Friday, April 26, 2024

Ugadi Panchangam | శోభకృత్‌ నామ సంవత్సరంలో సింహ‌ రాశివారికి ఎలా ఉంటుందంటే..

ఆదాయం – 14, వ్యయం – 02
రాజ్య పూజ్యం – 01, అవమానం – 07

గురువు 22.3.2023 ఉగాది నుండి 21.4.2023 వరకు మీనరాశి 8వ స్థానమై అశుభుడైనందున మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించుట అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలేర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణవల్ల ఇబ్బందుల నెదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టు- కార్యాలకు దూరంగా వుంటారు. 22.4.2023 నుండి వత్సరాంతం వరకు మేషరాశి 9వ స్థానమై శుభుడైనందున స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన గృహకార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు. భక్తిశ్రద్ధలధికమవుతాయి.

శని 22.3.2023 ఉగాది నుండి వత్సరాంతం వరకు కుంభరాశి 7వ స్థానమై శుభుడైనందున విదేశయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. మనోవిచారాన్ని పొందుతారు. కుటు-ంబ పరిస్థితులు సంతృప్తికరంగా వుంటాయి. ఆకస్మిక ధననష్టంపట్ల జాగ్రత్త వహించుట మంచిది. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు.

రాహువు 22.3.2023 ఉగాది నుండి 30.10.2023 వరకు మేషరాశి 9వ స్థానమై సాధారణ శుభుడైనందున తలచిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా నుండుట మంచిది. మోసపోయే అవకాశాలుంటాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. నూతన కార్యాలు ప్రారంభించరాదు. ప్రయాణాలెక్కువ చేస్తారు.31.10.2023 నుండి వత్సరాంతం వరకు మీనరాశి 8వ స్థానమై అశుభుడైనందున మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గూర్చి జాగ్రత్త వహించాలి. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం. ప్రయత్నకార్యాల్లో ఇబ్బందులెదురవుతాయి. విదేశయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి.

- Advertisement -

కేతువు 22.3.2023 ఉగాది నుండి 30.10.2023 వరకు తులారాశి 3వ స్థానమై శుభుడైనందున నూతన వ్యక్తులను నమ్మి మోసపోరాదు. సంఘంలో అప్రతిష్ఠ రాకుండా జాగ్రత్తపడుట మంచిది. ప్రయత్నకార్యాలకు ఆటంకాలెదురవడంతో ఇబ్బంది పడతారు. దైవదర్శనానికి ప్రయత్నిస్తారు. ఋణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. సోదర వైరం కలిగే అవకాశముంటు-ంది. 31.10.2023 నుండి వత్సరాంతం వరకు కన్యారాశి 2వ స్థానమై సాధారణ శుభుడైనందున ఋణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొనుటకు కృషి చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement