Saturday, May 4, 2024

Eaditorial :కాల్పుల విర‌మ‌ణ‌తో శాంతికి నాంది?

ఇజ్రాయెల్‌ – హమాస్‌ దళాల మధ్య భీకర యుద్ధం సాగుతున్న సమయంలో తాత్కాలికంగా కాల్పుల విర మణ ఒప్పందం కుదరడం హర్షణీయమే. కాల్పుల విర మణ అనేది యుద్ధంలో ఎత్తుగడగానే భావించాలి. హమాస్‌ దళాలను పూర్తిగా తుడిచిపెట్టేవరకూ పోరు సాగిస్తానంటూ బీరాలు పలికిన ఇజ్రాయెల్‌ ఒక్కసారిగా వెనక్కి తగ్గిందంటే ప్రపంచ దేశాల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ శాన్‌ఫ్రాన్సిస్కోలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ని కలుసుకున్న మరునాడే ఇందుకు సంబంధించిన వార్తలు వచ్చాయి. ఇజ్రాయెల్‌ని అరబ్‌దేశాలు గుంట నక్కలా అభివర్ణిస్తుంటాయి. అదును చూసి దొంగదెబ్బ తీయడం ఇజ్రాయెల్‌కి అలవాటు. ఇప్పుడు తగ్గడానికి కూడా మరో పెద్ద భీకర దాడికి సమాయత్త ్తమవుతోం దేమోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇజ్రాయెల్‌ సైనికుల చెరలో బందీలుగా ఉన్న 150 మంది మహిళలు, పిల్లలను విడుదల చేయడం కోసమే ఈ తాత్కాలిక ఒప్పందం కుదిరిందనీ, ఈజిప్టు, ఖతర్‌, అమె రికా తదితర దేశాల కృషి ఫలితంగానే ఈ తాత్కాలిక ఒప్పందం కుదిరిందని వి శ్లేషకులు పేర్కొంటున్నారు. ఇజ్రాయెల్‌ నైజాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే ఇది నిజమేననిపిస్తోంది. ఇజ్రాయెల్‌ క్షేత్రస్థాయిలో గాజాపై దాడి ప్రారంభించే ముందు ఇలాంటి ఒప్పందం ఒకటి ఇజ్రాయెల్‌ పరిశీలనలో ఉందని ఇజ్రాయెల్‌ అధికారి ఒకరిని ఉటంకిస్తూ బీబీసీ తెలిపింది. ఏమైనా ఈ ఒప్పందాన్ని తు.చ. అమలు జరిపి నప్పుడే ఇజ్రాయెల్‌ చిత్తశుద్ధిని అంగీకరించాల్సి ఉంటుంది. అలాగే, తమ చెరలో బందీలుగా ఉన్న 50 మందిని విడుదల చేసేందు కు హమాస్‌ అంగీకరించినట్టు వార్తలు వచ్చాయి. బందీలలో బాలలు, మహిళలను విడుదల చేయాలని ఇజ్రాయెల్‌కీ, హమాస్‌కీ ఐక్యరాజ్యసమితి, రెడ్‌క్రాస్‌ వంటి అంతర్జాతీయ సేవాసంస్థలు విజ్ఞప్తి చేశాయి. రెండేళ్ళ క్రితం గాజాలో హింసాత్మక సంఘటనల నేపథ్యంలో నిర్బంధానికి గురైన యువకులు పలువురు బందీలుగా ఉన్నారని సమాచారం. పాలస్తీనా దళాల్లో యువకులు ఎక్కువమంది ఇజ్రాయెల్‌ దళాలతో తాడో పేడో తేల్చుకునేందుకు ఈ సంఘటనల్లో ఎక్కువగా పాల్గొన్నట్టు కూడా సమాచారం. అయితే, పాలస్తీనా దళాలపై తీవ్రవాదులన్న ముద్ర వేసి, వారిని బందీలుగా ఇజ్రాయెల్‌ చేస్తోందని పాలస్తీనా దళాలు ఆరోపిసు ్తన్నాయి. ఏడువేల మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్‌ జైళ్లల్లో వివిధ రకాల శిక్షలను అనుభవిస్తున్నారు. వీరిలో అక్రమ నిర్బంధానికి గురైన వారే ఎక్కువ. గాజాలో బందీల విడుదల సమయంలో ఇంధనం, మానవతా సాయాన్ని అందించడం జరుగుతుందని ఖతర్‌ పేర్కొంది. గాజాలో బందీలకు మానవతా సాయాన్ని అందించాలని ఖతర్‌కి మన దేశంసహా పెక్కు దేశాలు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. కాల్పుల విరమణ సమ యంలో దక్షిణ గాజా గగనతలంలో ఇజ్రాయెల్‌ విమానాలు తిరగకుండా చూడాలని హమాస్‌ దళాలు కోరుతున్నాయి. అయితే, యుద్ధ విమానాల ప్రస్తావన ఇజ్రాయెల్‌ ప్రకటనలో లేకపోవడం గమనార్హం. ఇజ్రాయెల్‌ కిటుకు అంతా అక్కడే ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇజ్రాయెల్‌ దళాలు సంధి కాలం ముగిసిన తర్వాత కూడా కొనసాగుతాయని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహు ప్రకటించారు. సంధికి సిద్ధపడుతున్నా ఇరువర్గాల్లో పరస్పరం అనుమానాలు పూర్తిగా తొలగలేదనడానికి ఇదే ఉదాహరణ. వ్యూహా లను మార్చుకోవడానికి ఇరువైపుల వారికీ కొంత వ్యవధి అవసరం కనుక, ఈ తాత్కాలిక సంధికి అంగీక రించినట్టు తెలుస్తోంది. అంతేకాక, ఇజ్రాయెల్‌ ఈ దాడు ల్లో అమానుషంగా వ్యవహరిస్తోందని అంతర్జా తీయంగా పెక్కు దేశాలు గుర్తించాయి. ముఖ్యంగా, ఆస్పత్రులపై దాడులను ప్రపంచ దేశాలన్నీ ఖండిస్తు న్నాయి. బందీలలో విడుదల కాని వారికి రెడ్‌క్రాస్‌ కమి టీ ద్వారా ఔషధాలు అందేట్టు చూస్తామని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. అలాగే, మంచినీరు, విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించడం అత్యవసరం. 47 రోజులుగా సాగు తున్న యుద్ధంలో 12 వేల మంది పైగా పాలస్తీనియన్లు మరణించారు. 2,700 మంది గల్లంతు అయ్యారు.
ఇజ్రాయెల్‌-హమాస్‌ల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందం అంతిమంగా ఇరుదేశాల మధ్య చర్చలకు నాంది అవుతుందని సౌదీ అరేబియా, ఈజిప్టు, జోర్డాన్‌ విదేశాంగ మంత్రులు పేర్కొన్నారు. గాజాలో పరిస్థితి మెరుగు పడాలని ఈ దేశాలు కోరుతున్నాయి. గాజాలో ప్రజల భద్రతకు ఇరువైపుల ప్రభుత్వాలు హామీ పడా లనీ, మొక్కుబడి చర్యలతో సరిపెట్టరాదని వారు ఒక ప్రకటనలో కోరారు. గాజాలో శాంతికోసం ఇస్లామిక్‌ దేశాలు కృషి చేయాలని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌ విజ్ఞప్తి చేశారు. కాల్పుల్లో గాయపడ్డవారికి తక్షణ వైద్య సాయం అందించడం, బాధితులకు ఆహార, వసతి సదుపాయాలు కల్పించడం వంటి చర్యలను తక్షణం అందించేందుకు ఇస్లామిక్‌ దేశాలు దృష్టిని కేంద్రీ కరించాలని సూచించారు. ఇజ్రాయెల్‌ – హమాస్‌ సంధిని భారత్‌ కూడా ఆహ్వానించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement