Friday, May 3, 2024

విష్ణు మాయతో తరించిన శతధన్వుడు

శతధన్వుడు భోజుని ముగ్గురు కుమా రులలో రెండవవాడు. అన్న దేవమీ ఢుడు. తమ్ముడు ‘కృతవర్మ’. ఒక నాడు అక్రూరుడు, కృతవర్మ ఇద్దరూ శతధన్వు ని వద్దకు వచ్చి హతవు చెప్పేవారి వలె ‘సత్రాజిత్తు’ తన కుమార్తెను ముందు మనకు ఇస్తానని వాగ్దానం చేసి, చెప్పిన మాట తప్పి శ్రీకృష్ణునికి ఇచ్చి పెండ్లి చేశాడు. నీతి తప్పాడు. నీవు నీ అభిప్రాయం వెల్లడించి ఏవిధంగానైనాసరే అతని వద్దనున్న ‘శమంతకమణిని’ తీసికో అని అతణ్ణి రెచ్చగొట్టారు. ఒకనాడు సాత్రాజిత్తు నిద్రిస్తుండగా అతణ్ణి చంపి, అతని భార్యలు మొరబెట్టుచుండగా శమంతకమణిని తీసికొనిపోయాడు. అంత సత్యభామ సత్రా జిత్తు చనిపోయిన తీరును తెలిసికొని దు:ఖించి, తండ్రి శవాన్ని నూనె తోట్టిలో పెట్టించి, హస్తినా పురానికి వెళ్లి శ్రీకృష్ణబలరాములకు తన తండ్రి మరణవార్త చెప్పింది. శ్రీకృష్ణబలరాములు సత్య భామతో ద్వారకకు పచ్చి శతధన్వుని చంపాలని నిశ్చయించారు. ఆ విషయం తెలిసికొన్న శత ధన్వుడు తనకు చావు మూడిందని భయపడి కృతవర్మ ఇంటికి వెళ్లి సహాయం చెయ్యమన్నాడు.
కృతవర్మ నిరాకరించగా, అక్రూరుని ఇంటికి వెళ్ళి శ్రీకృష్ణునితో వైరానికి రమ్మని అడుగుతాడు. అందుకు అక్రూరుడు ”శ్రీకృష్ణుడు సామాన్యుడు కాడు, మహానుభావుడు, అతడికి మేము చేతులెత్తి మ్రొక్కుతాము. ఆయనతో విరోధం పెట్టుకొనము. నీవు వేరేదారిన పొమ్ము, నీ పొత్తు మాకు చాలా నష్టం కలిగిస్తుంది” అని హతవు చెప్పాడు. అప్పుడు శతధన్వుడు శమంతకమణి ని అక్రూరుని వద్ద దాచి పెట్టి భయంతో నూరామడలు గుర్రం నెక్కి వెళ్ళి, చివరకు ‘మిథిలా నగ రం’ చేరాడు. గుర్రందిగి కాలినడకతో పరుగెత్తుచుండగా శ్రీకృష్ణుడు చూచి వెళ్ళకుమని నివారించి శతధ న్వుని తల తెగేటట్లు చక్రాయుధాన్ని ప్రయోగించాడు. శతధన్వుని తల తెగిపడింది. అయితే శతధన్వుని వద్ద శమంతక మణి లేదని గ్రహంచారు శ్రీకృష్ణబలరాములు. బలరాముడిని మణిని వెతకమని చెప్పి తాను మిథిలా నగరంలోని ‘జనకమహారాజు’ వద్దకు వెళతాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement