Saturday, April 27, 2024

ధర్మం మర్మం – మార్గశిరమాస విశిష్టత

తులసీకాష్ఠ సంభూతాం యో మాలాం మహతే నర: |
ఫలం యచ్ఛామ్యహం వత్స ప్రత్యహం ద్వారకోద్భవమ్‌ ||

నివేద్య భక్త్యా మాం మాలాం తులసీ కాష్ఠ సంభవామ్‌ |
వహతే యోనరో భక్త్యా తస్య వై నాస్తి పాతకమ్‌ ||

సదా ప్రీతమనాస్తస్య అహం ప్రాణ వరోహిస: |
తులసీకాష్ఠ సంభూతాం యో మాలాం వహతే నర: |
ప్రాయశ్చిత్తం న తస్యాస్తి నా శౌచం తస్య విద్యతే |

తులసీకాష్ఠ సంభూతం శిరస: కాష్ఠ భూషణమ్‌ |
బాహౌ కరేచ మత్స్యస్య దేహే యస్య స మే ప్రియ: ||

తులసీ కాష్ఠ మాలాభి: భూషిత: పుణ్యమాచరేత్‌ |
పితౄణాం దేవతానాం చ పుణ్యం కోటిగుణం లభతే ||
తులసీ కాష్ఠ సంభూతమైన మాలను ధరించిన వానికి ప్రతిదినము ద్వారకలో పుట్టిన ఫలమును నేనిచ్చెదను. తులసీకాష్ఠ సంభవమైన మాలను నాకు నివేదించి తాను ధరించినచో అతనికి పాతకమే లేదు. అతని విషయమై నేను ఎప్పుడు ప్రీతితో నుందును. అతను నాకు ప్రాణాధికుడగును. తులసీకాష్ఠ సంభవమైన మాలను ధరించినవానికి ప్రాయశ్చిత్తము ఉండదు. అతనికి అశౌచము ఉండదు. తులసీకాష్ఠ సంభవమైన మాలను శిరమున ధరించినవాడు, బాహువునందు, కంఠమునందు ధరించినవాడు దేహమున ధరించినవాడు నకు ప్రీతిపాత్రుడగును. తులసీకాష్ఠ సంభవమైన మాలను ధరించి పుణ్యము నాచరించవలయును. దేవతల విషయమున పితృదేవతల విషయమున ఆచరించిన పుణ్యము కోటిగుణమగను.

- Advertisement -

డా|| కందాడై రామానుజాచార్యులు

Advertisement

తాజా వార్తలు

Advertisement