Wednesday, May 15, 2024

గీత విని పులకితుడైన సంజయుడు!

సంజయ ఉవాచ

ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మన:|
సంవాదమిమ మశ్రౌషమ్‌ అద్భుతం రోమహర్షణమ్‌||
(శ్రీమత్‌ భగవద్గీత 18వ అధ్యాయము, 74వ శ్లోకం)
తాత్పర్యం: ఈవిధంగా నేను, వసుదేవుని పుత్రుడైన శ్రీకృష్ణుడికి- మహాత్ముడు, కుంతీ తనయుడు అయిన అర్జునుడికి మధ్య జరిగిన సంవాదమును విన్నాను. ఇది ఎంత అద్భుత మైనదంటే నా రోమములు నిక్కబొడుచుకుంటున్నాయి.
వివరణ: ఒక్కసారి గుర్తుచేసుకోండి. వ్యాసుల వారు యుద్ధం జరుగబోతోంది అని తెలి సి తన కుమారుడు ధృతరాష్ట్రుని వద్దకు వచ్చాడు. యుద్ధం చూడాలని ఉందా అని అడిగా డు. ధృతరాష్ట్రుడు నవ్వి నేను పుట్టు గుడ్డిని, నా కుమారులనే గుర్తుపట్టలేను. కాబట్టి చూడ టం వ్యర్థం అని అన్నాడు. అప్పుడు వ్యాసుడు సంజయునికి అద్భుత శక్తులు ప్రసాదించి, యుద్ధభూమికి వెళ్ళి, అక్కడ జరిగే విశేషములు అన్నీ స్వయంగా చూచి, అవన్నీ వివరంగా ధృతరాష్ట్రునికి చెప్పమన్నాడు. వ్యాసుని ఆదేశాల మేరకు సంజయుడు యుద్ధభూమికి వెళ్లా డు. యుద్ధ భూమిని పరికించాడు. కృష్ణార్జున సంవాదం కూడా విన్నాడు. అతని శరీరం పుల కించిపోయింది. కృష్ణుడు చూపించిన విశ్వరూపం చూచి ఆశ్చర్యపోయాడు. అంతటి మహద్భాగ్యం తనకు కలిగించినందుకు వ్యాసుల వారికి మనసులోనే ప్రణామాలు అర్పిం చాడు. తరువాత పది రోజుల యుద్ధం చూచాడు. భీష్ముల వారు అంపశయ్య మీద పడిపోవ డం చూచాడు. వెంటనే ధృతరాష్ట్రుని వద్దకు వచ్చాడు. యుద్ధం మొదలు అయినప్పటి నుం డి పదిరోజులు వరకు జరిగిన విషయాలు అన్నీ చెప్పాడు. ఆ చెప్పడంలో భాగంగానే భగ వంతుడు అయిన కృష్ణుడు అర్జునుడికి చెప్పిన గీతను ధృతరాష్ట్రుడికి చెప్పాడు.
ఈ విధంగా మొట్టమొదట కృష్ణుని ముఖతా గీతను అర్జునుడు, ఆయనతోపాటు సంజ యుడు ఇద్దరూ విన్నారు. కాకపోతే అర్జునుడు అప్పుడప్పుడు ప్రశ్నలు వేసాడు. సంజయు డు శ్రోతగానే మిగిలిపోయాడు. మూడవ శ్రోత ధృతరాష్ట్రుడు. తరువాత సర్పయాగ సంద ర్భంగా వైశంపాయనుని ద్వారా, మహాభారత శ్రవణంలో భాగంగా, జనమేజయుడు మొదలగువారు విన్నారు. ఆఖరుగా నైమిశారణ్యంలో సత్రయాగ సందర్భంలో సూత పౌరాణికుని ద్వారా శౌనకుడు మొదలగు మహామునులు విన్నారు. ఆవిధంగా గీత ప్రపంచా నికి అందుబాటులోకి వచ్చింది.
ఇక్కడ రెండు విశేషణాలు చెప్పాడు వ్యాసుడు. అద్భుతం, రోమహర్షణం. కృష్ణుని నోటి వెంట గీతా ప్రవాహాన్ని కంటుంటే, వింటుంటే, ఒక మహాద్భుతాన్ని చూస్తున్నట్టు, వింటు న్నట్టు గోచరించింది. కొన్ని సన్నివేశాలలో వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి అని అన్నా డు సంజయుడు. గీత అనేది ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన సంవాదము. అద్భుతము అంటే భూత కాలంలో అంటే జరిగిపోయిన కాలంలో ఎప్పుడూ జరగనిది అంటే ఇదివర లో ఎక్కడా కని, విని, ఎరుగనిది అని అర్థం. అంటే మన ప్రపంచ సాహత్యములో ఇటువంటి సంభాషణా రూపమైన ఆధ్యాత్మిక జ్ఞానము ఎక్కడా లేదు. ఇది ప్రపంచ సా#హత్యవేత్తలు అం దరూ ముక్తకంఠంతో ఒప్పుకున్న సత్యం. అందుకే గీతను ప్రపంచ భాషలు అన్నింటిలోనూ అనువదించారు. గీతలాంటి గ్రంథము నభూతో నభవిష్యతి. ఇటువంటి సంభాణ ఇదివర కు లేదు. ఇకముందు ఉండబోదు అని అర్థము. ఇది వ్యాసుడు మానవాళికి అందించిన గొప్ప అమృత భాండము. ఎక్కువ ఆనందం కలిగినపుడు, ఎక్కువ భయం కలిగినపుడు, ఎక్కువ ఆశ్చర్యం కలిగినపుడు మనకు శరీరం మీది వెంట్రుకలు నిక్కపొడుచుకుంటాయి. అది అత్యంత స#హజం. గీతలో కూడా ఆనందము, అద్భుతము, ఆశ్చర్యము, భయము కలి గించే విషయాలు ఉన్నాయి. ఉదా#హరణకు విశ్వరూప సందర్శన యోగంలో అర్జునుడు భయపడ్డాడు. కాబట్టి మనం కూడా గీతను వింటుంటే మనకు కూడా ఒళ్లు గగుర్పొడవాలి. వెంట్రుకలు నిక్కపొడుచుకోవాలి. ఏకాగ్రతతో గీతను విన్నదానికి గుర్తు అదే.

Advertisement

తాజా వార్తలు

Advertisement