Thursday, May 2, 2024

ఆత్మాన్వేషణే ఆధ్యాత్మికత!

నవవిధ భక్తి మార్గములలో చేసే సాధననే ఆధ్యాత్మికత సాధ న అనవచ్చు. ఆత్మదర్శనం క్షణంలో కలిగిన వారున్నారు, అలాగే ఎన్ని జన్మలెత్తినా సఫలం కానివారున్నారు. ఆత్మ సా క్షాత్కారానికి కొన్ని జన్మలు కూడా పట్టవచ్చు. మరి ఇటువంటి దానికోసం ఎందుకీ శ్రమ అనే సందేహం రావడం చాలా సహజం. ఈ సందేహం రావడమే ఆత్మాన్వేషణకు ప్రథమ సోపానం. పూర్వ జన్మ వాసనల ఫలితమే ఈ సందేహం అంకురించడం. సగుణోపా సన సాధన చేయనిదే నిర్గుణత్వానికి మార్గం దొరకదు. అయితే సగు ణోపాసనలోనే ములిగిపోతే సాధన అక్కడే ఆగిపోతుంది. ఈ శరీ రం ఒక పదార్థం. ఆత్మ యథార్థం. పదార్థం కనుకనే శరీరం ఒక యంత్రం. అంత:చతుష్టయం చేసే కర్మ నియంత్రణ వలన ఇది నడు స్తుంది. ఇంధనంగా ఆహారం తీసుకుంటుంది. ఆహారం కల్తీ కాకుం డా ఉంటే ఇది సజావుగా నడుస్తుంది. అయితే ఈ నియంత్రణ శక్తికి మూలాధారం ఆత్మ అనే చైతన్యం. మరి ఈ ఆత్మకు కర్త ఎవరని సం దేహం రావడమే వివేకం. ఆత్మకు కర్త కర్మ క్రియ పరమాత్మయని సనాతన వాఙ్మయం విశదీకరిస్తోంది. మనసు ద్వారా సాధన చేస్తే ఆత్మ అను రెండు అక్షరాల ఉనికి తెలుస్తుంది. ఈ రెండక్షరాల మనన మే ఆత్మాన్వేషణ. గురువు నుండి లభించిన మంత్రం లాగే అనుక్ష ణం ఆత్మ అనే రెండక్షరాల మననమే ఆత్మశోధన. ఇది చిత్రంగా కని పించవచ్చు, కాని ఆత్మ మన లోపల ఉందా? బయట ఉందా? మరి ఎక్కడ ఉంది? అని నిరంతరం ప్రశ్నించుకోవడమే సాధన. నవవిధ భక్తి మార్గంలో చేసే వివిధ ఆధ్యాత్మిక కర్మలన్నీ ఈ ప్రశ్నలు లేకుండా చేయకూడదు. అందుకే అంతిమంగా ఆత్మ నివేదన సూచిస్తోంది. ఆత్మ లభించకపోతే ఇక నివేదన అనే మాటే లేదు కదా! అందుకే ఆధ్యాత్మిక సాధన అంటేనే ఆత్మ గురించి ఆలోచన చేయడం. ఆత్మా న్వేషణయే ఆధ్యాత్మిక జీవితం. దీనికి క్షణం నుండి అనేక జన్మలు పట్టవచ్చు. కానీ ఆత్మ సాక్షాత్కారం పరమ సత్యం.
ఆత్మ లభించినపుడు ఆత్మతోనే నివేదన జరుగుతుంది. త్రిగు ణాతీత మరియు త్రయవస్థలు దాటి తురీయములో గాని ఆత్మ దర్శ నము కాదు. తురీయవస్థలోనే ఆత్మ పరమాత్మలో లీనమై జన్మరా హిత్యం కలుగుతుందని మన సనాతన విజ్ఞానం తెలియజేస్తోంది. తురీయము అనగా ఏ ఆలోచనా లేని, ఏ భాష నిర్వచించలేని స్థితి. మరి ఈ అనిర్వచనీయమైన దాని కోసం అన్వేషణ ఎందుకు? ఈ అన్వేషణలోనే సచ్చిదానందాన్ని చూస్తారు యోగిపుంగవులు.
యోగపుంగవులంటే ఎక్కడో హిమాలయాల్లో, గుహల్లో ఉం టారనేది నిజమే, కాని ప్రకృతిలో మమేకమై సామాన్యులుగా కనబ డే వారిలో కూడా యోగులుంటారనేది కూడా అంతే నిజం.
ఆత్మాన్వేషణనే యోగం అంటారు. అటువంటి యోగసిద్ధి పొందిన వారినే యోగులంటారు. మానవజన్మ లభించిన వారు వివేకంతో జన్మరాహిత్యం కోసం చేపట్టే మార్గమే యోగమార్గం. దా నిని నాలుగు విధాలుగా చేయవచ్చని తెలియజేస్తోంది మన సనాత న విజ్ఞానం. ఆత్మ దర్శనం ఎవరికి వారే, వారిలోనే దర్శించమని ఒక గొప్ప ఉపాయం చెప్పింది. మానవజన్మ లభించగానే నీకు దివ్య త్వం ఆపాదించబడింది. ఎందుకంటే దివ్యమైన వాసనలు లేకపోతే అసలు నీకు ఈ మానవ జన్మ లభించదు కదా! అందుకే మనిషిగా పుట్టిన ప్రతీవారూ దివ్యత్వం కలవారే! కానీ నీలో వున్న ఆ దివ్యత్వా న్ని తెలుసుకోలేకపోవడమే అజ్ఞానం. నాలుగు యోగమార్గాల సమ న్వయమే దివ్యయోగం.
కర్మయోగం ద్వారా మనలోనున్న దివ్యత్వాన్ని తెలుసుకోవ చ్చు. పనిచేయకుండా ఏ మానవుడు ఉండలేడు, ఉండకూడదు. ప్రతివారూ కారణజన్ములే! అందరికీ కర్తవ్యం ఒకటుంటుంది. లేక పోతే సృష్టించుకోవాలి. అదే ఆత్మశోధన. నీవు చేసే ధర్మయుతమైన ప్రతి పనీ యోగమే! ఉద్యోగం, వ్యాపారం, వృత్తి ప్రతికర్మ యోగం గా భావించి చేయాలి. పని చేసేటపుడు కూడా ఈ చైతన్య శక్తికి కార ణం ఏమిటి? అని ప్రశ్నించుకోవడమే ఆత్మాన్వేషణ. దీనినే నీలోను న్న దివ్యత్వాన్ని తెలుసుకోవడం.
ఇక భక్తి యోగం ఏ పని చేస్తున్నా ఒక సగుణ రూపాన్ని ధ్యాని స్తూ ఆయన కోసం, ఆయన కొరకు, ఆయనతో కలసి మాత్రమే ఈ కర్మ చేయగలుగుతున్నాననే భావన కలిగి ఉండడం. ఆ సగుణ రూ పంలో చూసే దివ్యత్వం చివరకి నీలో ప్రవేశిస్తుంది. ఆ దివ్యత్వం చివరికి నీలో ప్రవేశిస్తుంది. ఆ దివ్యత్వం నువ్వేనని తెలుస్తుంది. గీతాచార్యుడందుకే ఫలితం వైపు చూడవద్దని హెచ్చరించాడు. ఫలి తాన్ని ఆశిస్తే ఆత్మాన్వేషణకు కొన్ని జన్మలు పట్టవచ్చు అని అర్థం. మనం చేసే పనిలోనే పరమాత్మను చూడడం అనేదే కర్మయోగం. ఏ వృత్తినైనా ధర్మబద్ధంగా నెరవేర్చి తృప్తితో జీవించడమే కర్మయో గం. చేస్తే పరోపకారం చెయ్యి, అపకారం మాత్రం చెయ్యకు అని ఈ కర్మయోగి తెలుసుకోవడమే దివ్యత్వం.
రాజయోగంలో అంతర చతుష్టయాలను నియంత్రించుకొని తమలో ఉన్న దివ్యత్వాన్ని గ్రహిస్తారు. ముఖ్యంగా మనసును ని యంత్రించుకోవడం. మనసును జయించినవాడు సమస్త లోకాల ను జయించినట్లు. మనసును నియంత్రించుకొని ఆత్మను గ్రహిం చి తురీయం దాటి పరమాత్మలో లీనమవడమే దివ్యత్వం. రాజ యోగులు కూడా ఏదో ఒక కర్మను చేపట్టే ఉంటారనేది ఇక్కడ తెలు సుకోవాలి. రాజయోగి మార్గదర్శనం చేసే శక్తిని కలిగి ఉంటాడు. మనసును జయించిన వారిలో దివ్యతేజస్సు ప్రస్ఫుటమవుతుంది. ఆత్మాన్వేషణ రాజయోగికి త్వరగా ముగుస్తుంది.
ఇక జ్ఞానయోగంలో కర్మలు నైపుణ్యంతో కూడి ఉంటాయి. ఇక్కడ నైపుణ్యమంటే అర్థవంతమైన కర్మలు. జ్ఞానం విచక్షణ నేర్పు తుంది. ఏది ధర్మం? ఏది అధర్మం? ఏది ప్రయోజనం? ఏది అప్ర యోజనం? అను మీమాంస అనుక్షణం తొణికిసలాడుతుంది. తుద కు దివ్యమార్గాన్ని మాత్రమే అనుసరింపచేస్తుంది. జ్ఞానంతో ఆ ఆ త్మ చైతన్యాన్ని తెలుసుకుంటారు.ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఏ యోగం అనుసరించినా కర్మ తప్పదు. అందువలన చేసే పనులు ధర్మయుతంగా ఉండాలి. అనుక్షణం ఆ చేయించే ఆత్మ చైతన్యం గురించి మననం చేయాలి. అదే దివ్య జీవితం మార్గం. గమ్యం సచ్చిదానందంతో పరమాత్మను చేరడం.

Advertisement

తాజా వార్తలు

Advertisement