Sunday, April 28, 2024

Darling Birthday – ఇదేం క్రేజ్ ప్ర‌భాస్… జ‌పాన్ లోనూ పండుగ‌లా డార్లింగ్ పుట్టిన రోజు వేడుక‌లు

పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ పుట్టిన రోజు నేడు. బాహుబలి సినిమాతో ఇండియాలోనే కాక విదేశాల్లో కూడా ఎంతో మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు ప్రభాస్.. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ రకరకాల కార్యక్రమాలతో పుట్టినరోజు వేడుకను ఘనంగా చేశారు.. చూస్తుంటే ఒక పండగ వాతావరణంలాగా కనిపిస్తుంది.. ఇండియన్ అభిమానులని మించిపోయి మరీ జపాన్ అభిమానులు ప్రభాస్ పుట్టిన రోజుని సెలబ్రేట్ చేస్తున్నారు. జపాన్ లో పలువురు ప్రభాస్ అభిమానులు ఆయన పుట్టిన రోజుని పండగలా సెలబ్రేట్ చేసుకున్నారు.. ఒక దేవుడికి మనం ఎలా పూజలు చేస్తామో అలా వాళ్లు పూజలు చెయ్యడం విశేషం..

ఆయన పుట్టిన రోజు కోసం ప్రభాస్ కటౌట్స్ పెట్టి, ప్రభాస్ బొమ్మలు పెట్టి, వాటికి పూల దండలు వేసి, బర్త్ డే డెకరేషన్స్ చేసి మన తెలుగు ప్రసాదాలు పులిహార, కేసరి, గారెలు లాంటివి వండి దేవుడికి పెట్టినట్టు నైవేద్యం పెట్టి మరీ గ్రాండ్ గా వేడుకలు చేసుకున్నారు. అందరూ కలిసి సహపంక్తి భోజనాలు కూడా చేస్తున్నారు. ఇందులో ఎక్కువగా మహిళా అభిమానులు ఉండటం విశేషం

Advertisement

తాజా వార్తలు

Advertisement