Sunday, April 28, 2024

సంకట హరణుడు

సృష్టికి పూర్వమే పార్వతీ పరమేశ్వరుల తొలి బీజాణువుల నుండి ఆవిర్భవించిన శ్రీ గణపతి యొక్క విగ్రహాలు ప్రపంచమంతా నిండి ఉన్నాయి. అంటే వినాయకుని ఉనికి, పూజ యుగయుగాల నుండి ఈ పుడమిపై ఉన్నదని మనం గ్రహించవచ్చు. ఈ గజముఖుని జన్మవృత్తాంతం అత్యంత అద్భుత మైనది. పార్వతీదేవి స్నానానంతరము నలుగు పిండికి ఒక చక్కని రూపమిచ్చి ప్రాణం పోసిందని చెబుతూ ఉంటారు. నిజానికి ఈ సృష్టిలో భౌతికంగా ఏదైనా ఉందనంటే అది గణ నాథుని రూపము. గాణపత్యులు సృష్ట్యాది నుండి విఘ్నరాజుని ఆరాధిస్తున్నారు. కైలాసమున పార్వతీ పరమేశ్వరులు అనిర్వచనీయమైన అను రాగ డోలికల్లో తేలియాడుతూ అనేక దివ్య సంవత్సరాలు గడుప సాగారు. ఒక రోజు పార్వతి చెలికత్తెలు ”అమ్మా మన కైలాసమంతా శివునికి లోబడి ఉండే రుద్రగాణాలే! వారు కూడా మీ ఆజ్ఞను శిరసా వహిస్తారనుకోండి, కానీ మీ ఆంతరంగిక ఆజ్ఞలను అనుసరించే వారు ఉండటం ముఖ్యం” అని సూచించారు.
కొన్ని రోజులకు తన శరీరం నుండి నలిగిపడిన రజోబీజము లతో సుందరాకారుడైన, మహా బలపరాక్రమవంతుడైన ఒక బాలుని సృజించి వానికి అనేక అపురూపమైన వస్త్రాభరణాలను ఇచ్చి ఆశీర్వదించింది పార్వతీ మాత. అంత ఆ బాలుడు ”అమ్మా! నేనేమి చేయాలి ఆజ్ఞ ఇవ్వు” అని ముద్దుముద్దుగా కోరాడు. అంత పార్వతి ఒక మహాశక్తివంతమైన దండమును ఆయుధ ముగా నిచ్చి ”ఓ కుమారా! నా ఆజ్ఞ లేకుండా ఎవరూ నా భవనం లోకి ప్రవేశించకుండా ద్వారము కడ కాపలా ఉండు. నీకు ఏమైనా అవసరమైతే నన్ను పిలు నేను వెంటనే వస్తాను” అని చెప్పింది. అంత ఆ బాలుడు తల్లి ఆజ్ఞను నెరవేరుస్తున్నాడు.
ఒక రోజు పార్వతీ మాత తన సఖులతో ఆహ్లాదకరమైన హిమనీ సరస్సులో జలక్రీడ లాడుతుండగా ఉమాపతి పార్వతీ మందిర ప్రవే శం చేయబూనాడు. బాలుడైన ద్వారపాలకుడు అడ్డుకున్నాడు. స్వగృహంలోకి ప్రవేశమును నిరోధించిన ఆ బాలునితో ”లోపల ఉన్నది నా భార్య శివాని, నేను సృష్టికి కారణభూతుడను నన్నే నిలువరిస్తావా! అడ్డు తొలగు”మని ఆగ్రహోదగ్రుడైనాడు అంత ఆ సుందర బాలుడు ”సృష్టికి కారణభూతుడవు నీవైతే, నా జన్మకు కార ణమైన నా తల్లి ఆజ్ఞను నేను నెరవేరుస్తా!” అని దండమును పైకె త్తాడు. ఆశ్చర్యచకితుడైన శంకరుడు తన గణమును పిలిచి ఆ బాలుని తొలగించమని ఆజ్ఞాపించాడు. నంది, భృంగి నాయకత్వం వహించి ఆ బాలునిపై యుద్ధం ప్రకటించారు. వారిని తల్లి ఇచ్చిన దండముతో చెండాడాడు. చివరకు బ్రహ్మ రాయబారం నడిపాడు. ఆ బాలుడు తన పట్టు వీడలేదు. ఈ వృత్తాంతమంతా పార్వతికి చేరింది. అంత తన కుమారునికి తోడుగా శక్తిని పంపించింది. ఆమె రుద్ర గణాలను నమిలి వేయసాగింది. చివరకు చేసేది లేక శంకరుని సర్వగణాలు వచ్చి తమ అశక్తతను వెలువరించాయి.
