Saturday, December 7, 2024

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద విగ్రహం

ఫిబ్రవరి 5న ప్రారంభించనున్న మోడీ
216 అడుగుల ఎత్తున రామానుజాచార్య విగ్రహం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: శ్రీశ్రీశ్రీ రామానుజాచార్య 216 అడుగుల ఎత్త యిన విగ్రహం ఫిబ్రవరి 5న ప్రపంచానికి అంకితం కానుంది. కూర్చున్న స్థానంలో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద విగ్రహంగా పేర్కొన బడిన ఈ విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించనున్నట్లు చినజీ యర్‌స్వామి ఆశ్రమం గురువారం వెల్ల డించింది. నగర శివార్లలోని 45 ఎకరాల కాంప్లెక్స్‌ వద్ద రూ.1000 కోట్ల వ్యయం తో ప్రపంచ వ్యాప్తంగా భక్తుల నుండి వచ్చిన విరాళాల ద్వారా నిధులు సమకూ ర్చుకుని వీటిని రూపొందించారు. శ్రీ రామానుజాచార్యులు భూమిపై గడిచిన 120 సంవత్సరాల జ్ఞాపకార్థం 120 కిలోల బంగారంతో చేసిన రామానుజుల బం గారు విగ్రహం అంతర్భాగాన్ని ఫిబ్రవరి 13న రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ ఆవిష్క రించనున్నారు. రామానుజాచార్య 1000 సంవత్సరాలుగా సమానత్వా నికి నిజ మైన చిహ్నంగా మిగిలిపోయారు. ఈ ప్రాజెక్టు ద్వారా అతని బోధనలను కనీసం మరో 1000 సంవత్సరాలు ఆచరించేలా చేస్తుందని చినజీయర్‌ స్వామి అన్నారు. రామానుజాచార్య 1000వ జయంతిని పురస్కరించుకుని 1035 యజ్ఞం (అగ్ని ఆచారం), సామూహిక మంత్ర పఠనం లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సహా అనే కార్యక్రమాలు శ్రీరామానుజ సహస్రాబ్ది సమావేశంలో భాగంగా నిర్వ హించబడతాయి. ఫిబ్రవరి 2 నుంచి కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. సీ ఎం కేసీఆర్‌ చినజీయర్‌ స్వామితో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement