Sunday, April 28, 2024

నవరాత్రి రహస్యాలు – తత్త్వము, వైభవము(ఆడియోతో…)

నవరాత్రి రహస్యాలు – తత్త్వము, వైభవము గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌
కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ
”ఏకేనాక్షరేణ ఛందాసి వియంతి నద్వాభ్యాం” అని శ్రౌత
సిద్ధాంతానుసారం ఒక అక్షరం తక్కువైతేనే అనగా తొమ్మిదితోనే
సృష్టి. సృష్టి ఆరంభానికి ముందు అంతా శూన్యమే అనగా
బిందువు. బిందువును జ్యోతిష్యానుసారం పూర్ణం అంటారు. ఈ
పూర్ణమే బ్రహ్మాక్షరం యొక్క మొదటి రూపం. ఈ పూర్ణ రూపంతొ
తొమ్మిది అక్షరాల విరాట్‌రూపం ఉత్పన్నమవుతుంది కావున
తొమ్మిదే ప్రధానం. ఒకటి పక్కన సున్నా చేరిస్తే 10. దీనిలో ‘1’
బ్రహ్మ, ‘0’ విరాట్‌ అనగా తొమ్మిది అనగా 1, 9. ఇవి రెండూ
కూడితే 10. తొమ్మది స్త్రీ, ఒకటి పురుషుడు అనగా తొమ్మిది శక్తి.
ఇందులో తొమ్మది ప్రధానమైనది కావున నవరాత్రి అని అంటారు.
సృష్టికి మూలం స్త్రీ కావున ఈ మూలమే శకి,్త ఇదే సృష్టి శక్తి. శక్తి
పుట్టేది శూన్యం నుండే. శూన్యం అనగా అంధకారం ఉండేది రాత్రి
కావున దీనినే నవరాత్రి అంటారు. ఈ పది పూర్ణరూపం కావున
మహా కాలమని ఇతనే మహా పురుషడు అని అంటారు. ఈ మ
హాకాలము యొక్క శక్తే మహాకాళీ ఇదే నవశక్తి, నవరాత్రి.
ఆ పరాత్పరుడు, పరమాత్మ సృష్టించడానికి రజోగుణమును
అనగా బ్రహ్మరూపమును, జగత్తును రక్షించడాని కి
సత్త్వగుణమును అనగా మహావిష్ణువు రూపమును, సం
హరించడానికి తమోగుణమును అనగా రుద్రరూపమును
స్వీకరించును. అనగా కాలపురుషుడు, యజ్ఞపురుషుడు, మ
హాపురుషుడుగా చెప్పబడుతున్న పరమాత్మ బ్రహ్మ, విష్ణు, రుద్ర
రూపములను స్వీకరించును. వీరు ముగ్గురు శక్తిమంతులు
కావలెను కాన బ్రహ్మ యొక్క శక్తి మహాసరస్వతీ, విష్ణువు
యొక్క శక్తి మహాలక్ష్మీ, రుద్రుని యొక్క శక్తి మహాకాళీ అనగా
సర్వస్వతి శక్తిగా బ్రహ్మరూపంలో సృష్టి, మహాలక్ష్మిశక్తిగా
విష్ణురూపంలో రక్షణ, మహాకాళీ శక్తిగా రుద్రరూపంలో ప్రళయం
జరుగును. ఈ విధంగా మహాలక్ష్మీ, మహాకాళీ, మహాసరస్వతీ ఈ
ముగ్గురు శక్తులు ఒక్కొక్కరూ మరల సత్త్వ, రజ, స్తమో గుణాలతో
ముగ్గురూ మూడుగా విభజించబడితే మూడు మూళ్ళు
నవశక్తులనబడును. వీరే ” నవశక్తీం మహాకాళీం బ్రహ్మవి
ష్ణుశివాత్మికామ్‌”.
…శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement