Friday, September 22, 2023

Ugadi Panchangam | శోభకృత్‌ నామ సంవత్సరంలో వృష‌భ‌ రాశివారికి ఎలా ఉంటుందంటే..

ఆదాయం -14, వ్యయం – 11
రాజ్య పూజ్యం – 06, అవమానం – 01

గురువు 22.3.2023 ఉగాది నుండి 21.4.2023 వరకు మీనరాశి 11వ స్థానమై శుభుడైనందున అన్నికార్యములందు విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రుబాధలుండవు. శుభవార్తలు వింటారు. గౌరవ, మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటు-ంబంలో అభివృద్ధితో పాటు- ఆకస్మిక ధనలాభముంటు-ంది. 22.4.2023 నుండి వత్సరాంతం వరకు మేషరాశి 12వ స్థానమై అశుభుడైనందున ఋణప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలుంటాయి. శుభకార్యాల మూలకంగా ధనవ్యయం అధికమవుతుంది. ప్రయాణాలెక్కువ చేస్తారు. అనారోగ్యమేర్పడకుండా జాగ్రత్త అవసరం.

శని 22.3.2023 ఉగాది నుండి వత్సరాంతం వరకు కుంభరాశి 10వ స్థానమై సాధారణ శుభుడైనందున ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందుల అధిగమిస్తారు. మీరు చేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలుగకుండా జాగ్రత్త అవసరం. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ధైర్యసాహసాలతో నూతన కార్యాలు ప్రారంభిస్తారు.

- Advertisement -
   

రాహువు 22.3.2023 ఉగాది నుండి 30.10.2023 వరకు మేషరాశి 12వ స్థానమై అశుభుడైనందున ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. వృధాప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలున్నాయి. సన్నిహితులతో విరోధమేర్పడకుండా మెలగుట మంచిది.31.10.2023 నుండి వత్సరాంతం వరకు మీనరాశి 11వ స్థానమై శుభుడైనందున నూతన వస్తు, వస్త్ర వాహన, ఆభరణ, లాభాల పొందుతారు. ఆకస్మిక ధనలాభయోగ ముంటు-ంది.శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తి అవుతుంది.

కేతువు 22.3.2023 ఉగాది నుండి 30.10.2023 వరకు తులారాశి 6వ స్థానమై శుభుడైనందున శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. దూర బందువులతో కలుస్తారు. తద్వారా లాభాలుంటాయి. విదేశయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభయోగముంటు-ంది. అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. 31.10.2023 వత్సరాంతం వరకు కన్యారాశి 5వ స్థానమై సాధారణ శుభుడైనందున పట్టు-దలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లలపట్ల జాగ్రత్తగా నుండుట మంచిది. వృత్తిరీత్యా గౌరవ,పొందుతారు. కుటు-ంబ పరిస్థితులు సంతృప్తికరంగా వుంటాయి. మనోల్లాసాన్నిపొందుతారు.స్వల్ప అనారోగ్య బాధలుంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement