Wednesday, May 8, 2024

విశిష్టావతారుడు సాయిబాబా

శ్రీ సాయిబాబా యవతారము ఎంతో విశి ష్టమైనది. అద్భుతమైనది. పూర్వజన్మ సుకృత ము వుంటేనేకానీ ఎవరూ ఆయన దరిచేరే భాగ్య మును పొందలేరు. వారి సాంగత్యం ఎంతో అదృ ష్టవంతులకే లభించేది. వారి సన్నిధిలో వున్నవా రికి కలిగే ఆనందము, ఉల్లాసాన్ని చెప్పడం అని తర సాధ్యం. శ్రీ సాయినాథులు నిజముగా శుద్ధా నంత చైతన్యమూర్తులు. వారి గొప్పతనమును, విశిష్టతను సాయిసచ్ఛరిత్ర గ్రంథకర్తలకు కూడా వర్ణించ సాధ్యం కాలేదు. అంతటి విశిష్టావతారు లు శ్రీసాయినాథులు. ఆయన పాదాలను నమ్మిన వారికి ఆత్మానుసంధానం కలుగుతుంది.
షిరిడీ ప్రజలు, షిరిడీ చుట్టూ వున్న గ్రామా ల ప్రజలే కాదు, దూరప్రాంతాల నుండి కూడా అనేకమంది షిరిడీ వచ్చి సాయి పాదాలను ఆశ్ర యించేవారు. సాధారణ ప్రజలే కాదు సన్యాసు లు, సాధకులు మోక్షమునకు పాడుపడే అనేక మంది సాయిబాబా వద్దకు వచ్చేవారు. బాబా వా రితో నడుస్తూ, మాట్లాడుతూ, నవ్వుతూ ‘అల్లా మాలిక్‌’ అని ఎప్పుడూ పలుకుతూ వుండేవారు. సాయిబాబాకు వివాదాలు అన్నా, అనవసరంగా చర్చించడం అన్నా అసలు ఇష్టం వుండదు. ఆయ న ద్వారకామాయికి వచ్చిన అందరికీ ఆ రెండిం టి జోలికీ పోవద్దని… ప్రతి ఒక్కరికి శ్రద్ధ, సబూరీ అవసరమని చెప్పేవారు. అయితే సాయిబాబాకి అప్పుడప్పుడు కోపం వచ్చేది. ఆ సమయంలో శాంతం వహించి తనను తాను స్వాధీనపరచుకు నేవారు. ఎప్పుడూ వేదాంతమును బోధించే వారు. సాయి తన భక్తులతో ఎంత సన్నిహితము గా వున్ననూ… ఎన్ని బోధనలు చేసినా ఆయన ఎవరో ఎవరికీ తెలియలేదు. బాబా నిర్యాణము వరకు భక్తులకు సాయిబాబా ఎవరు? ఎక్కడనుం చి వచ్చారు? అనేది మాత్రం తెలియలేదు.
సాయిబాబా రాజులను, భిక్షుకులను ఒకే రీతిగా ఆదరించేవారు. అందరి అంతరంగము లందు గల రహస్యాలన్నిటినీ బాబా తెలుసుకునే వారు. బాబా తన దగ్గరకు వచ్చినవారి మనసు లోని భావాలను, రహస్యాలను అన్నిటినీ వెలిబు చ్చగానే అందరు ఆశ్చర్య నిమగ్నులు అయ్యేవా రు. సాయిబాబా సర్వజ్ఞులు. అయినప్పటికీ వారి కి ఏమీ తెలియనివానివలె నటించేవారు. బాబాకు సన్మాలు, పొగడ్తలు అంటే ఇష్టం వుండదు. వారి వైఖరి అతి సామాన్యునిగా వుండేది.
మానవ శరీరముతో వున్నప్పటికీ వారు చేసే పనులను బట్టి మానవ రూపంలో వచ్చిన సాక్షాత్తు భగవంతుడే! బాబా దర్శనం చేసుకుంటే చా లు ప్రజలు కష్టాలు, బాధల నుంచి విముక్తులు అయ్యేవారు. అనారోగ్యులు ఆరోగ్యవంతుల య్యే వారు. గ్రుడ్డివారికి దృష్టి వచ్చేది. కుంటి వారికి కాళ్లు వచ్చేవి. ఇలా అనేకమంది కోరికలు నెరవేరుతుండేవి. తన భక్తులను సాయిబాబా ఎంతో ప్రేమించేవారు. వారి కోరికలు, అవసరాల ను గ్రహించి తీర్చేవారు. అంతులేని బాబా గొప్ప తనమును ఎవ్వరూ కనుగొనలేకపోయారు. బాబా ఎప్పుడూ ధుని దగ్గరే ధ్యానమగ్నులై కూర్చుని వుండేవారు. వారి కీర్తి నలుదిక్కుల వ్యాపించిం ది. భక్తులతో ద్వారకామాయి, షిరిడీ గ్రామం క్రిక్కిరిసిపోయేది. సాయిబాబా చరణార విందము లపై సర్వస్య శరణాగతి చేసే అవకాశం
కలిగిన భ క్తులు అదృష్ట వంతులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement