Sunday, April 28, 2024

పరమ ధర్మాలు!

కంచి పరమాచార్యుల వారు మానవాళికి అనేక సందేశాలను ఇచ్చారు. ఎల్లవేళలా ఎన్నో విషయాలను చెప్పేవారు. మానవులు ఆచరించాల్సిన పరమ ధర్మాలను, లౌకిక పార మార్థిక విషయాలను ఎంతో ఆసక్తికరంగా అందించారు. ప్రజల్లో నైతిక విలువలు పెంపొం దడానికి మార్గాలను సూచించారు. అహంసే పరమ ధర్మం అంటుంది మనుధర్మ శాస్త్రం. ఇంకొకరిని దేహ సంబంధంగా బాధపెట్టకపోవడం ఒక్కటే అహంస కాదు. మరొకరికి బాధ కలిగించే మాటలు కూడా మాట్లాడరాదు. మరొ కరి గురించి చెడుగా తలంచరాదు. త్రికరణ శుద్ధిగా మనం పాటించే అహంస వలన మనకు లభిం చే ఉత్తమ ఫలితం మనోనిగ్రహం.
అందరు తమలో నిక్షిప్తమై వున్న కామ క్రోధా లను అధిగమించాలి. కోరికలను అదుపులో ఉంచు కోవాలి. మనం చేసే పనులను ప్రేమతో చేయడం వలన ప్రపంచంలోని ఏ గడ్డు సమస్యకైనా పరిష్కా రం అవలీలగా సాధించగలం అని చెప్పేవారు బోధ న చేసేవారు పరమాచార్య. మనుషుల్లో నైతిక విలు వలను పెంపొందించడానికి పురాణాల్లోని కథలను తోలుబొమ్మలాట, హరికథలు, బుర్రకథలు వంటి ప్రాచీన కళల ద్వారా ప్రచారం చేయడం అవసరం. స్వధర్మాన్ని ఆచరించడమే మన కర్తవ్యం. స్వార్థ బుద్ధి లేకుండా మన పనులను చక్కగా చేయడమే నిజమైన భగవదారాధన అన్నారు పరమాచార్య.
ఆలయావరణలో దేవుని పూజకి కావలసిన మందార, మల్లె, పొన్న మొదలగు పూల మొక్కలు, ఆవు మేతకు ఉపయోగపడే అవిసె చెట్లు పెంచితే బావుంటుందన్న స్వామి వారి మాటలు మానవాళికి చక్కటి సందేశం.

కాంచిపురంలో మూడు ‘డై’ లు

ఎంతో కాలంగా కంచిలో నివసించే వారికి సైతం తెలియని మూడు డైలను గురించి పరమాచార్య వారు ఒకసారి వివరించారు.
మొదటి డై.. వడై. కం చిలో మిరియాల వడలు చాలా ప్రసిద్ధి, చాలా రుచిగా ఉండటమే కాదు, చాలా రోజులు నిలవ వుంటాయి.
రెండవ డై.. కుడై. కుడై అంటే గొడుగు. దేవాలయా లలో స్వా మి వార్లకు ఉపయోగించే గొడుగు రకరకాల డిజైన్‌లలో ఆకర్షణీయంగా తయారుచేస్తారు. వాటిని దేశంలోని అనేక దేవాలయాలలోనే కాక విదేశాలకు కూడా ఎగుమతి చేస్తారు.
మూడవ డై.. నడై. నడై అంటే నడక. వరదరాజ స్వామి వారి పల్లకి లేదా వాహనోత్సవం కనుల విందు గా ఉంటుంది. వాహనాన్ని మోసేవారు కదనానికి వెళ్లే సైనికుల లాగా ఎంతో ఉత్సాహంతో మోస్తారు. వారి నడకను సూచిస్తూ నడై అనే పదం వచ్చింది. మూడు డైలతో పాటు మూడు కోటిలు ఉన్నాయి.
1. కామకోటి. శ్రీ కామాక్షి అమ్మవారి దేవస్థాన గర్భా లయ విమానం. 2. రుద్రకోటి. ఏకాంబరేశ్వర దేవస్థాన గర్భాలయ విమానం. 3. పుణ్యకోటి. వరదరాజస్వామి దేవస్థాన గర్భాలయ విమానం.

Advertisement

తాజా వార్తలు

Advertisement