Friday, October 11, 2024

శ్రీరాముడి క్రోధాగ్ని

సీతాపహరణంతో విచలితుడైన శ్రీరాముడు చెట్టు పుట్టను, జంతువులను, పక్షులను, పర్వతాలు, నదులు కనపడిన అన్నింటినీ సీత జాడ అడిగా డు. తాను ఇన్నాళ్లు ధర్మం పాటించానని, అయినా దేవతలు సయితం మౌ నం వహంచడంతో ఒక్కసారిగా శోకంనుంచి క్రోధం ఉద్భవించింది. సమస్త జీవు లతో సహా దేవదానవ కిన్నెర కింపురుషాదులను, మూడు లోకాలను తన బాణాల తో భస్మీపటలం చేస్తానని ఆవేశంతో విల్లును ఎక్కుపెట్టాడు. క్రోధాగ్నితో రగిలిపో తున్న శ్రీరామున్ని చూసి లక్ష్మణుడు వణికిపోయాడు. అన్నకు నమస్కారం చేసి సంయమనం పాటించమని ప్రాధేయపడ్డాడు. మీరు ధర్మమూర్తి, కీర్తిమంతులు. కోపమే రాని మీరే క్రోధాగ్నిలో తప్పులు చేస్తే మీరు సాధించిన కీర్తి నాశనమవుతుం ది. సమస్త జీవులు మీమీద ఆధారపడి ఉన్నాయి. అటువంటి వాటిపట్ల మీరు కఠి నంగా ప్రవర్తించాలని నిర్ణయించడం బాధాకరమని వాపోయాడు. మనకు క్లేశం కలిగిందని అమాయక జీవులను శిక్షించడం న్యాయమా అని ప్రశ్నించాడు. శోకం కలగనిది ఎవరికి… సాక్షాత్‌ మన గురువు వశిష్టుని 100 మంది కుమారులను విశ్వా మిత్రుడు క్రోధంతో చంపినప్పుడు ఆయన శోకంలో కూడా సంయమనం కోల్పో లేదు. అలా శోకం లేనివారు ఈ లోకంలో లేరు. వదినను ఎత్తుకెళ్లిన రాక్షసులు దక్షి ణ దిశగా వెళ్లారని జంతువులు తమ సైగల ద్వారా చెప్పాయి. అలాంటి జంతువు లను చంపుతావా అన్నాడు. అసలు వదినను అపహరించినది ఒకే రాక్షసుడు అని ఇక్కడి సాక్ష్యాలు చెబుతున్నాయి. అతడు ఒక్కడిని చంపి ప్రతీకారం తీర్చుకోవాలి గాని ఇలా అమాయకులను పరిమార్చడం సబబా అని ప్రశ్నించాడు. జంతువులు చూపించిన మార్గంలో మనం వెతికి అసలు దుర్మార్గుడిని పట్టుకోవాలి. మన ప్ర యత్నం ముందుగా చేయాలి. ఎవరు సహకరించపోయినా, ఫలితం రాకపోతే అప్పుడు మీరు అనుకున్నట్టు మీ విల్లును ఎక్కుపెట్టి అనుకున్నది చేయవచ్చు. అప్పటివరకూ సంయమనం పాటిద్దామని లక్ష్మణుడు రాముడికి సలహా ఇచ్చాడు. దాంతో రాముని క్రోధం పూర్తిగా తగ్గి తమ్ముడికి తాను ధర్మం తప్పకుండా బోధిం చినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. వారు సీత జాడకోసం దక్షిణ దిక్కుగా బయలు దేరారు. కొంతదూరంలో పక్షిరాజు జటాయువు రక్తం మడుగులో పడి కొట్టుకుం టున్నాడు. రక్తం చూసి మొదట ఇతనే సీతను చంపి తిన్నాడని రాముడు అపార్థం చేసుకున్నాడు. బాణం ఎక్కుపెట్టాడు. అతికష్టం మీద జటాయువు మాట్లాడుతూ రామా నీ చేతిలో మరణం కన్నా నాకు సుఖమేమున్నదన్నాడు. దాంతో శ్రీరాముడు తన తప్పు తెలుసుకుని జటాయువును కౌగలించుకుని క్షమాపణ అడిగాడు. తన తండ్రి కావున ఆయనతో సమానమని చెప్పాడు. సీతను కాపాడే బాధ్య త తాను చేపడతానంటూ తాను బంగారు జింక వెంట వెళ్లేప్పుడు జటాయువు హామీ ఇచ్చిన విషయం గుర్తుకు వచ్చింది. అతికష్టం మీద మాట్లాడుతూ సీతను అపహరించినది విశ్రవసువు కుమారుడు, కుబేరుడి సోదరుడు, రావణుడని చెప్పి కన్నుమూసాడు. జటాయువు మరణం చూసి శ్రీరాముడు తీవ్రంగా శోకించాడు. సీతా వియోగం వల్ల కలిగిన శోకం కూడా మరచాడు. తండ్రి అంతటివాడు మర ణించగా అది పెద్ద శోకంగా భావించాడు. పెద్దశోకం ముందు చిన్న శోకం అంత తీవ్రం అనిపించదు. జటాయువుకు రామలక్ష్మణులు దహన సంస్కారాలు నిర్వ హంచి నదిలో దిగి తండ్రికి చేసినట్లు తర్పణాలు వదిలారు. అనంతరం సీత జాడ వెతుకుతూ ముందుకు కదిలారు. శ్రీరాముడు కొద్దిసేపు క్రోధాగ్నికి వశమైనా ఇం ద్రియ నిగ్రహం కలవాడు కనుక వెంటనే లక్ష్మణుడి మాటలకు తగ్గి సంయమనం పాటించాడు. అందుకే శ్రీరాముడిని ధీరోదాత్తు డు, పురుషోత్తముడు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement