Monday, May 13, 2024

అగ్రపూజ్యుని పూజా విశిష్టత

సర్వ పూజలలో… సర్వ శుభకార్యక్రమాలలో ఏవిధమైన అవాంతరాలు (వి ఘ్నములు) కలగకుండా విఘ్ననాయకుడైన ‘శ్రీ మహాగణపతి’ని తొలుత తప్పనిసరిగా పూజించుట ఈ కర్మభూమి యందు అనాది ఆచారము.
గణపతి దేవుని తత్త్వమును గ్రహించుటకు ముఖ్యంగా శాస్త్ర ప్రమాణాలే ఆధా రం. ‘గణ్యంతే బుద్యంతే గణా:’ అను శాస్త్రానుసారం సమస్తములకు, దృశ్యమాన పదార్థాలకు, సర్వగణాలన్నిటికీ అధిష్టాన దేవత గణపతి అని తెలుస్తోంది.
”ఓం గణానాంత్వా గణపతిగ్‌ం హవామహే|
కవిం కవీనా ముప మస్త్ర వస్తమమ్‌”|| – ఋగ్వేదం
గజాననుని గణపతిగా సంభావించిన ఋగ్వేద మంత్రం ఇది. ఈవిధంగా పరి శీలించిన ”గ” జ్ఞానార్థ వాచకం, ”ణ” నిర్వాణ వాచకం అనగా జ్ఞాన నిర్వాణ వాచక గణానికి అధిపతి వినాయకుడు. ఇంకో అర్థం- ‘గణ’ శబ్దానికి శివ పరివేష్టిత గణాల న్నిటికీ అధిపతి ఈ ‘గణనాథుడు’. ‘గణ’ శబ్దానికి వాక్కు అని అర్థం కూడా ఉంది. కావున వాగాధిపతి ‘గణపతి’ అందువల్లనే కొన్ని ప్రాంతాలలో ఈనాటికి ‘గణశా యనమ:’ అని అక్షరాభ్యాసాన్ని ప్రారంభించడం ఆచారంగా ఉంది.
యోగశాస్త్ర ప్రకారం మూలాధారానికి అధిదేవత ‘గణపతి’యని తంత్ర విధు లు చెప్పుచున్నారు. ”విగతోనాయక: యస్యస: వినాయక:” నాయకుడు లేనివాడు ‘వినాయకుడు’ అని వ్యుత్పత్తి అర్థం. అనగా సర్వస్వతంత్రుడు అని అర్థమౌతుంది. ”వినయతి శిక్షయతి దుష్టాన్‌ / విఘ్నాం శ్చేత వినాయక:” సర్వ విధాలైన సమస్త విఘ్నాలను రూపుమాపి సకల శుభాల్ని కలుగచేసే దైవం వినాయకుడు
”విష్ణు నేద గణపతే గణషు త్వామా వబర్వి ప్రతిమం కవీనామ్‌
న ఋతేత్వత్క్రియతే కించనారే మహమర్కం మఘవ భీ చత్రమర్చ”
– ఋగ్వేదం
ఓ గణపతి దేవా! స్తోత్రము చేయుచున్న మా మధ్య నీవు విరాజిల్లుము. నీవు జ్ఞాన మార్గమునకు వెలుగు చూపువాడవు. సర్వజ్ఞుడవని అభివర్ణించబడుచున్నా వు. నీవు లేనిచో శుభాశుభకర్మలు సవ్యంగా జరుగవు కనుక బుద్ధి, సిద్ధులకు అధిష్టాన దేవతవు నీవు! మా ప్రార్థనను స్వీకరించి మమ్ము కాపాడుము.
”ఏవం వినాయకం పూజ్యం గ్రహంశ్చైవ విధానత:|
కర్మణాం ఫల మాప్నోతి శ్రీయం చాపాత్యనుత్తమం”||
పరమ పూజ్యుడైన వినాయకుని, శాస్త్రోక్తంగా కర్మల నాచరించుచూ పూజించు ట వలన కర్మల ఫలితములనే కాకుండా శ్రీమహాలక్ష్మీ కటాక్షమును పొందవచ్చు. స్కాంద, మౌద్గల- పురాణాలలో వినాయకుని మహత్యం గురించి ఒక గాథ ఉంది.
పూర్వకాలమునందు ‘అభినందనుడు’ అను రాజు ఇంద్రభాగము లేని ఒక యజ్ఞాన్ని తలపెట్టాడు. తనకు భాగం లేదని కోపించి ఇంద్రుడు ఆ యజ్ఞాన్ని సర్వ ధ్వంసం చేయమని ‘కాలు’ని ఆజ్ఞాపించాడు. ఆ యజ్ఞపురుషుడైన కాలుడు ‘విఘ్నా సుర’ రూపమున అవతరించి, ఆ అభినందన రాజును సంహరించి, ఆ యజ్ఞాన్ని ధ్వంసంచేసి, దృశ్యాదృశ్యములగు సత్కర్మలన్నింటిని నాశనం చేస్తున్నాడు.
అంతట వరిష్టాదిమునులు కలత చెంది, బ్రహ్మ దేవుని వద్దకు వెళ్ళి శరణుజొ చ్చగా, బ్రహ్మజ్ఞానియైన పురుషుడే ‘కాలుని’ సంహరించగలడని, అందువల్ల అట్టి బ్రహ్మజ్ఞానియైన ‘గణశుని’ స్తుతించి ప్రసన్నుని చేసుకొని తమ కార్యమును నెరవే ర్చుకొమ్మని సలహా ఇచ్చెను. అంతట ఆ మునిగణము గణశుని స్తుతించగా, గణనా యకుడైన ఆ ‘వినాయకుడు’ ప్రసన్నుడై, విఘ్నాసురుని ఓడించెను. అంత కార్యా రంభ సమయమున గణపతి దేవుని పూజించినచో, ఎట్టి విఘ్నములు కలిగించనని మాట ఇచ్చి ఆ విఘ్నాసురుడు శ్రీ గణశుని శరణుజొచ్చెను. అప్పటి నుండి వినాయ కుడు విఘ్నేశ్వరుడయ్యెను. ఆనాటి నుండి ముందుగా విఘ్నేశ్వరుని పూజించడం ఆచారమైంది.
ఓమ్‌ గణానాంత్వా గణపతిగ్‌ం హవామహే|
కవిం కవీనాముపమశ్ర వస్తమం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతా
అన శ్యృణ్వన్నూ అభిస్సీద సాధనం||
అని నమస్కరించుచూ పుష్పాలతో విఘ్నేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించాలి.
వినాయకుని పూజించడంవల్ల శ్రీ మహాలక్ష్మీ కటాక్షం లభిస్తుందని యజ్ఞవల్క్య స్మృతి చెబుతోంది. వినాయక చవితినాడు గణపతిని ఆరాధించేవారు సర్వరోగ విముక్తులై ఆరోగ్యప్రద జీవనం, మేధా శక్తి, విద్య, కార్యసాధన, అనుకూల మి త్రత్వం, తక్షణమే పొందుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement