Friday, May 3, 2024

విశాఖ శారదాపీఠంలో రుద్రహోమం

విశాఖపట్నం, ప్రభన్యూస్‌ బ్యూరో: విశాఖ శ్రీ శారదాపీ ఠం శివ నామస్మరణతో మార్మోగింది. మహాశివరాత్రి వేడు కలు బుధవారం వరకు కొనసాగాయి. భక్తులంతా హ రినామ స్మరణతో పీఠం ప్రాంగణాన్ని హోరెత్తించారు. దీప కాంతు లతో రూపొందించిన జ్యోతిర్లింగార్చన శివరాత్రి వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శివ స్వరూపుడు, ఆది గురువు అ యిన మేధా దక్షిణామూర్తికి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిం చడంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. మహన్యాస పూర్వ కంగా సాగిన ఈ అభిషేకంలో పీఠాధిపతులు స్వరూపానం దేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు 11 రకాల ద్రవ్యాలను వినియోగించారు. లింగోద్భవ కాలం దాటే వరకు దాదాపు మూడున్నర గంటల పాటు- ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వ హించారు. అనంతరం పరమేశ్వరునికి జ్యోతిర్లింగార్చన చేపట్టారు. జ్యోతిర్లింగార్చనకు పీఠాధిపతులు హారతులిచ్చి పూజలు చేసారు. ఆతర్వాత చంద్రమౌళీశ్వరునికి పంచామృ తాలతో అభిషేకం చేసారు. అనంతరం తాండవ మూర్తి సన్నిధిలో రుద్రహోమం, మృత్యుంజయ హోమం నిర్వ హించారు. బ్రహ్మ ముహుర్తంలో హోమాలకు పూర్ణాహుతి చేసారు. మహాశివరాత్రి సందర్భంగా ఉపవాస దీక్ష చేపట్టిన భక్తులకు పీఠాధిపతులు స్వయంగా ప్రసాదాన్ని పంపిణీ చేసి, శివతత్వాన్ని బోధించారు. శివరాత్రి సందర్బంగా జాగరణ చేసే భక్తుల సౌకర్యార్థం తెల్లవారుజాము వరకు పీఠం ప్రాం గణంలోని దేవతామూర్తుల ఆలయాలను తెరిచే ఉంచారు. విశాఖ శ్రీ శారదాపీఠం నిర్వహించిన మహాశివరాత్రి వేడుకల కు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. లోక కళ్యాణం కోసం రుద్రహోమం నిర్వహించడం జరిగిందని పీఠం వర్గా లు తెలిపాయి. ఈ సందర్భంగా భక్తుల నుద్దేశించి పీఠాధి పతులు అనుగ్రహబాషణం చేస్తూ లోకకళ్యాణార్ధం విశాఖ శారదాపీఠం అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుంద న్నారు. శివారాధన చేసిన వారికి సర్వపాపాలు హరించుకు పోయి వారి కుటుంబాలు సుఖసంతోషాలుతో చల్లగా కలకా లం ఉంటారన్నది భక్తకోటి ప్రగాడ విశ్వాసంగా స్వామీజీలు తెలిపారు. పండుగల నిర్వహణతో పాటు నిరంతరం యజ్ఞ యాగాదులు, హోమాలు, లోకకళ్యాణార్ధం విశాఖ శారదా పీఠం నిర్వహిస్తూ వస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement