Sunday, April 28, 2024

భక్తులను ఎల్లవేళలా కాపాడే సాయి

శ్రీ సాయినాధులు తనకు సంపూర్ణ, సర్వశ్య శరణాగతి ఒనరించి తననే సర్వస్వంగా భావించే భక్తుల, వారి కుటుంబ సభ్యుల పూర్తి బాధ్యతలను తానే స్వీకరించి మోసేవారు. వారికి అభయ హస్తం అందించి ఎల్లవేళలా వారిని కంటికి రెప్పలా ఏ ఆప దా రాకుండా కాపాడుతుండేవారు. శ్రీ సాయి సశరీ రులుగా వున్నప్పుడు తన భక్తులను ఎలా రక్షించే వా రో, ఆయన మహా సమాధి చెందిన అనంతరం కూ డా తన భక్త జన సంరక్షణ అనే అవతార కార్యాన్ని అంతే సమర్ధవంతంగా నిర్వర్తిస్తున్నారు. సాయి భక్తుల కు ఈ విషయం ఎన్నోసార్లు అవగతమయ్యింది.
శ్రీ సాయిని గర్భిణి అయిన ఒక భక్తురాలు తన అయిదవ నెలలో దర్శించుకొని తనకు సుఖ ప్రసవం అయ్యేలా చూడమని కోరింది. బాబా చిరునవ్వుతో విభూతి ప్రసాదాలను ఆమెకు ఇచ్చి తథాస్తు అని దీవించారు. ఆ భక్తురాలికి నెలలు నిండి ప్రసవ వేదన పడుతున్న సమయంలో మశీదులో వున్న బాబా హఠాత్తుగాలేచి తన భక్తులతో తనకుకడుపులో నొప్పి గా వుందని చెప్పి, ఒక గుడ్డను కడుపుకు చుట్టుకొని రెండు కొనలను గట్టిగా లాగుతుండమని చెప్పా రు. భక్తులు ఆశ్చర్యంతో అదేవిధంగా చెయ్యగా కొద్దిసేప టికి నొప్పి తగ్గిందని బాబా యధావిధిగా తన స్థానం లో వెళ్ళి కూర్చున్నారు. ఆ తర్వాత గ్రామంనుండి వచ్చిన కబురు ప్రకారం బాబా కడుపులో నొప్పి వుం దన్న సమయంలోనే ఆ భక్తురాలు ప్రసవ వేదన పడిందని, నొప్పి తగ్గిందని చెప్పగానే ఆ భక్తురాలికి సుఖ ప్రసవమైందని తెలిసింది. అభయం ఇచ్చిన తరువాత వారి కష్టాలు తనవే అని బాబా తెలిపారు.
మరొక లీలలో తనను దర్శించడానికి వచ్చిన మోరేశ్వర్‌ ప్రధాన్‌ అనే భక్తుడితో శ్రీ సాయి ”నా శరీ రంలో ఈ ప్రక్కగా చాలా నొప్పిగా వుంది, అయినా మందులేమీ అవసరంలేదు, నాలుగురోజుల్లో సర్దు కుంటుంద”ని అన్నారు. ప్రధాన్‌ శ్రీ సాయిని దర్శిం చిన తర్వాత బొంబాయికి తిరిగి వెళ్ళడానికి అను మతి అడిగాడు, కాని శ్రీ సాయి ”మరొక నాలుగు రోజులు ఇక్కడే వుండి వెళ్ళు” అని అతనిని శిరిడీ లోనే వారంరోజులపాటు వుంచేసారు. తర్వాత బొం బాయికి తిరిగివెళ్ళిన ప్రధాన్‌కు అసలు విషయం తెలిసింది. తాను శిరిడీ వెళ్ళినప్పుడు అతని తల్లికి అకస్మాతుగా పక్షవాతం వచ్చింది. కుటుంబ సభ్యు లందరూ సమయానికి ప్రధాన్‌ లేనందుకు ఆందోళ నపడ్దారు. అప్పుడు నానాచందోర్కర్‌ ప్రధాన్‌ శిరిడీ లో వున్నంతవరకు అతని కుటుంబానికి ఎట్టి ప్రమా దం సంభవించదని, అందరినీ సాయియే కాపాడతా రని ధైర్యం చెప్పాడు. వారాంతంలో ఆవిడ పరిస్థితి విషమించింది. ఈవాళో, రేపో అన్నట్లు ఆవిడ పరిస్థి తి తయారయ్యింది. డాక్టర్లు ఇక ఏం చెయ్యలేమని చేతులెత్తేసారు. సరిగ్గా ఆ సమయంలో ప్రధాన్‌ శిరిడీ నుండి బొంబాయి చేరి ఆవిడకు తీర్ధ ప్రసాదాలనివ్వ గా ఆశ్చర్యంగా నాటి నుండే ఆవిడ జబ్బు తగ్గు ముఖం పట్టింది. డాక్ట ర్లందరూ చూస్తుండగా ఆవిడ నాలుగు రోజులలో లేచి తిరగసాగింది.ఈ ప్రపం చంలో అందరికంటే పెద్ద వైద్యుడు, సృష్టి, స్థితి, లయ కారకుడైన శ్రీ సాయికి అసంభ వం అనేది లేదు. ఎటువంటి విపత్కర పరిస్థితుల నుండైనా ఇట్టే మన ల్ని రక్షించగల సర్వ సమర్ధుడు. ఆయన అనుగ్రహ ఫలాన్ని పొందాలంటే అందుకు తగిన అర్హతను పొం దాలి. సర్వశ్య శరణాగతి చేసి మన బాధలను, కన్నీ ళ్ళను ఆయన పాదాలకు నివేదించి, కొండంత విశ్వా సంతో ఎదురు చూస్తే చాలు! మనం కూడా పై భక్తుల వలే సాయి దివ్య లీలలను క్షణంలో చవి చూస్తాము.

Advertisement

తాజా వార్తలు

Advertisement