Wednesday, May 8, 2024

సంపూర్ణ శివానుగ్రహానికి…

సృష్టి లయకారుడు పరమశివుడు చాలా దయగలవాడు. జలంతో అభిషేకించినా భక్తులు కోరిన కోర్కెలు తీర్చే బోళాశంకరుడు. భక్తి శ్రద్ధలతో శివుడిని పూజించే సాధకుడి జీవితానికి సంబంధించిన అన్ని కష్టాలు తొలగిపోతాయి కోరికలు నెరవేరుతాయి. దేవత లకు దేవుడు.. మహాదేవుడిని కొందరు శివుడు, ఇంకొందరు శంకరుడు, భోలేనాథ్‌, గంగాధరుడు, వంటి అనేక పేర్లతో పిలుస్తారు. ఆయన్ని పూజిస్తారు . శివునికి తనను ఏ ప్రాంతంలో పూజిస్తున్నారు. ఏ వ్యక్తులు పూజిస్తున్నారు అనే విషయాలతో ఎటువంటి సంబంధం ఉంటుందో.. అదే విధంగా ఆ రూపంలోనే ప్రసిద్ది చెందాడు. ఉదాహరణకు, శివుడు రావి చెట్టు క్రింద పూజలండుకుంటుంటే.. అతని భక్తులు అతనిని రావి చెట్టు దగ్గర శివుడు అని పిలవడం ప్రారంభిస్తారు. కార్తీక మాసంలో ఆ మహాదేవుడిని అనుగ్ర#హం కోసం చేసే శివుని పూజకు సంబంధించిన ఈ ముఖ్యమైన నియమాలను కొన్ని వున్నాయి. వాటిని ఖచ్చితంగా భక్తులు అందరూ తెలుసుకుని అదేవిధంగా పూజించడం శ్రేష్ఠం.
అన్నింటిలో మొదటి నియమం శివుడిని ఎల్లప్పుడూ స్వచ్ఛమైన మనస్సు, శరీరం తో పూజించాలి. అదే సమయంలో, ఎల్లప్పుడూ కుట్టని బట్టలు ధరించి శివుడిని పూజిం చడానికి ప్రయత్నించాలి. అంటే చిరిగిన బట్టలను కుట్టుకుని ధరించకూడదు.
నేలపై కూర్చొని శివుడిని ఎప్పుడూ పూజించకూడదు. శివుని ఆరాధనలో దర్భాస నాన్ని ఉపయోగించాలి. వీలైతే ఆసనంలో కూర్చుని శివుడిని పూజించాలి.
శివుడిని ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తరంముఖంగా కూర్చుని పూజించాలి.
శివపూజ సమయంలో మీ మనస్సులో ఎలాంటి కోపం, అసూయ, మరేదైనా తప్పుడు భావం రానీయకుండా చూసుకోవాలి.
శివుడిని పూజించేటప్పుడు, భస్మం, రుద్రాక్ష మొదలైన వాటిని శివునికి సమర్పించి, నుదుటిపై భస్మాన్ని ధరించాలి. పూజ సమయంలో మెడలో రుద్రాక్షను ధరించడం శ్రేష్ఠం. శంకరుని పూజలో నువ్వులు, సంపంగి పువ్వులు ఉపయోగించరాదు.
వీలైతే, తెల్లటి పువ్వులు, గంజాయి , బిల్వ పత్రం , జమ్మి ఆకులు మొదలైన వాటిని శివుని పూజలో సమర్పించాలి .
శివుని అనుగ్ర#హం పొందడానికి, ఎల్లప్పుడూ పాలు కలిపిన నీటితో శివలింగానికి అభిషేకించాలి. శివలింగంపై పాలప్యాకెట్లతో నేరుగా అభిషేకం చేయకూడదు. ఎల్లప్పు డూ ఒక పాత్రలో పాలు పోసి శివలింగానికి అభిషేకం చేయకూడదు. అంతేకాదు శివునికి సమర్పించే పాలు ఎప్పుడూ చల్లగా ఉండాలి. పొరపాటున కూడా కాచిన పాలు వేడిగా వున్నా, చల్లగా వున్నా ఎప్పుడూ అభిషేకం చేయకూడదు.
ఇంట్లో శివలింగానికి అభిషేకం, పూజ చేసిన అనంతరం దాన్ని ఒకే స్థానంలో వుంచాలి. ఎక్కడైనా సరేశివలింగాన్ని పూజించిన అనంతరం దాని స్థానాన్ని పదే పదే మార్చకూడదు. ఒకవేళ ఎప్పుడైనా శివలింగం ఉన్నచోటు నుంచి మార్చవలసి వస్తే.. ముందు శివలింగాన్ని గంగాజలంతోనూ, ఆ తర్వాత చల్లని పాలతో స్నానం చేయించి ఆ తర్వాత శివుడికి అపరాధ క్షమాపణలు చెప్పాలి. అనంతరం శివలిం గాన్ని స్థాన మార్పిడి చేయాలి..
ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్టించి పూజించాలని అనుకుంటున్నా రా? అయితే శివ లింగాన్ని ఎప్పుడూ ఒంటరిగా పూజ గదిలో పెట్టు కోకూడదు. ఆ పర మేశ్వరునితో పాటుగా, శివ కుటుంబం మొత్తం అంటే శివునితో పాటు, నందిని, పార్వతీదేవి ని, గణశుడిని, సుబహ్మణ్య శ్వర స్వామిని కూ డా ప్రతిష్టించి పూ జించాలి.ఈ నియ మాలను పాటిస్తూ ఈ కార్తీక మా సంలో శివపూజ చేసినట్లయితే ఆ పార్వతీపరమేశ్వరుల కృ పా కటాక్షాలను ఎల్లవే ళలా సమృద్ధిగా పొందవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement