Thursday, May 2, 2024

నవంబర్‌ నెల ఆర్జిత సేవలదర్శన టికెట్ల కోటా విడుదల

భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ షెడ్యూల్‌ ప్రకారం నవంబర్‌ నెల తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను శనివారం విడుదల చేయనుంది. నవంబర్‌ నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్‌లైన్‌ లక్కీడిప్‌కోసం శనివారం 10 గంటల నుంచి సోమవారం ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. లక్కీడిప్‌లో టికెట్లు పొం దిన భక్తులు సొమ్ము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాలి. కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్స వం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకార సేవా టికెట్ల ను ఈనెల 22 ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. అలాగే వర్చువల్‌ సేవా టికెట్లను ఈనెల 22 వ తేది మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. ఇక అంగప్రదక్షిణం టోకెన్లనూ ఈనెల 23 ఉద యం10 గంటలకు విడుదల చేస్తారు. అదేవిధంగా శ్రీవాణిట్రస్టు బ్రేక్‌ దర్శనం టికెట్లను 23వ తేది ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. వృద్దులు, దివ్యాంగుల దర్శన టికెట్ల కోటాను 23 మధ్యా హ్నం 3 గంటలకు, ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లను 24 వ తేది ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. తిరుమల-తిరుపతిలో వసతి గదుల బుకింగ్‌ 25వ తేది ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement