Friday, May 10, 2024

తిరుప్పావై ప్రవచనాలు :

పాశురము : 10
ఆండాళ్‌ తిరువడిగలే శరణం

నోత్తు చ్చువర్‌క్కమ్‌ పుగుగిన్ఱ అమ్మనాయ్‌!
మాత్తముమ్‌ తారారో వాశల్‌ తిఱవాదార్‌
నాత్తత్తూళబుూయ్‌ ముడి నారాయణన్‌; – నమ్మాల్‌
పోత్తపఱౖ తరుమ్‌ పుణ్ణియునాల్‌! పణ్డొరునాళ్‌-
కూత్తత్తిన్‌ వాయ్‌ వీళ్‌ న్ద కుమ్బకరణనుమ్‌
తోత్తు మునక్కే పెరున్దుయిల్‌ తాన్‌ తన్దానో?
ఆత్త అనన్దలుడై యామ్‌! అరుఙ్గలమే!
తేత్తమాయ్‌ వన్దు తిఱవే లోరెమ్బావాయ్‌.

ఆండాళ్‌ తిరువడిగలే శరణం

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌ స్వామి వారి మంగళశాసనములతో…

తాత్పర్యము :

- Advertisement -

” మేము రాకముందే నోము నోచి దాని ఫలముగా సుఖానుభవమును పొందిన తల్లిd! తలుపు తెరువక పోయిననూ మాటనైననూ పలుకరాదా? పరిమళము నిండిన తులసి మాలలు కిరీటమున అలంకరించుకొనిన నారాయణుడు మేము మంగళము పాడిననూ పరనిచ్చు పుణ్యమూర్తి. అతనిచే ఒకనాడు మృత్యువులో పడవేయబడిన కుంభకర్ణుడు నీకు ఓడి తన నిద్రను నీకిచ్చెనో! నిద్ర నుండి లేచి మైకము వదలించుకొని తేరుకొని వచ్చి తలుపు తురువుము. నోరు తెరిచి మాటాడుము”
ఇచట నోము అనగా శరణాగతి వ్రతము, ఏకాదశీ వ్రతము శ్రీవ్రతము. ఇది భగవంతుడు మాత్రమే ఉపాయము అని నమ్ముట.
ఇచట తలపు అనగా అహంకారము. వాక్కు అనగా మంత్రోపదేశము.
కుంభకర్ణుడనగా తామసి. ‘కుంభకరణ’ అనగా అగస్త్యుడు.
1. అగ స్త్యుడు వింధ్య పర్వతమును పెరుగకుండా నిలిపెను — ఇది అహంకారమును అణుచుట
2. సముద్ర జలమును త్రావుట – వేదశాస్త్రాధయనము
3. వాతాపిని జీర్ణించుకొనుట – మృత్యువును జీర్ణించుకొనుట
ఈ పాశరమున పేయాళ్వారులను లేపుచున్నారు.
పొయ్‌గై పూదత్తాళ్వారులు జ్ఞానదీపమును వెలిగించి చీటకటిని పోగొట్టగా పేయాళ్వారులు స్వామిని అమ్మవారిని సేవించిరి. ‘ఇదియేనోత్తుచ్చువర్కం’ ‘పుగుగిన్నవమ్మనాయ్‌ ‘ ఈ విషయమునే రామానుజ నూత్తందాదిలో 10వ పాశురములో ఇట్లు చెప్పియున్నారు.
మన్నియ పేరిరుళ్‌ మాండపిన్‌ కోపలుళ్‌ మామలరాళ్‌
తన్నోడు మాయనై కండమైకాట్టుం తమిల్‌ తలైవన్‌ అని.
వీరు పెరుమాళ్ళను సేవించిన విధమునే ‘తిరుకండేన్‌ పొన్‌ మేనిక్కండేన్‌’ అని పాశురములో సాదించిరి.
ఇక వాక్యగురుపరంపరలో ‘శ్రీపరాంకుశదాసాయ నమ:’ అను వాక్యమును అనుసంధానము చేసుకొన వలయును.
వీరు మహాపూర్ణులు కదా! కావున వీరు విడిగా నోము నోచవలసిన పనిలేదు. శ్రియ:పతిని యనుభవించుటే వీరి నోము. అందువలన ఇచట ఈ వాక్యము సరిపడును.

డా|| కందాడై రామానుజాచార్య ఎమ్‌.ఎ., పి.హెచ్‌డి.

Advertisement

తాజా వార్తలు

Advertisement