అంత రుద్రుడు మహోద
గ్రుడై తిరిగి ఆ బాలుని కడకు వచ్చి నచ్చ జెప్పి, ఫలిం చక తన త్రిశూ లములో శిరస్సు
ను ఖండించాడు. ఈ వార్త విన్న పార్వతీదేవి దుర్గ అయి భయంకర శక్తులను క్షణ కాలంలో సృష్టించి దేవత లందరినీ ప్రళయాగ్నికి అహుతినివ్వసాగింది. ఆ మహా ప్రళయ ములో శలభాల్లా మాడి మసైపోతున్న దేవగణాలు బ్రహ్మను శరణు వేడారు. బ్రహ్మతో సహా సమస్త ఋషి గణాలు పార్వతిని అనేక విధాల ప్రార్థించి, స్తుతించి మేమందరము నీ బిడ్డలమే కదా! తల్లి అయినా, తండ్రి అయినా తన సంతానాన్ని సంహరిస్తారా? ఇక మాకు దిక్కెవ రని ప్రార్థిస్తూ మా అపరాధాలను క్షమించి శాంతించమని వేడు కున్నారు. స్థాణువైన పతి శంకరుని వీక్షిస్తూ ”నా కుమారుడు పునర్జీ వితుడు కావాలి. ఆది పూజలు అందుకుని గణాలకు అధ్యక్షుడు కావా లి, అంతవరకు ఈ ప్రళయం ఆగదు” అంటూ గద్దించింది శాంకరి.
అప్పుడు బ్రహ్మతో సహా అందరూ శంకరుని ఆశ్రయించారు. తన హృదయేశ్వరి అంతరంగం గ్రహించిన ఉమాపతి ”మీలో కొందరు ఉత్తర దిక్కుకు వెళ్ళండి ముందు ఏ ప్రాణి కనిపిస్తే దాని శిరస్సును ఖండించి దానిని తీసుకువచ్చి ఈ బాలునికి సంధించండి” అని ఆజ్ఞాపించాడు. వారికి ముందు ఒక ఏనుగు కనిపించింది. వెంటనే దాని శిరస్సు ఖండించి తక్షణమే దానిని ఆ బాలుని దేహానికి సంధించారు. నిర్జీవంగా నున్న ఆ శరీరాన్ని శివాజ్ఞతో మాధవులు వేదమంత్రాలతో మంత్రించి ”శివ తేజస్సును అందులో ప్రవేశ పెట్టారు. వెంటనే నిద్ర నుండి మేల్కొన్న చందమున లేచి నిల బడ్డాడు. పార్వతీదేవి కనుల ఆనంద భాష్పాలు రాలుతుండగా ఆ బాలుడు తల్లి ఒడిని చేరాడు. తల్లి పార్వతీ మాత ఆ బాలుని ముద్దులతో ముంచెత్తింది. పుట్టిన తోడనే ఆపదలు తొలగిపోయాయి. సింధూర వర్ణంతో వెలిగిపోతున్న అతని ముఖం విఘ్నాంతకునిగా కనబడింది. గజ ముఖముతో అలరారుతున్న ఆ బాలునికి గణశుడు అని నామం స్థిరపడింది. అర్దనారీశ్వరి జగదంబ కోరిక తీర్చి గణాలకు నాయ కుడైన గణపతిని ఆశీర్వదించారు పార్వతీపరమేశ్వరులు. విఘ్నా లను తొలగిస్తాడు కాబట్టి వినాయకుడైనాడు. కుమారునికై మహా ప్రళయమును సృష్టించ, ఆ ప్రళయము నుండి తప్పించుకొనుటకై సంకటమున పడిన దేవగణమునకు సంకట హరణము గావించిన గజముఖునికి సకల దేవతలు, సర్వ జనులు అంజలి ఘటించారు. ఏవిధమైన సంకటమునైనా తీర్చగల సంకట హరణుడును పూజించి తరిద్దాం.
– వారణాశి వెంకట
సూర్యకామేశ్వరరావు
8074666269

Advertisement

తాజా వార్తలు

Advertisement