Thursday, June 13, 2024

BRS Party Campaign – అయిదుతో కర్నాటకను ముంచారు… ఇక ఆరుతో తెలంగాణపై పడ్డారు…జరా కాంగ్రెస్ తో జాగ్రత్త: హరీష్ రావు

కేసీఆర్ నమ్మకం, విశ్వాసం..కాంగ్రెస్ మోసం దగా
కర్ణాటకనూ ఆగం చేసింది..ఇస్త్రీ అంగీలతో ఇక్కడకొచ్చారు
కరెంటు మూడు గంటలే . రైతు బంధు జీరో
ఆరు గ్యారెంటీ పథకాలు కాదు. ఆరు నెలల్లో ఆరుగురు సీఎంలు ఖాయం
వీళ్ల కుమ్ములాటలతో తెలంగాణ ఆగం ఆగం.. కొహెడలో మంత్రి హరీష్రావు

కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలు జరా కుదుట పడితే.. కాంగ్రెసోళ్లు అంగీల ఇస్త్రీలతో మళ్లీ వస్తున్నారు. ఆరు గ్యారెంటీలు ఇస్తారంట, ఆరు గ్యారెంటీలేమో గానీ, ఆర్నెల్లు గడవక ముందే అరుగురు సీఎంలు వస్తారు?, అప్పుడే 20 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు డబ్బులిచ్చానని కోమటి రెడ్డి చెబుతున్నాడు, కాంగ్రెస్ పార్టీది, సుతిలేని సంసారం అని రాష్ట్ర మంతి హరీష్ రావు కాంగ్రెస్ పార్టీపై వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు. హుస్పాబాద్ నియోజకవర్గం కొహెడలో మంగళవారం ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్షోకు కొహెడ జనం పోటెత్తారు. రోడ్లు కిక్కిరి పోయాయి.


ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ మాటలన్నీ మోసమే అన్నారు. కర్ణాటకలో అయిదు గ్యారెంటీలను జనాన్ని నమ్మించి అధికారంలోకి వచ్చారు. కానీ అక్కడ రైతులు ఎందుకు అధికారం ఇచ్చామాని నెత్తినోరు కొట్టుకొంటున్నారు. బీజేపీ 8 ఎనిమిది గంటలు కరెంటు ఇస్తే కాంగ్రెసోళ్లు మూడు గంటలే కరెంటు ఇస్తున్నారు. అదే పొద్దున్నే ఒక గంట, పొద్దుపోయాక రెండుగంటలు కరెంటు ఇస్తుంటే.. నీళ్లు పారక రైతులు అల్లాడి పోతున్నారు.
ఇక్కడ తెలంగాణాలో కేసీఆర్ మంచి కరెంటు , ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు కాలన కరెంటు ఇరవై నాలుగు గంటలు ఇస్తున్నారు, కాంగ్రెస్ పాలనలో మనకి ఎలాంటి కరెంటు ఉండేది దొంగ కరెంటు ఉండేది, మరి కేసీఆర్ ఇచ్చే మంచి కరెంటు కావాలా? కాంగ్రెస్ ఇచ్చే దొంగ కరెంటు కావాలా? అని హరీష్రావు ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు చార్జీలు, నీటితీరువా, భూమిశిస్టు వసూలు చేస్తే.. కేసీఆర్ మాత్రమే రైతులకు రైతు బంధు పేరిట డబ్బులు ఇస్తున్నారని, ఎకరానికి రూ.8వేలు నుంచి రూ.10వేలకు రైతు బంధును పెంచిన కేసీఆర్.. మళ్లీ గెలిస్తే ఎకరానికి రూ.16 వేలు ఇస్తానంటున్నారు. ఏది చెబుతారో? అదే కేసీఆర్ చేస్తారు. అదే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రైతు బంధు జీరో అవుతుందని హరీష్రావు హెచ్చరించారు.
ఎస్సీలు, ఎస్టీల అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని, తమ అవసరాల కోసం ఈ పేదోళ్ళు అసైన్డ్ భూములకు అమ్ముకునే అవకాశం కలుగుతుందన్నారు. ఇక రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం తినలేక బయటకు అమ్మి, మంచి బియ్యం కొనుక్కొంటున్నారని, ఇక రేషన్ బియ్యం ఇచ్చుడు, అమ్ముడు లేకుండా రేషన్ షాపుల నుంచి సోనా మసూరి బియ్యం ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని, అదే విధంగా పెన్షన్ ను రూ.5వేలకు పెంచారని హరీష్రావు వివరించారు.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని గెలిపించటానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రజల చుట్టూ తిరిగి, ఆ పార్టీ గెలిచిన తరువాత రాహుల్ జాడ లేడు, ప్రియాంక పత్తా లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీని నమ్మితే ఆగం ఆగం అవుతాం. కేసీఆర్ అంటే నమ్మకం, విశ్వాసం, ఆయన ప్రజల కోసమే ఆలోచిస్తాడు, మంచిగా అభివృద్ధి పథాన తెలంగాణ నడుస్తోంది. ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. ఇలాంటి బీఆర్ఎస్ను గెలిపిస్తే.. తెలంగాణ సుఖశాంతులతో విలసిల్లుతుంది, అందకే కారు గుర్తుకు ఓటు వేయాలని హరీష్రావు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement