Friday, April 19, 2024

పెగాస‌స్ పై మ‌మ‌తా బెన‌ర్జీకి సుప్రీం షాక్


పెగాస‌స్ స్నూపింగ్ పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. పెగాసస్ స్నూపింగ్ పై దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ లోకూర్ కమిషన్ పై చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ స్టే విధించారు. ఇవాళ కమిషన్ పై గ్లోబల్ విలేజ్ ఫౌండేషన్ అనే ఓ స్వచ్ఛంద సంస్థ వేసిన పిటిషన్ ను విచారించిన జస్టిస్ రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. మమత సర్కార్ పై అసహనం వ్యక్తం చేసింది. స్వతంత్ర కమిటీ దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించినప్పుడు.. రాష్ట్ర ప్రభుత్వం మరో కమిటీ వేయాల్సిన అవసరం ఏమొచ్చిందని జస్టిస్ రమణ అసంతృప్తి వ్యక్తం చేశారు. స్వచ్ఛంద సంస్థ వేసిన వ్యాజ్యంపై వివరణ ఇవ్వాల్సిందిగా జస్టిస్ లోకూర్ కమిషన్ ను ఆయన ఆదేశించారు. పెగాసస్ స్నూపింగ్ కేసు దేశంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇష్టారీతిన ప్రజల మీద నిఘా పెట్టడానికి ఎవరికీ అనుమతి లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీనిపై పార్లమెంట్ లోనూ ప్రకంపనలు సృష్టించిన విష‌యం విదిత‌మే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement