Thursday, May 2, 2024

శ్రీకాళహస్తి కళకళ

శ్రీకాళహస్తీశ్వరాలయం, ప్రభ న్యూస్‌: ఓం నమ:శివాయ… హర హర మహదేవా శంభోశంకర… అంటూ శివ నామ స్మరణతో శ్రీకాళహస్తి పట్టణంలోని చతుర్మాడ వీధులు మార్మోగాయి. ‘జైజై మాతా… జగన్మాతా’ అంటూ జ్ఞాన ప్రసూనాంబను భక్తులు స్తుతించారు. చతుర్మాడ వీధుల్లో ఏ నోట చూసినా ఉమామమేశ్వరుల నామస్మరణ. జయ జయ ధ్వానాల మధ్య శివ, పార్వతుల రథాలు ముందుకు సాగాయి. శ్రీకాళ హస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించు
కుని 7వ రోజైన బుధవారం ఉదయం శ్రీకాళహస్తీశ్వరస్వామి, జ్ఞానప్రసూనాం బ అమ్మవారి రథోత్సవం అంగరంగ వైభ వంగా జరిగింది. రథోత్సవాన్ని తిలకిం చడానికి వేలాది మంది భక్తులు తరలివ చ్చారు. ఉదయం 9గంటల నుంచే తేరువీధి, నెహ్రూవీధి, నగరివీధి, బజారువీధి భక్తులతో నిండిపోయాయి. సర్వాలం కార భూషితులైన గౌరీశంకరులు అలంకార మండపం నుంచి ఉదయం 10గంటలకే బయలుదేరి బిక్షాల గాలిగోపురం ముందు భాగాన ఉన్న రథాల వద్దకు చేరుకున్నారు. ఒక రథంపై గంగాదేవి సమేత శ్రీకాళహస్తీశ్వరుడు, మరో రథంపై శంకరుని దేవేరి జ్ఞానప్రసూనాంబ అమ్మవారు రథాలను అధిరోహించారు. రథాలపై ఆశీసులైన శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞానప్రసూనాంబ అమ్మవారికి వేదపండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఉదయం 11గంటలకు స్వామివారి రథం బయలుదేరింది. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ- పడ్డారు. పెద్దయెత్తున శివనామస్మ రణ చేశారు. తేరువీధి, నెహ్రూవీధి. నగరివీధి గుండా స్వామి వారి రథా న్ని భేరివారి మండపం వరకు మొ దట లాగారు. ఆ తర్వాత అమ్మవారి రథాన్ని ముందుకు కదిలించారు. జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని కీర్తి స్తూ భక్తులు రథాన్ని ముందుకు లాగుతూ వచ్చారు. అమ్మవారి ర థం పెండ్లిమండపం వరకు తీసుకు వచ్చి అక్కడ కొద్దిసేపు ఆపారు. ఆ తర్వాత స్వామివారి రథాన్ని భేరివా రి మండపం నుంచి బిక్షాల గాలి గోపురం వరకు తీసుకెళ్లారు. అనం తరం అమ్మవారి రథాన్ని నగరివీధి గుండా బిక్షాల గాలిగోపు రం వరకు జయజయ ధ్వానాల మధ్య తీసు
కువచ్చారు. ఇక రథోత్సవం సంద ర్భంగా ఉప్పు, మిరియాలు చల్లు తూ భక్తులు మొక్కులు తీర్చు కున్నారు. ఈ మిరియాలను తింటే కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం. అదేవిధంగా రథాలు కదిలే మార్గంలో ఇసుక చల్లారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి, ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు, ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు, ప్రముఖులు, ఆలయాధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement