Tuesday, April 30, 2024

Editorial: నౌకలపై దాడులు.. చమురు సంక్షోభం!

యుద్ధాలతో ఎప్పటికీ అనర్థాలే. ఇది చరిత్ర రుజువు చేసిన సత్యం. వర్తమాన కాలంలో కూడా ఆధిపత్యం కోసం లేదా వనరులను సొంతం చేసుకోవడం కోసం పలు దేశాలు యుద్ధాలకు తలపడుతున్నాయి. వీటి వల్ల కలుగుతున్న ఆస్తి, ప్రాణనష్టాన్ని గురించి అవి ఆలోచిం చడం లేదు. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల్లో నగరాలు, పట్టణాలు భస్మీపటలం అయిపోయి పిల్లలు, మహిళల తో సహా అమాయకులు వేల సంఖ్యలో బలి అవుతున్న దృశ్యాలను ఇప్పటికీ మనం నిరంతర వార్తా స్రవంతుల లో చూస్తున్నాం.

ఇప్పుడు ఇజ్రాయెల్‌ – హమాస్‌ దళాల మధ్య సాగుతున్న యుద్ధం, రావణ కాష్టంలా తయారైం ది. ఈ యుద్ధానికి ఆజ్యం పోసిన అగ్రదేశాలే ఇప్పుడు శాంతిమంత్రం వల్లిస్తున్నాయి. హమాస్‌ దళాలకు మద్దతుగా యెమన్‌కి చెందిన హౌతీ ఉగ్రవాదులు ఎర్ర సముద్రంలో చమురు నౌకలపై దాడులు జరుపుతున్నా రు. చమురు ఉత్పత్తి దేశాల నుంచి చమురును ఇతర ప్రాంతాలకు ఎర్రసముద్రం మార్గం ద్వారానే చమురు రవాణా అవుతుంది. హౌతీ ఉగ్రవాదుల దాడులవల్ల చమురు నౌకలు ఎక్కడివి అక్కడే ఆగిపోతున్నాయి. దీనివల్ల చివరికి చమురు సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉంది. వీటివల్ల వాటిని ఎగుమతి చేసిన దేశాలకూ, చమురు కోసం ఎదురు చూస్తున్న దేశాలకూ తీవ్ర నష్టం జరుగుతోంది. అంతిమంగా వినియోగదారుల చెంతకు చేరేసరికి చమురు ధరలు ఎన్నో రెట్లు పెరిగిపోతున్నాయి. చమురు ఉత్పత్తి దేశాలకూ, ఎగుమతి దేశాలకూ సాయం అందిస్తున్న అగ్రదేశాలు లేదా సంపన్న దేశాలు సమస్య పరిష్కారానికి కృషి చేయడానికి బదులు పరిస్థితి ని అడ్డుపెట్టుకుని మరింత దోచుకోవడానికి ప్రయత్నిస్తు న్నాయి. అమెరికా తన నౌకల భద్రతకు నావల్‌ ఆపరేష న్స్‌ని ప్రారంభించింది. వివిధ దేశాలు కూడా ఈ ఆపరేష న్స్‌లో భాగస్వామ్యం అయ్యేట్టు చేయడం కోసం ఆయా దేశాల విదేశాంగ మంత్రులతో అమెరికా రక్షణ మంత్రి లైలాయెడ్‌ ఆస్టిన్‌ వర్చువల్‌ సమావేశాలను నిర్వహిస్తు న్నారు. చమురు ధరలు పెరగకుండా చూడటానికి ఈ దాడులను నివారించే మార్గాలపై చర్చలు జరుపుతున్నా రు. గతంలో విదేశాంగ విధానం ఆయా దేశాల విధానా ల ఆధారంగా రూపుదిద్దుకునేది. ఇప్పుడు ఆయా దేశాల కు ఏమేరకు ప్రయోజనకరమో ఆ రీతిలో ఆ విధానాలు తెరమీదికి వస్తున్నాయి. పెట్టుబడిదారీ, వర్థమాన దేశా లన్న తేడాలు లేకుండా తమకు ఏమేరకు లాభం చేకూరు తుందో ఆలోచించి ఆమేరకు నిర్ణయాలు తీసుకుంటు న్నాయి. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా పెట్టుబడి దారీ దేశాలతో చేతులు కలుపుతోంది. రష్యాని దూరం చేసుకుంటే ప్రమాదమని మిగిలిన దేశాలు రష్యాతో మైత్రికి సంసిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఇటీవల గల్ఫ్‌ దేశాల్లో పర్య టించారు. యెమన్‌ తీరానికి దక్షిణంగా గేట్‌ ఆఫ్‌ టియర్స్‌ వద్ద, సూయెజ్‌ కాలువ ఉత్తరాన ఈ ఉగ్రవాదులు దాడు లకు కాచుకుని కూర్చున్నారు. ఈ సమస్యను సమష్టిగా ఎదుర్కోవల్సి ఉండగా, ఎవరి అవసరాలు, స్వార్థం వారివి అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి దేశాలు. అందుకే అమెరికా రక్షణ మంత్రి యూకే, బహరైన్‌, కెనడా, ఫ్రాన్స్‌ దేశాల అధిపతులతో వర్చువల్‌ సమావేశాలను నిర్వ హించారు. హౌతీ ఉగ్రవాదులను కట్టడి చేయకపోతే తీవ్రమైన అంతర్జాతీయ సమస్య అవుతుందనీ, ఈ విషయంలో అన్ని దేశాలూ కలిసికట్టుగా వ్యవహరించా లని ఆయన పిలుపు ఇచ్చారు. చమురు ఎగుమతులు, దిగుమతులు అన్ని దేశాల రాజకీయాలకూ ఇరుసుగా పని చేస్తున్నాయి. వైరి దేశాలను సన్నిహితం చేసుకోవ డానికి చమురును తాయిలంగా ఉపయోగించుకుంటు న్నాయి. కొన్ని దేశాలు చమురు ఉగ్రవాదానికి పాల్పడు తున్నాయి. అంటే ధరలను పెంచేయడం, వర్థమాన దేశా లు విలవిలలాడేట్టు చేయడానికి వెనుకాడటం లేదు. హౌతీ ఉగ్రవాదుల దాడుల దృష్ట్యా చమురు నౌకలను రీరూట్‌ చేయాల్సి వస్తే, అంటే నౌకలు వెళ్తున్న మార్గం నుంచి వెనక్కి రప్పించి మరోమార్గంలో పంపించాల్సి వస్తే, వ్యయం పెరగడం, అంతిమంగా ధరలు పెరగడం అనివార్యం అవుతుందని ఈ రంగంలో అనుభవం ఉన్న వారు చెబుతున్నారు. దీనిని ఒక లాబీ నడిపిస్తోంది. అమెరికా, చమురు ఉత్పత్తి దేశాలు, రష్యా కలిసి చర్చిం చినట్టయితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. హమాస్‌కి మద్దతు ఇస్తున్న హెజ్‌బొల్లా ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌లోని ఐరన్‌డోమ్‌పై దాడి చేశారు.ఈ దాడులు ఎంత వరకూ వెళ్తాయో తెలియదు. ఇజ్రాయెల్‌ను కట్టడి చేయగల సత్తా అమెరికాకి ఉన్నప్పటికీ, అమెరికాయే ఇజ్రాయెల్‌ని మరింత ఎగదోస్తోంది. ఈ నేపధ్యంలో అంతర్జాతీయంగా వివిధ దేశాలు వాణిజ్య దృక్పథాన్ని కాస్త పక్కన పెట్టి సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకు ని నిర్ణయాలు తీసుకోవడం శ్రేయస్కరం.

Advertisement

తాజా వార్తలు

Advertisement