Thursday, May 16, 2024

రామాయణ కాలంనాటి సరోవరం!

హిందూ పురాణాలు అంటే మొదట మనకు గుర్తుకు వచ్చేది దేవతలు, పురాణ పురుషులు, ఋషులు. ఇప్పటికీ వీరంతా ఉన్నారనేది నమ్మకం. అయితే అటువంటి గొప్ప వ్యక్తులు ఉండేచోటు పరమ పవిత్రమైనదని పెద్దలు చెబుతుంటారు. అటువంటి ప్రాంతాల్లో సరస్సులు మొదటి స్థానంలో ఉంటాయి. హిందూ పురాణాల ప్రకారం మన దేశంలో ఎన్నో అందమైన… పవిత్రమైన సరోవరాలు వున్నాయి. వాటిలో అయిదు ప్రముఖ సరోవరాలున్నాయి. వాటిని పంచ సరోవరాలు అంటారు. అవి- మానస సరోవరం, పంపా సరోవరం, పుష్కర్‌ సరోవరం, నారాయణ సరోవరం, బిందు సరోవరం.

ఇప్పటికీ దేవతలు వివిధ రూపాలలో సంచరిస్తూ ఈ సరోవరాల చుట్టూ సంచరిస్తూ ఉంటారని ప్రతీతి. మనుషులు ఈ సరోవరాల్లో స్నానం చేస్తే వారికి మోక్షం లభిస్తుం దని పెద్దలతోపాటు పురాణాలు చెబుతున్నాయి. ఈ ఐదు సరస్సులు మన భారతదేశం లోని వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. ఇందులో ఒక సరస్సు ఏకంగా విష్ణువు ఆనంద భాష్పాలు రాల్చడం వల్ల ఏర్పడినది కావడం గమనార్హం. అలాగే పంపా సరోవరం రామాయణ కాలంనాటిదని ప్రతీతి. ఇక్కడే పరమేశ్వరుడు తపస్సు చేయడం వల్ల ఈ సరోవరం పరమ పవిత్రమైనదిగా భావిస్తారు.
ప్రశాంత వాతావరణం, చుట్టూ అందమైన కొండల మధ్య ఒక లోయలో వుం టుంది పంపా సరోవరం. పర్యాటకులను ఆకట్టుకుంటున్న ఈ సరోవరం కర్ణాటక రాష్ట్రంలోని హంపీకి దగ్గరగా వుంటుంది. హోస్పెట్‌ నుండి అనెగుడికి వెళ్లే దారిపై ఉన్న కొండల మధ్య ఈ సరస్సు కనిపిస్తుంది. హనుమాన్‌ ఆలయ పర్వతాల నుండి ఒక కిలోమీటరు దూరంలో ఉంటుంది. సరస్సు ఎల్లప్పుడూ కమలాలతో నిండి వుంటుంది. పు వ్వులు వికసించినప్పుడు అత్యంత మనోహరం గా ఉంటుంది.
ఇక్కడ అందమైన నీటి కొలనే కాకుండా లక్ష్మీ దేవి ఆలయం, శివాలయం కూడా ఉన్నాయి. రామా యణ కాలంలో ఇక్కడ భక్త శబరి నివసించేదట. ఆమె రాముడిని ఇక్కడే కలిసిందనే కథనాలు ప్రచారంలో వున్నాయి. ఆ కథ ప్రకారం శబరి, మతంగ మహర్షి శిష్యులకు సేవలు చేస్తుండేది. వారు శబరికి రామలక్ష్మణులు ఇక్కడకు వస్తారని చెప్పారు. అప్పటినుంచి శబరి అక్కడే నివశిస్తూ రాముని రాకకోసం ఎదురుచూస్తూ జీవించింది.
సీతాదేవిని అన్వేషిస్తూ కబంధుని సూచనలను అనుసరించి రామలక్ష్మణులు పంపాసరోవరం తీరానికి చేరుకున్నారు. రామలక్ష్మణులను చూసిన వెంటనే సంతోష పులకాంకితురాలైన శబరి ఆయన పాదాలకు నమస్కరించి, అర్ఘ్యపాద్యాదులతో మర్యాదలు చేసింది. వారికోసం తాను సేకరించిన ఫలాలను అందించిందని పురాణ వచనం. అయితే రాముడికి పండ్లు పెట్టిన శబరి ప్రస్తావన భద్రాచలం వద్ద నున్న గోదావరి వద్ద కూడా వస్తుంది. అక్కడే భక్త శబరి శబరీ నదిగా మారిందని అంటారు. అలాగే కేరళలో శబరీ కొండ వుంది. అక్కడ కూడా శబరీ సీత అనే పేరుతో ఒక ప్రదేశం ఉంది. అయ్యప్ప భక్తులు అక్కడకు ఎక్కువగా వెళుతుంటారు.
గుజరాత్‌లోని డాంగ్‌ జిల్లాలో మరో పంపా సరోవర్‌ ఉంది. ఆహ్వా-నవపూర్‌ రహదారిలోని సుబీర్‌ రగామం నుండ 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న చమక్‌ దురగ ర్‌ కొండ ప్రాంతంలో ఈ సరస్సు ఉంది. రాముడు శబరిని కలిసిన ప్రదేశంలో శబరి మాత ఆలయాన్ని నిర్మించారు. అన్ని కాలాలలోనూ ఈ సరోవర సందర్శనానికి వెళ్ళ డానికి అనువైన ప్రదేశం ఇది. ఇక్కడికి బెంగళూరు నుండి బస్సులు ఉంటాయి. ప్రైవేటు టాక్సీలు అందుబాటులో ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement