నుంచి తప్పించేందుకు చైనా చాలా కాలంగా ప్రయత్నిస్తోంది.. గడిచిన ఇరవై సంవత్సరాల్లో ఈ మార్గం గుండా భారత్‌లో ప్రవేశించేందుకు ప్రయ త్నించిన ఉగ్రవాదులు ఎంతో మంది ఎదురుకాల్పుల్లో మరణించారు.కాగా, కాశ్మీర్‌ విభజనలో భాగంగా లడఖ్‌ ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడం చైనాకు ఇబ్బందిక రంగా పరిణమించింది. లడఖ్‌లో భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు చైనా చాలా కాలంగా సాగిస్తున్న యత్నాలకు లడఖ్‌ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించ డం ప్రతిబంధకమైంది. చైనా, పాకిస్తాన్‌లు భారత భూ భాగాలను అక్రమంగా ఆక్రమించుకోవడానికి పన్నిన ఉమ్మడి వ్యూహం ప్రకారమే పూంచ్‌లో ఉగ్రవాదుల దాడి జరిగినట్టు మన సైనికాధికారులు భావిస్తున్నారు. గాల్వాన్‌ లోయలో ఆవలి వైపున చైనా భారీగా బలగాల ను మోహరించింది. మన సైనికులు కూడా అదేస్థాయి లో అక్కడ మోహరించి ఉండటం వల్ల చైనా అడుగులు ముందుకు పడటం లేదు. వాటి దృష్టిని మళ్ళించడం కోసమే ఉగ్రవాదులను ఉసిగొల్పుతోంది. అయితే, లడఖ్‌ ప్రాంతంలోనూ, పూంచ్‌ ప్రాంతంలోనూ భారత దళాల సంఖ్య భారీగానే ఉంది. చైనా, పాకిస్తాన్‌ సైనికులు ఉమ్మడి వ్యూహాంతో మన దేశం వైపు రావాలని చూసినా, వాటిని తరిమికొట్టేందుకు మన సైనికులు నిరంతరం అప్రమత్తతతో ఉన్నారు. పూంచ్‌లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతోనే మన సైనికులు వాహనాల్లో బయలుదేరినప్పుడు ఉగ్రవాదులు దొంగదెబ్బతీశారు. చైనా మనదేశంతో సఖ్యతను కోరుతున్నట్టు ప్రకటనలు చేస్తూనే ఈ మాదిరి కుట్రలకు పాల్పడుతోంది. చైనా ప్రజాస్వామ్యదేశం కాదనీ, ఆ దేశంతో భారత్‌ని పోల్చ వద్దని ప్రధాని నరేంద్రమోడీ తాజాగా ప్రకటించారంటే ఆయనకు చైనా కుయుక్తుల గురించి అందిన సమాచా రమే ఆధారమై ఉంటుంది. భారత్‌లో అంతర్భాగమైన కాశ్మీర్‌ని కాపాడుకోవడానికి మన దేశం తీసుకుంటున్న చర్యలు పాక్‌కే కాకుండా చైనాకుసైతం కంటగింపుగా ఉన్నాయి. భారత్‌ని దొంగదెబ్బ తీయడమే వాటి ఉద్దేశ్యం. అందుకు తాజాగా పూంఛ్‌లో జరిగిన దాడి నిదర్శనం. లడఖ్‌లో భారత్‌ తన సైన్యాన్ని వెనక్కి తీసుకొ ని పూంచ్‌, రాజౌరీ ప్రాంతాల్లో మోహరించేట్టు ఒత్తిడి చేయడమే చైనా వ్యూహం. కానీ భారత్‌ లడఖ్‌ను కాపాడు కుంటూనే ఈ రెండు రంగాల్లో మరిన్ని బలగాలను మోహరించే సత్తాను కలిగివుంది. ఈ రెండు రంగాల్లో గతంలో పాక్‌ సైనికుల దాడులను భారత సేన సమర్ధమం తంగా తిప్పికొట్టింది. ఈ రంగాలు భారత్‌కి ఎంతో కీలకమైనవి.

Advertisement

తాజా వార్తలు

Advertisement