Sunday, May 19, 2024

Peddapalli – విజయదశమిన పోలీస్ స్టేషన్ లలో ఆయుధ, వాహన పూజలు

విజయదశమి పర్వదిన వేడుకలు పెద్దపల్లి జిల్లా లో అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం ప్రజలందరూ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా నూతన వస్త్రాలు ధరించి దసరా వేడుకల్లో పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ లలో ఆయుధ,వాహన, షమీ పూజలు వేద పండితుల మంత్రం మధ్య ఘనంగా నిర్వహించారు. ప్రజలందరూ జమ్మి ఆకు ఒకరికొకరు పంచుకుంటూ విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో నిర్వహించిన ఆయుధ, వాహన పూజల్లో ఏసిపి ఎడ్ల మహేష్, సిఐ అనిల్ కుమార్, ఎస్సైలు మహేందర్, మల్లేష్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement