Sunday, May 26, 2024

పరమం పవిత్రం బాబా విభూది

శ్రీ సాయి శిరిడీకి వచ్చిన తొలి రోజులలో ఆకు పచ్చని కఫ్నీ, తలకట్టు ధరించేవారు. ఒక చేత్తో సటకా, మరో చేత్తో భిక్షాపాత్ర పట్టుకొని, భుజానికి జోలె తగిలించుని నిత్యం ఆ గ్రామంలో కేవలం అయిదు ఇ ళ్ళలో మాత్రమే భిక్షాటనం చేసేవారు. అంతేకాక, ఆయ న రోగులకు ఉచితంగా వైద్యం చేసేవారు. ఇతర వైద్యు లవలేకాక శ్రీ సాయి వైద్యవిధానం చాలా విభిన్నంగా వుండేది. ఒకసారి శిరిడీ గ్రామంలో గణపతి హరికణా డే అనే ఒక భూకామందుకు కుష్టువ్యాధి వచ్చింది. బాబా యొక్క అనుగ్రహ ఫలితంగా ఆ వ్యాధి వెంటనే తగ్గిపోయింది. కానీ బాబా అతనికి విధించిన కొన్ని కట్టు బాట్లను హరికణాడే ఉల్లంఘించడంతో ఆ వ్యాధి మళ్ళీ ప్రాణాంతకంగా తిరగబెట్టి కొద్దిరోజులలోనే అతను మరణించాడు. హరికణాడే మరణవార్త విన్న శ్రీ సాయి లో ఒకవిధమైన పరివర్తన వచ్చింది. ”ఈ మనుషులు ఎంత పిచ్చివారు? వారి మంచి కోరి చెప్పినా తమకు న చ్చిందే చేస్తారు కాని, మొరొకటి చెయ్యరు గాక చెయ్య రు” అనుకొని ఆనాటి నుండి రోగులకు మందులు ఇవ్వ డం మానేసారు. ఆ తర్వాత శిరిడీ ప్రజల అభ్యర్థనతో తాను శిరిడీలోని మశీదులో తన యోగశక్తితో వెలిగిం చిన పవిత్రమైన ధుని నుండి వచ్చే బూడిదను ప్రసా దంగా ఇవ్వసాగారు. శ్రీ సాయి తన భక్తులకు ఆశీర్వ దించి ఇచ్చే బూడిదనే ఊదీ (విభూతి) అని అంటారు. అది ఆరోగ్యమును, ఐశ్వర్యమును ప్రసాదించడమే గాక సమస్త దు:ఖములను, భయాందోళనలను దూ రం చేసేది. అన్ని రుగ్మతలకు దివ్యౌషధం, సకలైశ్వర్య ప్రదాయిని అయిన శ్రీ సాయినాధుని ఊదీ మహమల లో ఒక దానిని ఇప్పుడు స్మరించుకుందాం.
మహారాష్ట్రలోని #హర్ధా గ్రామంలో నివసించే ఒక వృద్ధుడు మూత్రకోశంలో రాయితో బాధపడేవాడు. ఆ రాయిని ఆపరేషను చేసి తీయాలని డాక్టర్లు సలహా ఇచ్చా రు. కాని అప్పటికే 70 సంవత్సరాల వయస్సు కలిగిన ఆ వృద్ధుడు స్వతాహాగా మనోబలం లేనివాడు కావడం చేత ఆపరేషనుకు ఒప్పుకొనలేదు. ప్రసిద్ధులైన దాక్టర్లు మందుల ద్వారా ఆ రాయిని కరిగించాలని చూసారు గాని అది సాధ్యపడలేదు. కనుక ఆ బాధ వలన ఇక మర ణమే శరణ్యమని ఆ వృద్ధుడు తీవ్రమైన మనోవేదనను అనుభవించసాగాడు. ఒకరోజు ఆ గ్రామపు ఇనాముదా రు ఆ వృద్ధుడు ఇంటికి ఏదో పని మీద రావడం జరిగిం ది. ఆ వృద్ధుడు పడే బాధను గమనించి తన వద్దనున్న శ్రీ సాయి వీభూతిని నీటిలో కలిపి ఆ వృద్ధుడు చేత త్రా గించాడు. అపరయోగీశ్వరుడూ, పరబ్ర#హ్మస్వరూపీ అయిన శ్రీ సాయినాధుని విభూతి మ#హమ చూడండి. అయిదు సంవత్సరాలలో కరగని ఆ రాయి విభూతిని సేవించిన అయిదు నిమిషాలలోనే కరిగి మూత్రంతొ పాటు బయటకువచ్చింది. ఆ వృద్ధుని బాధ శీఘ్రమే మటుమాయం అయ్యింది. తాను కోరకుండానే తన బాధను తగ్గించి తన జీవితంలో వెలుగురేఖలను నింపి న కలియుగదైవం శ్రీసాయికి ఆ వృద్ధుడు అనేక వేల కృతజ్ఞతలను తెలియజేసుకున్నాడు.
మరొక సందర్భంలో బొంబాయిలోని కాయస్త ప్రభు కులానికి చెందిన ఒక మ#హళ ప్రసవ సమయం లో చాలా బాధపడేది. ప్రతీ ప్రసవమూ ఆమెకు ఒక కొత్త జన్మలా వుండేది. ఒక సందర్భంలో ఆమె గర్భవతి అయ్యింది. ఎప్పటి వలే ఈసారి కూడా ప్రసవ సమ యంలో తానుపడే బాధలను తలుచుకొని ఆందోళన పడసాగింది. ఆమె దూరపు బంధువైన కళ్యాణ్‌ నివాసి అయిన రామ మారుతి అనువాడు ప్రసవమునకు ముందు శిరిడీకు పోవాల్సిందని ఆ కుటుంబానికి సల హా ఇచ్చాడు. ఆ భార్యా భర్తలిద్దరూ శిరిడీకి పోయి కొన్ని నెలలపాటు వున్నారు. ప్రతి దినము మశీదుకు పోయి బాబాను పూజించసాగారు. ప్రసవ సమయంలో ఎప్ప టివలే ఆమె సమస్యలను ఎదుర్కోసాగింది. చుట్టుపక్క ల వారు బాబా భజన చేస్తూ ఆమె చేత విభూతిని త్రాగిం చారు. ఆశ్చర్యం, కొద్దిసేపటిలోనే ఆమె నొప్పులన్నీ తగ్గిపోయాయి, సుఖ ప్రసవం జరిగింది, పండంటి కొడుకు పుట్టాడు. కొద్దిరోజుల తర్వాత శ్రీ సాయిని దర్శించి ఊదీ ప్రసాదములను తీసుకొని ఆనందంగా తమ ఇంటికి తిరిగివెళ్ళిపోయారు. శ్రీ సాయి ఊదీ చేసే మ#హమలింతింత కాదయా!

Advertisement

తాజా వార్తలు

Advertisement