Monday, May 20, 2024

అమృత ప్రవాహ రూపిణి శ్రీలలితా త్రిపురసుందరి

మహశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణీ,
మహాకామేశ మహషీ మహా త్రిపుర సుందరీ||

దసరా త్రిపురసుందరి లేదా లలితా త్రిపురసుందరి దశమహా విద్యలలో ఒక రూపము. శ్రీ చక్రముపై ఎడమ పాదమును మోపి, చెరకు విల్లు, పుష్ప బాణములు ధరించి బంగారు సింహాసనముపై ఆశీనురాలైె వుంటుంది. లలితాత్రిపుర సుందరిని ఆరాధించుట వలన ప్రశాంతత, ఆరోగ్యము, జనాధికారత కలుగును. శ్రీ మహావి ష్ణువు ఈమెను ఆరాధించి మోహనీ రూపం ధరించాడని పురాణోక్త ము. పరమశివుని పర్యంకముపై జ్ఞానము మరియు ఆనంద ప్రవా హ రూపములో ఆసీనురాలై వుంటుంది. జ్ఞానము మరియు ఆనం దములతో కూడిన అమృత ప్రవాహరూపిణిగా త్రిపురసుందరీదే విని ఆదిశంకరులు దర్శించారు. ఉదయించుచున్న సూర్యుని వం టిదై, చతుర్భాహువులు, మూడు నేత్రములు కలదై, పాశము, అం కుశము, బాణములు, ధనుస్సు ధరించినదై యున్న ఆ మాతను యోగులు తమ హృదయ కుహరమున ధ్యానింతురు. పృధివీ తత్త్వముగల మూలాధార చక్రమును, అగ్నితత్త్వము గల స్వాధిష్టా న చక్రమును, జలతత్త్వము గల మణిపూర చక్రమును, వాయుత త్త్వము గల ఆనాహత చక్రమును, ఆకాశతత్త్వము గల విశుద్ధి చక్ర మును, మనస్తత్త్వము గల ఆజ్ఞాచక్రమును, సుషుమ్నా మార్గమున షట్చక్రభేదనము చేసికొని, సహస్రసార చక్రములో సదాశివునితో గూడి వసించి యుంటుంది. లలితా కవచ పారాయణ, లలితా స హస్రనామ పారాయణ అత్యంత ఫలదాయకము. లలితా సహస్ర నామములను పరిశీలించినట్లయితే ఒక్క నామము కూడా పునరు క్తి వుండదు. ఎనిమిది వాగ్‌దేవతలైన వశిని, కామేశ్వరి, మోదిని, వి మల, అరుణి, జయని, సర్వేశ్వరి, కౌళినిల ద్వార రచింపబడినది.

శ్రీ లలితా త్రిపురసుందరి స్తోత్రము

శ్రీ విద్యాం పరిపూర్ణ మేరుశిఖరే బిందు త్రికోణ స్థితాం
వాగీశాది సమస్త భూత జననీం మంచే శివాకారకే
కామాక్షీం కరుణా రసార్ణవమయీం కామేశ్వరాంక స్థితాం
కాంతాం చిన్మయ కామకోటి నిలయాం శ్రీ బ్రహ్మవిద్యాం భజే!!
లలితాదేవికి గులాబీరంగు వస్త్రము ధరింపచేసి, నీలంరంగు పువ్వులతో పూజచేసి పాయసం నైవేద్యంగా సమర్పించాలి.
ఆబాల గోప విదితా సర్వానుల్లంఘ్య శాసనా
శ్రీ చక్రరాజ నిలయా శ్రీమత్త్రిపుర సుందరీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement