Sunday, May 5, 2024

తిరుప్పావై ప్రవచనాలు :


పాశురము : 12
ఆండాళ్‌ తిరువడిగలే శరణం

కనైత్తిళఙ్గతైరుమై కన్ఱుక్కిరఙ్గి
నినైత్తుములై వళియే నిన్ఱుపాల్‌శోర,
ననైత్తిల్లమ్‌ శేఱాక్కుమ్‌ నఱ్చల్వన్తఙ్గాయ్‌!
పని త్తలైవీళ నిన్‌వాశల్‌ కడైపత్తి
చ్చినత్తినాల్‌ తెన్నిలఙ్గై క్కోమానై చ్చెత్త
మనత్తుక్కిని యానై ప్పాడవుమ్‌ నీవాయ్‌ తిఱవాయ్‌
ఇనిత్తా నెలున్దిరాయ్‌ ఈదెన్న పేరు ఱక్కమ్‌
అనైత్తిల్లత్తారు మఱిన్దే లో రెమ్బావాయ్‌

ఆండాళ్‌ తిరువడిగలే శరణం

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌ స్వామి వారి మంగళశాసనములతో…

తాత్పర్యము :
”పాల పితుకు వారు లేకపోవుటచే లేగదూడలు గల గేదెలు దూడలపై మనసు పోయి అరుచుచున్నవి. దూడలు వచ్చి త్రాగుచున్నటుల తలచి పొదుగు నుండి పాలు కారుచుండగా కారిపోయి, ఇల్లంతయు బురద యగునట్లు చేసిన మంచి సంపదగల వాని చెల్లెలా! మంచు తలపై పడుచుండగా నీ వాకిటి పై దండ పట్టుకుని నిలిచియున్నాము. కోపముతో దక్షిణ లంకాధిపతిని చంపిన మనోభిరాముని కీర్తించిననూ నీ నోరు విప్పి మాటాడవా. లేవనా? ఇదెక్కడి నిద్ర. లోకులందరు తెలిసిరి. ”
ఇచట గేదె అనగా సంస్కృతమున మహిషి, మహిషి యనగా లక్ష్మీదేవి. ఆమె పురుషకారమునకు మూలము. పురుషకారము కలవారు ఆచార్యులు. దూడలనగా శిష్యులు. శిష్యులకై దయతలచి చేయు జ్ఞానోపదేశమే పాలుకారుట. భగవద్దాస్యమే సంపద.
ద్వారమనగా తిరుగుమంత్రము. పైకమ్మి అనగా ‘నమ:’ అనునది. భగవద్భాగవత సేవలో కలుగు ఆనందము నాది కాదు అనుకొనుట పైకమ్మిన పట్టుకొనుట.
లంక యనగా శరీరము. దక్షిణ దిక్కు మృత్యువు స్థానము. రావణుడు మనసు. ఆ మనసును నిగ్రహించునది ఆచార్యోపదేశము. ‘ఆచార్యా! మౌనము దాల్చరాదు. జ్ఞానబోధను గావించుడు’ అని సారాంశము.
ఈ పాశురమున పొయ్‌గయాళ్వారులను మేల్కొలుపుచున్నారు. ‘తంగాయ్‌’ అను సంబోధనతో ఇది సూచించ బడుచున్నది. తంగైయనగా శ్రీమహాలక్ష్మి పేరు. శ్రీమహాలక్ష్మి పద్మమునుండి పుట్టినది. ఈ యాళ్వారు కూడా తామర పూవులోనే అవతరించిరి. కావున ‘తంగా’ యని పొయ్‌గయాళ్వారుకు సంకేతము.
‘కనుక్కిఱంగి’ ఈ అళ్వారులు ముదల్‌ తిరువందాది ప్రబంధమును సాధించి నది దూడవలె అమాయకులు అజ్ఞులగు చేతనుల విషయమున సాదించిన తనియచే సూచింపబడును.
ఇక గురుపరంపరలో ‘ శ్రీరామమిశ్రాయ నమ:’ అను వాక్యమును అనుసంధానమును చేసుకొనవలయును. ‘న చ్చెల్వంతంగాయ్‌’ అనునది వీరికి సరిపోవును. ‘ననైతిల్లం శేరార్కుం నచ్చెల్వం’ ఇల్లంతయా బురదయై ఆ బురదలోనే ఇంటివారు మునిగి పోయిరని దానిని సంపదగా కలవారని దాని కర్థము.
శ్రీరామమిశ్రుల ఆచార్యనిష్ఠచే ఆచార్యపుత్రిక బురదలో కాలిడుటకు సంకోచించినపుడు తాము ఆ బురదలో పరుండి గురుపుత్రికను బురద దాటించిరి. ఈ ఆచార్య నిష్ఠయే వీరి మంచి సంపదయని తెలియనగును. శ్రీరామమిశ్రులకు రామకథ చాలా ఇష్టము. అందుకే ఈ పాశురమున తెన్నిలంకై కోమానై చెత్త’ మనత్తుక్కినియానై పాడవుం నీ వాయ్‌ తిరువాయ్‌’ అని రామకథను సాధించిరి.

Advertisement

తాజా వార్తలు

Advertisement