Saturday, October 12, 2024

గణేశ పురాణం

(ఉపాసనా ఖండం)

హిందూమతంలో అత్యధికంగా ఆరాధించే దైవం మహాగణపతి. శైవమతం, వైష్ణవం, శక్తిమతం, స్మార్తవాదం…వంటి అన్ని ప్రధాన హిందూ సంప్రదాయాలవారు ఆదిదేవునిగా కొలిచే దేవుడు గణేశుడు. ఆయన గురించి వ్యాసమహర్షి

సమగ్ర గ్రంథాన్ని రూపొందించారు. అదే గణేశ పురాణం. ఉపపురాణాల్లో ఒకటి అయిన ఈ గ్రంథంలో పురాణాలు, విశ్వరూపం, వంశావళి, రూపకాలు, యోగా, వేదాంత శాస్త్రం, గణేశునికి సంబంధించిన తత్త్వశాస్త్రం… ఇలా ఎన్నో ఉంటాయి. రెండు భాగాలుగా ఉన్న ఈ గ్రంథ పఠనాన్ని సులభతరం చేయాలని సంకల్పించారు రచయిత డాöö దేశిరాజు లక్ష్మీనరసింహా రావుగారు. అందుకే పురాణం మొత్తాన్ని ప్రశ్నలు – సమాధానాలు రూపంలో అందించారు. వాటిని వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా చింతన పాఠకులకు అందిస్తున్నాం…

పురాణాలను కూర్చిన కర్త ఎవరు? వేదవ్యాసుడు.
పురాణం అనగానేమి?
పూర్వకాల కథావిశేషం. పురాతనమైనా నూతనంగా ఉండేది. పురాణం అంటే పూర్వకాలంలో జరిగిన ఎన్నో విషయాల్ని వివరించి చెప్పేది.
పురాణాలు చతుర్వేదాలకు సంక్లిప్త రూపాలా? ఔను.
పురాణాలు ఎన్ని? ఎన్ని రకాలు?
పురాణాలు 18. రెండు రకాలు 18 పురాణాలు,
18 ఉపపురాణాలు
అవియేవి? వాని వరుస క్రమమేమిటి?
బ్రహ్మ, పద్మ, విష్ణు, శివ, లింగ, గరుడ, నారద, భాగ వత, అగ్ని, స్కంద, భవిష్య, బ్రహ్మ వైవర్త, మార్కండే య, వామన, వరాహ, మర్త్య, కూర్మ, బ్రహ్మాండ అను పద్దె నిమిది పురాణాలు.
పురాణం ఎలా పుట్టింది?
ప్రణవం నుండి పుట్టిందని భాగవత 12వ స్కందం
చెప్తుంది.
వేదవ్యాసుడు ఎవరి రూపం? శ్రీ మహావిష్ణువు.
అందుకు నిదర్శనం? విఘ్నా సహస్రనామాలు.
గణశ పురాణం పురాణమా? కాదు, ఉపపురాణం.
పురాణ రచనకు వ్యాసుడు ఎవరి సాయం తీసుకున్నాడు?
గణశుని.
అందుకు గణశుడు చెప్పిన నియమం ఏమి?
తన గంటం ఆగిపోకుండా వ్యాసుడు గుక్కతిప్పుకోక విరామం లేక చెప్పాలని.
పురాణాలు దేవుళ్ళ పేరుతో ఉన్నాయా?
ఉన్నాయి. ఉదా: బ్రహ్మ, విష్ణు, శివపురాణాలు
గణశ పురాణం ఎన్ని భాగాలు? అవియేవి?
రెండు భాగాలు 1) ఉపాసనా ఖండం 2) లీలా ఖండం
వేదవ్యాసుని మరో పేరు?
కృష్ణ ద్వైపాయనుడు, బాదరీయణుడు
(బ్రహ్మ సూత్రాల కర్త)
వేదద్యాసుడు, వ్యాసుడు ఒకరేనా? ఒకరే.
వేదవ్యాసుని తొలినామం? వ్యాసుడు
వేదాలను 4 భాగాలు చేయటం చేత ఏమయ్యాడు?
వెెదవ్యాసుడు
వేదవ్యాసుని కాలం? 12569 బిసిఇ.
సప్త చిరంజీవులలో ఆయనా ఒకడా? ఔను.
ఆయన ఇతర రచనలు ఏవి?
మహా భారతం, మహా భాగవతం, అష్టాదశ పురాణా లు, బ్రహ్మ సూత్రాలు, జనమేజయునికి వివరించినదే దేవీభాగవత పురాణం, వ్యాస సంహిత, వ్యాసస్మృతి.
ఆయనకు, వశిష్టులునకు గల సంబంధం?
వశిష్టుని కొడుకు శక్తి, శక్తి కొడుకు పరాశరుడు, పరాశ రునికి మత్స్యగంధి (యోజన గంధి) వలన వ్యాసుడు జన్మించాడు గనుక వశిష్టుని మునిమనవడు వ్యాసుడు.
వ్యాసుని జన్మవృత్తాంతానికి ఆధారం?
మహాభారతంలోని ఆదిపర్వం.
వ్యాసుని భార్యపేరు?
వాటిక (జాబాలి కుమార్తె). ఆమె మరో పేరు పంజల
వ్యాసుని పుట్టిన దినమును, వ్యాసుడు వేద విభజన చేసిన దినమును గురుపూర్ణిమ అంటారు. ఔనా? అవును.
వ్యాసుని వంశం? వశిష్ట వంశం
వ్యాస పుత్రులు ఎవరెవరు?
శుకుడు, ధృతరాష్ట్రుడు, పాండు, విదుర (అంబిక, అంబాలిక, పరిశ్రమి)
వ్యాసుని శిష్యులు?
పైల, జైమిని, వైశంపాయనుడు, సుమంతుడు.
వ్యాసుని సవతి సోదరులు ఎవరు?
చిత్రాంగద, విచిత్రవీర్య (సత్యవతి, శంతనుల సంతా నం)
సత్యవతి పూర్వ నామం? మత్స్యగంధి, యోజనగంధి
పరాశరుని కొడుకు ఎవరు?
వ్యాసుడు (ఆయన తల్లి మత్స్యగంధి)
వ్యాసుడు పదలిపేరాఝ ప్రతి యుగాన ఉన్నాడా?
ఔను, ద్వాపరయుగ వ్యాసుడు 2వవాడు.
ద్వాపరయుగ వ్యాసునికి పూర్వం ఉన్న యుగాలలో, ప్రతి మన్వంతరంలో వ్యాసులు ఉన్నారా?
ఉన్నారు. వశిష్టుడు కృతయుగ వ్యాసుడు. యోగవాశి ష్టకర్త. వైవస్వత మన్వంతరంలోని వ్యాసుడు మహాభార త కర్త.
కాబోయే వ్యాసుడు ఎవరు?
అశ్వర్థామ ద్రోణ పుత్రుడు. వ్యాసుని వలె అతను సప్త చిరంజీవులలో ఒకడు.
వేదాలు ఎన్నిసార్లు విభజితమయ్యాయి?
28 సార్లు, 28 మంది వ్యాసుల చేత.

Advertisement

తాజా వార్తలు

Advertisement