Sunday, December 10, 2023

KNL: మొబైల్ కు ఛార్జింగ్ పెడుతూ.. విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

కర్నూలు : మొబైల్ కు ఛార్జింగ్ పెడుతూ వ్యక్తి మృతిచెందిన ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని అవుకు మండలంలోని జూనూతుల గ్రామానికి చెందిన చాకలి రామకృష్ణ (44) అనే వ్యక్తి తమ ఇంట్లో మొబైల్ కు ఛార్జింగ్ పెడుతూ విద్యుత్ షాక్ తో మృతిచెందాడు.

- Advertisement -
   

మృతిచెందిన వ్యక్తికి భార్యతో పాటు ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇంటి పెద్దదిక్కును కోల్పోవడంతో కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరును పలువురిని కంటతడి పెట్టించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement