Saturday, April 20, 2024

ఆర్ట్ డైరెక్ట‌ర్ సునీల్ క‌న్నుమూత‌.. సంతాపం వ్య‌క్తం చేస్తోన్న ప్ర‌ముఖులు

హార్ట్ ఎటాక్ తో మ‌ర‌ణించారు ఆర్ట్ డైరెక్ట‌ర్ సునీల్.గురువారం రాత్రి అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన ఆయన్ని కేరళలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు వెంటనే చికిత్స అందించినా.. ప్రాణాలను కాపాడలేకపోయారు.సునీల్ బాబు మృతిపై ‘బెంగళూరు డేస్’ దర్శకురాలు అంజలీ మీనన్ సంతాపం వ్యక్తం చేశారు. ‘‘సునీల్ బాబు ఇక లేరని తెలిసి షాకయ్యా. ‘బెంగళూరు డేస్’ కోసం మేమిద్దరం కలిసి పనిచేశాం. ఆ రోజుల్లోని అద్భుతమైన జ్ఞాపకాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను మిత్రమా. రెస్ట్ ఇన్ పీస్ సునీల్’’ అంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నివాళులు అర్పించారు. సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు తమిళ హీరో విజయ్ నటించిన ‘వారసుడు’ (తమిళంలో ‘వారీసు’) మూవీ ఈ సంక్రాంతికి విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ మూవీకి ఆర్ట్ డైరెక్టరుగా పనిచేసిన సునీల్ . సునీల్ కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ‘వారసుడు’కు ముందు సునీల్ బాబు ‘బెంగళూరు డేస్’, ‘గజినీ’ సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ప్రతిభకు పలు అవార్డులు కూడా వరించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement