Monday, April 29, 2024

సాలిగ్రామ తీర్థం

తీర్థము ఎలా పుచ్చుకోవాలి?
తీర్థం అంటే ఏమిటి?
మిగిలిన తీర్థం ఏమి చేయాలి?

ఈనాటికీ చాలామందికి తెలియని సమస్య, పక్క వాళ్ళు ఏం చేస్తారో చూసి గొర్రె దాటు పద్ధతి కదా మనది. తీర్థానికి సంబంధించిన మన శాస్త్రజ్ఞులు, పండితులు ప్రమాణాలతో ఆధ్యాత్మిక దృష్టి కోణంతో చెప్పిన కొన్ని విషయాలు పరిశీలించి చూద్దాం!
ఆలయాలలో పూజారి ఇచ్చే తీర్థం అనేది నేల మీద పడకూడదని అంటారు. అలా పడిన ప్రతి చుక్క నుంచి కోటి బ్రహ్మరాక్షసులు పుట్టగలరుట, అందుకే తీర్థం ఇచ్చేటప్పుడు కింద పెద్ద పళ్ళెం ఉంచుతారు, తీర్థం తీసుకున్న తర్వాత ఆ చేతిని కొంతమంది పెద్దలు తలకు రాసుకోకూడదు అని చెబుతారు, ఎందు కంటే ఆ ఎంగిలి తీర్థపు నీళ్లు పక్కనున్న వాళ్ల మీద పడ తాయి అని జాగ్రత్త కొరకు మాత్రమే అని గమనించ గలరు. తలకు రాసుకుంటే ”బ్రహ్మహత్య” దోషము పోతుందని సూక్తి ముక్తావళి గ్రంథము తెలియ జేస్తున్నది. విష్ణు ఆలయాలలో తీర్థము ఇచ్చినప్పుడు కానీ, తీసుకునేటప్పుడు కానీ కాళ్ళమీద పడరాదు. అలా పడితే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయిట.
ఆలయములో గాని, మీ ఇంటిలోగాని ”తీర్థం” మిగిలిపోయిన తులసికోటలో కానీ, ఎవరూ తొక్కని ప్రాంతమందు, లేదా ప్రవాహం మందు విసర్జించ వలెను. దైవ ప్రసాదముగా నివేదించుటకు ఈ తీర్థమును ప్రోక్షణ చేసి, తులసిదళం వేయవలెను, కొద్దిగా ఆవు నెయ్యి ప్రోక్షణ చేయవలెను, ఒక ఏకాదశి నుండి మరియొక ఏకాదశి వరకు 15 రోజులు తీర్థమును నిలువ ఉంచవచ్చు.
తీర్థమును మూడుసార్లు విడివిడిగా తీసుకో వలెను, ఒకేసారి తీసుకొనరాదు. తీర్థమును పుచ్చుకునేవారు తమ కుడి చేతిని, ఆవు చెవి దొప్పలా చేసి శబ్దమూ లేకుండా పుచ్చుకోవలెను (తీర్థ గోష్టి గ్రంథము).
తీర్థము పుచ్చుకున్న తరువాత చెయ్యిని కడుక్కో వలసిన పనిలేదు.
శంఖములోని నీటిని తల మీద ప్రోక్షణ చేసుకో వలెను. ప్రతి దినము వలననే శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున కూడా తీర్థమును ఒక్కసారి పుచ్చు కొనవలెను. (పంచ రాత్ర గ్రంథము). ఏకాదశి నాడు ఒకసారి, కృష్ణ జయంతి నాడు మూడుసార్లు తీర్థమును గ్రహంచవలెను. (విష్ణు పురాణం). భోజనానంతరం సాలిగ్రామ తీర్థమును తప్పని సరిగా ఒకసారి స్వీకరించవలెను.
తిన్న ఆహారము సత్వరంగా జీర్ణం అయ్యేందుకు, సాత్విక బుద్ధి ఉద్దీపనమునకు, కుడి చేతితో కడుపును నిమురుతూ ”ఓం నమో నారాయణాయ” అనే మంత్రాన్ని కొద్దిసేపు జపం చేయాలని చెప్పబడింది. ఆరోగ్యాన్ని, ఆధ్యాత్మికతను మెరుగుసరిచేది తీర్థం. దీన్ని పరమ పవిత్రంగా భావించి సద్భావంతో స్వీకరిం చాలి. గోముఖ ముద్రతో తీర్థం తీసుకోవడం వల్ల కళ్లు, బ్రహ్మరంధ్రంతల, మెడను తాకుతాయి. దీనివల్ల చైతన్యం, శక్తి కలుగుతాయి.

– డా|| చదలవాడ హరిబాబు
9849500354

Advertisement

తాజా వార్తలు

Advertisement