Saturday, May 4, 2024

సంతాన వరదాయిని గరుడ పంచమి

శ్రావణ శుక్ల పక్ష పంచమి ”నాగ పం చమి”తోపాటు ”గరుడ పంచమి” అని కూ డా పేరు. ఈ రోజు నాగుల నుంచి రక్షణ పొంది, నాగదోషం తగులకుండా పిల్లలను కాపాడు కొనేందుకు, నిర్మలమైన మనస్సు, తెలివైన పిల్లలు పుట్టడానికి గరుడ పూజ ఆచారంగా ఉంది. మేరు పర్వతంతో సమానమైన శరీరం కలవాడు, సప్త సము ద్రాల్లోని జలాన్నంతటినీ ఒక్కరెక్క విసురుతో ఎగర గొట్ట గల రెక్కల బలం కలవాడు. అందువలనే గరు డునికి సుపర్ణుడు అను పేరు సార్ధకమైనది. గరుత్మం తుడు మహా విష్ణువుకు వాహనంగా ప్రసిద్ధుడు. వ్యా స మహర్షి విరచిత అష్టాదశ పురాణాలలో మరణా నంతర నరక లోక వర్ణన, పాపాలకు విధించబడే శిక్ష లు, ప్రాయశ్చిత్తాలు, పుణ్య సాధనా మార్గాలు, పితృకార్య వివరాలతో 18 వేల శ్లోకాలు గల గరుడ పురాణం ఒకటి. అధర్వణ వేదంలో గరుడోపనిష త్తులో విషదహార అని వైనతేయ ప్రస్తావన ఉంది. గరుడ పంచమికి సంబంధించి భవిష్యత్‌ పురాణం లో ప్రస్తావన ఉంది. సముద్ర మధనంలో ” ఉచ్పైశ్ర వం” అనే గుఱ్ఱం ఉద్భవించింది. అది శ్వేతవర్ణం కలది. కశ్యపుడు, వినతల కుమారుడు గరుడుడు. ఓ రోజు వినత ఆమె తోడు కోడలు కద్రువ విహార సమ యంలో ఆ తెల్లటి గుఱ్ఱాన్ని చూశారు. కద్రువ, వినత తో గుఱ్ఱం తెల్లగా ఉన్న తోకమాత్రం నల్లగా ఉంది అని చెప్పగా, వినత గుఱ్ఱం మొత్తం తెల్లగానే ఉంది అని చెప్పింది. వాళ్ళిద్దరు ఒక పందెం వేసుకొన్నారు. గుఱ్ఱపు తోక నల్లగా ఉంటే వినత కద్రువకు దాస్యం చేయాలని, గుఱ్ఱం మొత్తం తెల్లగా ఉంటే వినతకు కద్రువ దాస్యం చేయాలని పందెం. కద్రువ తన కపట బుద్దితో, తన సంతానమైన నాగులను పిలిచి అశ్వవా లాన్ని పట్టి వ్రేలాడమని కోరగా. దానికి వారెవ్వరు అంగీకరించలేదు. అందుకు కోపగించిన కద్రువ ”జనమేజయుని సర్పయాగంలో నశించాలని” శ పించింది. ఒక్క కర్కోటకుడు అనే కుమారుడు అశ్వ వాలాన్ని పట్టి వ్రేలాడి తల్లి పందాన్ని గెలిపించాడు.
కశ్యప ప్రజాపతి తన భార్యలైన వినత, కద్రువకు సంతాన ప్రాప్తికై పుత్ర కామేష్టి యాగం చేసిన ఫలి తంగా, సతుల కోరికలపై కద్రువకు వెయ్యి అండాలు, వినతకు రెండు అండాలు పుడ తాయి. కద్రువ అం డాల నుండి వాసుకి, ఆది శేషుడు, ఆదిగా వేయి పా ములు జన్మిస్తాయి. వినత తొందర పడి ఒక అండాన్ని చిదమగా కాళ్ళు లేని, మొండెం మాత్రమే గల అనూ రుడు జన్మిస్తాడు. దానితో తన సవతికి, తన తల్లి దాసీ గా ఉండాలని అనూరుడు శాపమిచ్చి, రెండవ అం డం జాగ్రత్తగా దాచితే, దానినుండి జన్మించిన వాడే దాస్య విముక్తి కలిగిస్తాడని చెపుతూ, సూర్యునికి అనూరుడు రథ సారధిగా వెళతాడు. తర్వాత గరు త్మంతుడు జన్మిస్తాడు. శ్రావణ శుద్ధ పంచమి నాడు గరుత్మంతుడు అమతాపహరణం చేసినందున గరుడ పంచమి అనే పేరు వచ్చింది. గరుడుడు అమృతం తెచ్చి తన సవతి తల్లికి ఇచ్చి కన్నతల్లికి దా స్య విముక్తి గావించాడు. అయితే ఇంద్రునితో గరు డుని ఒడంబడిక కారణంగా, అమృతం నాగులకు లభించలేదు. కనుక వారు అసంతృప్తులైనారు. వారి ని తృప్తిపరచడానికి వాటికి పూజలు జరపడం విరో ధితో జతపడిన పర్వంగా భావిస్తారు. పురాణ గాథలు చూస్తే నాగులకు, గరుడుడికి విరోధమున్నట్లు తెలు స్తుంది. అయితే ఈ విరోధంలో గరుడుడు విజేతగా నిలుస్తాడు. భారత దేశంలో కొన్నిచోట్ల గరుడుడు పరాజితుడైనట్లు గాథలున్నాయి. గరుత్మంతుడికి, నాగరాజైన తక్షకునికి ఒకసారి యుద్ధం జరగగా, గరుడుడు ఓడిపోతాడు. నాగ ప్రతిమ గల యంత్రపు బిళ్ళను మెడలో వేలాడ తీసుకుని ఉండే షరతుపై ఇరువురికి రాజీ కుదిరింది. వంగదేశంలో ఈ పురాణ కథ ఉంది. సర్పరాజుకు, గరుత్మంతుడు నమస్కరి స్తూ ఉన్నట్లు శిల్ప ఖండాలు కూడా నేపాళం తదితర ప్రాంతాలలో ఉన్నాయి. వ్రత రత్నాకరంలో గురుడ పంచమి ప్రస్తావన ఉంది. దేవాలయాల్లో గరుడ వాహనాలను గమనిస్తే, ఒక మోకాలు వంచి, మరో మోకాలు మీద నిటారుగా కూర్చొని రెండు చేతులనూ చాచి మూలవిరాట్టును చూ స్తూ ఉంటాడు. దాని అంతరార్ధం ”స్వామి నా కర్తవ్య నిర్వహణ కోసం నేను ఏ క్షణంలోనైనా సిద్ధమే” అని. సర్వశక్తి సంపన్నుడు అయి ఉండీ, సవతి సోద రులను వీపున మోస్తూ, అవ మానాలను ఓర్చి, తల్లికీ, తనకూ గల దాస్య బంధనా లను తెంపి, మహా విష్ణువుకు వాహనంగా వినుతికె క్కిన వైనతేయుడు ప్రాత:కాల స్మరణీయుడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement