Thursday, May 16, 2024

వాలి వధ-తార విలాపం

సుగ్రీవుడు మహోత్సా#హంతో సవాల్‌ చేస్తూ పరస్పర యుద్ధానికి ఆహ్వానించడంతో వాలి ముక్కుపుటాలు రోషంతో అదిరాయి. అంతేకాదు ”వీడు మామూలుగా చెబితే వినడు” అంటూ మల్లయుద్ధానికి సమాయత్తం కావడంతో భార్య తార వారించింది. ”వీర శిఖామణి! క్రోధాన్ని విడిచిపెట్టు. యుద్ధం చేయాలని ఉంటే రేపు చేయవచ్చు. శత్రువు బల వంతుడు కాకపోయినా ఘడియ ముందే నీ చేతిలో చావుదెబ్బలు తిని మరల వచ్చాడంటే కారణం ఉంటుంది. సుగ్రీవుడు కార్యచతురుడు కేవలం నీ చేతిలో దెబ్బలు తినడానికి రాడు. ఇందాకే అంగదుడు చెప్పాడు. ఇక్ష్వాకు వంశజుడైన దశరథుడి కుమారులు రామలక్ష్మణులు సుగ్రీవునితో అగ్నిసాక్షిగా మైత్రి చేసుకున్నారని తెలిపాడు. రాముడు మహావీరుడట. ఆయన తో వైరం అంత మంచిది కాదు. అయినా మీ సోదరుల మధ్య విభేదాలు నాకు నచ్చలేదు. వెంటనే సుగ్రీవుని రప్పించి యువరాజూగా అభిషేకించు” అని భర్తను శాంతపరచడానికి ప్రయత్నించింది. తార మాటలను పట్టించుకోకుండా వాలి ఆవేశంతో ఉండటం చూసి తార మరలా ఇలా చెప్పడం ప్రారంభించింది.
”నువ్వు సుగ్రీవుడు ఒకటి అయినవేళ శ్రీరాముడు కూడా మన మిత్రుడు అవుతాడు. ఏదిఏమైనా సుగ్రీవుడితో సంధి చేసుకోవడం ఉత్తమ మార్గం” అని చెప్పింది.
భార్య మాటలకు స్పందించిన వాలి వీరుడైనవాడు శత్రు ధిక్కారాన్ని ఎలా సహస్తాడని ఊహస్తావు. రాముడు ధర్మవిధుడని చెబుతున్నావు కదా, అలాంటి ధర్మజ్ఞుడు నామీద ఎందుకు దాడి చేస్తాడు, నా మీద దిగులు మాని నీవు వెళ్లు” అన్నాడు. కన్నీరుతోనే తార వాలిని కౌగలించుకుని, హారతి ఇచ్చి ప్రదక్షిణ చేసి వెళ్లింది.
వాలి సింహద్వారం సమీపంలో కనిపించిన సుగ్రీవుని చూసి.. ”ఓరే! ఒక్క గుద్దుతో యమ సదనం చేరతావు” అని అరిచాడు. వెంటనే సుగ్రీవునితో యుద్ధానికి సిద్ధమై పిడికిలి తలపై బాదాడు. సుగ్రీవుడు అతి కష్టంతో తట్టుకుని ఒక మహావృక్షాన్ని పెరికి వాలి మీద విసి రాడు. వాలి- సుగ్రీవులు మత్తేభాల్లా పోరాడుతున్నారు. ఇద్దరి దేహాల నుంచి రక్తం ధారలుగా కారుతున్నది. ఇక ఎక్కువసేపు సుగ్రీవుడు నిలబడలేడని గ్రహంచి శ్రీరాముడు నారి సారించి ఆకర్ణాంతం లాగి బాణం వదిలాడు. అగ్నిశిఖల కాంతులు వెదజల్లుతూ బాణం వాలి ఎదలో నాటుకుంది. దాంతో మహావృక్షం కూలినట్లు వాలి నేలపై పడ్డాడు. జ్వలిస్తున్న అగ్నిహోత్రు నిలా ఉన్న వాలి వైపు రాముడు నడుచుకుంటూ వచ్చాడు. ఆయన్ని చూసి వాలి ”మీరు ఉన్న తమైన ఇక్ష్వాకు వంశంలో పుట్టిన వారు. మీరు ధర్మం తెలిసినవారు అంటారు. అలాంటి మీరు ధర్మం తప్పి యుద్ధమందు నిమగ్నమైన వారిపై బాణాలు వేస్తారుటయ్యా.. మీరు సత్య వ్రతులని, సుక్షత్రియులని శమదమదైవపరులని విన్నాను, ఇదేమి పనయ్యా! ఆ నమ్మకం తోనే తార ఎంత చెబుతున్నా వినక వచ్చాను. సుగ్రీవునితో మల్లయుద్ధం చేస్తున్న నా మీద బాణం వేసి ఏ ధర్మధ్వజం ఎత్తాలనుకుంటున్నావు. అడవిలో కాయ, పండు తినే వానరాన్ని వీరుడు,శూరుడు,ధర్మరక్షకుడవు అయిన నీవు ఇలాంటి అధర్మం ఎలా చేసావు, ఎవరో అల్పు డు చేయాల్సిన పని అన్ని తెలిసిన నీవు చేశావేమిటయ్యా అని నిందించాడు. మేము మృగజా తి వారం, పశుత్వం మా ప్రవృత్తి. నీవు మానవుడవు. వివేకం కలవాడవు. మానవులలో భూ మి, సంపద కోసం వైరం ఉంటుందని విన్నాం. కాని ఈ అడవిలో అలాంటిది లేదే. రాజనీతికి #హద్దులుంటాయి. దాన్ని నీవు అతిక్రమించలేదా రేపు పెద్దలు నిలదీస్తే ఏమి చెబుతావు?
అంతేకాదు, వానరుల చర్మం, మాంసం దేనికి పనికిరాదు. మా మాంసం క్షత్రియకుల కు నిషిద్దమే. మరి నన్ను ఎందుకు చంపారని అడిగాడు. మా తార అన్ని చెప్పింది,నేనే విన లేదు. ధర్మవ్రతుడైన దశరథునికి నీలాంటి ధూర్తుడైన పుత్రుడు ఎలా పుట్టాడని నిందించాడు. నా ముందుకు వచ్చి నీవు నాతో యుద్ధం చేసినట్లయితే నా ప్రతాపం చూపి నీకు యమ సదనం చూపేవాడనని అన్నాడు. నీవు సీత జాడ కోసం సుగ్రీవునితో స్నే#హం చేసారని అంటున్నారు. నాకు విషయం చెబితే సీతను రావణుడు ఎక్కడ దాచినా ఘడియలో జాడ తెలుసు కుని,ఆమెను నీకు అప్పచెప్పేవాడను. పిరికివాడు సుగ్రీవుని ఆశ్రయించడం ఏమాత్రం నీకు ఫలితం లేదు.” అని ప్రశ్నించాడు వాలి.
శ్రీరాముడు మాట్లాడుతూ ”నీవు ధర్మాత్ముడివా, కోడలు వంటి తమ్ముడి భార్యను ఆక్ర మించి భార్యను చేసుకున్నావు. సుగ్రీవుడు తాను తప్పు చేయలేదన్నా అతడ్ని వెడలగొట్టావు ఇవన్నీ ధర్మకార్యాలా అని అడిగాడు. అలాగే నేను నిన్ను వెనుక నుంచి బాణంతో కొట్టానన్నా వు. మేము క్షత్రియులం. వేట మాకు స#హజం. నీవు జంతువువి. జంతువులను వలవేయడం, దూరం నుంచి బాణంతో వేటాడడం, చంపడం చేస్తాం. ఇది అధర్మంకాదే” అని చెప్పాడు శ్రీరాముడు.
అంత వాలి రాముడు చెప్పిన ధర్మసూక్ష్మం గ్ర#హంచి ఆయనకు నమస్కరించాడు. ”నేను మిమ్మల్ని అధర్మమూర్తి అని దూషించాను నన్ను క్షమించు. నేను చనిపోతానని భయం లేదు. నాకు ఒకటే దిగులు నా కుమారుడు అంగదుడి గురించి. వాడిని మీరు సుగ్రీ వుని కాపాడినట్లు కాపాడతానని చెబితే హాయిగా ప్రాణం విడుస్తాను” అన్నాడు. రాముడు హామీ ఇచ్చి ”నీ కుమారుడిని యువరాజుగా సుగ్రీవుడు అభిషిక్తుడు చేస్తాడు” అన్నారు.
ఇంతలో తార గుండెలు బాదుకుంటూ వచ్చి వాలి మీద పడి శోకించడం ప్రారంభిం చింది. ”నేను చెబుతూనే ఉన్నాను. సుగ్రీవుడితో శత్రుత్వం వద్దని, దశరథరాజ పుత్రులు అత ని వెంట ఉన్నారని చెప్పినా నామాట పట్టించుకోక చివరకు ఈ దుస్థితిలో పడ్డావ”ని రోధిం చింది. శ్రీరాముడితో ”వాలిని చంపిన బాణంతోనే నన్ను చంపమని వేడుకుంది. భర్త పోయిన తరువాత నేను బ్రతికి ప్రయోజనంలేదు, నన్నూ చంపుము” అని కన్నీరు పెట్టుకుంది. ఆమెను ఓదార్చడం ఎవరివల్ల కాలేదు. ప్రాణం విడిచిన వాలి శరీరానికి అంత్యక్రియలు యథావిధిగా శ్రీరాముడు చేయించాడు. అనంతరం సుగ్రీవునికి రాజుగా పట్టాభిషేకం చేయిం చాడు. వాలి కుమారుడు అంగదుని యువరాజ్య పట్టాభిషేకం చేయించాడు శ్రీరాముడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement