Friday, May 3, 2024

ఈనెల 5న హైదరాబాద్ లో డెవర్స్ స్టే క్యూరియస్ హెచ్ క్యూ విలక్షణ సంగీతం

హైదరాబాద్ : ఈనెల 5వతేదీన హైదరాబాద్ లోని శిల్పా హిల్స్ గ్యాలరీ 78లో రాత్రి 7గంటలకు డెవర్స్ స్టే క్యూరియస్ హెచ్ క్యూ విలక్షణ సంగీత కార్యక్రమం నిర్వహించనుంది. ఇది హైదరాబాద్ నగరం అన్ని రకాల సంగీతం, నృత్యం, సాహిత్యం, వంటకాల పట్ల లోతైన ప్రేమ వారసత్వాన్ని పంచుకుంటుంది. ముంబైలో విజయవంతమైన మొదటి ఎడిషన్ తర్వాత ప్రత్యేకమైన, ఆకర్షణీయమైన, లీనమయ్యే అనుభవాల కోసం హైదరాబాదీ అభిరుచిని వేడుక చేసుకుంటూ, డెవర్స్ ఎక్స్ పీరియెన్సెస్ ద్వారా డెవర్స్ స్టే క్యూరియస్ హెచ్ క్యూ ఇప్పుడు తన రెండో అధ్యాయంలోకి తిరిగి వచ్చింది. మంత్ర ముగ్ధులను చేసే, పలు ఇంద్రియాలతో గ్రహించగలిగే అనుభవపూర్వక విలక్షణమైన అనుభూతులను నగరం నడిబొడ్డుకు తీసుకువస్తుంది.


ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ప్రొడ్యూసర్ మూర్తోవిక్, భరత నాట్యం నర్తకి అనహిత, కర్నాటక సంగీత గాయని గోపిక తమ శైలిలో రాత్రిపూట తుపాన్ ను సృష్టించనున్నారు. సమకాలీన సంగీతం, నృత్యంలతో మంత్రముగ్దులను చేసే కార్యక్రమంలో మీరూ పాల్గొనండి. అని రుద్ధ్ మెహతా, మైల్స్ ద్వయం అందించిన అందమైన ఇన్‌స్టాలేషన్‌లతో సాంకేతికత చొప్పించబడిన కళాత్మక అనుభవాల ఆకర్షణీయ ప్రపంచంలో మీరూ మునిగిపోండి. డిజైనర్ కావ్య పొట్లూరిచే ది ఫ్యూచరిస్టిక్ బ్రైడ్, మోనో క్రోమటిక్ ఆర్టిస్ట్ సుషీ సర్జ్ లైవ్ ఆర్ట్ లైవ్ షో అయిన సిటీ సోల్స్ ఆలోచన రేకెత్తించే ప్రదర్శనలతో మేధోపరమైన ఆవిష్కరణల వినూత్న ప్రయాణాన్ని ప్రారంభించండి. కొత్త దృక్కోణాలను వెలుగులోకి తీసుకురండి. కళ, డిజైన్, ఫ్యాషన్‌లో హైదరాబాద్‌లోని విభిన్న సృజనాత్మకతలతో, దృక్పథాలతో కూడిన సంభాషణలలో పాల్గొనండి.. అన్నీ ఒకే డెవర్ వేదికపై క్యూరియస్ టాక్స్‌ తో కలిసి వచ్చాయని నిర్వాహకులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement