Monday, May 20, 2024

ముక్తిప్రదాతశ్రీసాయి

భగవద్గీతలో 8వ అధ్యాయంలో 5, 6 శ్లోకము లలో శ్రీ కృష్ణ పరమాత్మ ”ఎవరు నన్ను అంత్య దశలో జ్ఞప్తికి వుంచుకొని ధ్యానిస్తారో వారు నా సన్నిధిని చేరుతారు. ఎవరు అంత్యదశలో ఇతర విషయ ఉపాసనను చేస్తారో వారు మరుజన్మలో ఆ విషయములనే పొందెదరు.” అని ప్రవచించా రు. జీవిత కాలమంతా ఐ#హక పరమైన సుఖాల లో మునిగి తేలి, సర్వ సౌఖ్యాలను అనుభవించి ఆఖరు దశలో భగవధ్యానం చేయమంటే వీలు కాదు. విషయానందంలో మునిగి తేలిన పంచేం ద్రియాలు ఆఖరు దశలో కూడా ఆనందాన్నే కోరుకుంటాయి. జీవిత చరమాంకంలో కూడా విషయ ఉపాసనలో కాలం గడిపితే ఇక ముక్తి ఎలా సాధ్యం? అందుకనే యవ్వనపు దశ నుండి కూడా మన మనసును పవిత్ర పరచు కొని సర్వ శక్తులను క్రోడీకరించి భగవంతునిపైనే దృష్టి కేంద్రీకరించాలి. అప్పుడు జీవితపు ఆఖరు క్షణాలలో భగవంతుని ధ్యానం సులభతరం అవుతుంది. భగవంతుని సన్నిధిలో మరణించి ఉత్తమ గతులను పొందిన ఇద్దరు పరమ భక్తుల ను స్మరించుకుందాం!
శ్రీ సాయి సమాధి చెందడానికి వారం రోజు ల ముందు శిరిడీలోని మశీదు ముందు ఒక బండి వచ్చి ఆగింది. అందులో నుండి ముగ్గురు దర్వీ షులు గొలుసులతో కట్టిన ఒక పులిని దించి సాయి ముందుకు తీసుకువచ్చారు. ఆ పులిని ఒక సర్కస్‌ కంపెనీ నుండి దర్వీషులు కొని ఊరూరు తిప్పు కుంటూ డబ్బు సంపాదిస్తున్నారు. ఈమధ్యే ఆ పులికి తీవ్రమైన అనారోగ్యం చేసింది. ఎన్ని మం దులు వాడినా ప్రయోజనం లేకపోయింది. ఆ పులిని చూడగానే మశీదులోని సదరు భక్తులంద రూ భయంతో పారిపోయారు. శ్రీ సాయి చిరున వ్వుతో ఆ పులిని ఆశీర్వదించారు. శ్రీ సాయి కళ్ళ లోని కాంతికి తట్టుకోలేక ఆ పులి తన తోకతో సా యి పాదాలను స్పృశించి ప్రాణాలు వదిలింది. ఆ సంఘటనతో ఆ దర్వీషులు మరింత విచారం చెందారు. అప్పుడు సాయి కొంత పైకం వారికి ఇచ్చి ”ఈ పులి క్రిందటి జన్మలో నా భక్తుడు. ఈ జన్మలో నా పాదాల వద్ద ప్రాణం విడిచే వరం ఆనాడే ఇచ్చాను. దానికి ఇక పునర్జన్మ లేదు. నాలో ఐక్యం అయ్యింది. ఇక ఏం బాధ పడకండి. ఈ పులి ద్వారా కలిగిన నష్టం మరోలా సర్దుకుంటుం ది” అని ఓదార్చారు. ఆ సంఘటనను చూసిన వారి #హృదయం ద్రవించింది. ఎక్కడో పుట్టి, పెరి గిన ఆ క్రూర జంతువు అఖిలాండ కోటి బ్రహ్మాం డ నాయకుని చెంత ప్రాణాలు విడిచి ముక్తి పొం దింది. ఆ పులి అదృష్టం ఏమని చెప్పగలం? భగవంతుని పాదాల వద్ద ప్రాణం విడుచు వారికి ఇక పునర్జన్మ లేదు. ఈ జనన మరణ చక్రం నుండి అతి శీఘ్రంగా విముక్తిపొంది, ఆ సర్వేశ్వరునిలో ఐక్యమైపోతారు.
తాత్యా సాహబ్‌ నూల్కర్‌ అను వాడు పండరీపురంలో 1909వ సం వత్సరంలో సబ్‌ జడ్జ్‌గా పనిచేసాడు. అదే ఊరిలో మామల్తదారుగా పనిచే స్తున్న నానా చందోర్కర్‌తో అతనికి దోస్తీ కుదిరింది. మొదట నూల్కర్‌కు బాబాలన్నా, యోగులన్నా నమ్మకం వుండేది కాదు. కాని నానా సాంగత్యం లో అతని ఆలోచనా విధానంలో క్రమం గా మార్పు వచ్చింది. ఒకసారి నానా శిరిడీ వెళ్ళ మని నూల్కర్‌ను బలవంతపెట్టగా రెండు షరతు లపై నూల్కర్‌ ఒప్పుకున్నాడు. ఒకటి సాయికి బహూకరించడానికి చక్కని నాగపూర్‌ కమలాలు కావాలి, రెండవది శిరిడీలో వంట చేసి పెట్టడాని కి ఒక బ్రాహ్మణ వంటవాడు దొరకాలి. భగవం తుని అనుగ్రహం వలన రెండూ వెంటనే దొరక డం వలన నూల్కర్‌ తప్పని సరిగా శిరిడీ వెళ్ళా డు. మొదట్లో సంశయం అతనిని పట్టి పీడించి నా, రానురాను శ్రీ సాయి అవతార పురుషుడన్న నిదర్శనం అతనికి కలిగింది. ఇక ఉద్యోగానికి రాజీనామా చేసేసి అంత్యదశ వరకు శిరిడీలోనే వుండిపోయి శ్రీ సాయికి సేవ చేసుకున్నాడు. శ్రీ సా యి భక్తాగ్రేసరులలో ముఖ్యుడిగా పేరు తెచ్చుకు న్నాడు. శ్రీ సాయి ఆదేశం మేరకు భాగవతం, రామాయణం, మహా భారతం వంటి సద్గ్రంథాల ను పారాయణం చేసి సాయి సన్నిధిలోనే తుది శ్వాస విడిచాడు. శ్రీ సాయి అతని మరణవార్త వినగనే ఎంతో దు:ఖించి అతనికి పునర్జన్మ లేకుం డా ముక్తిని ప్రసా దించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement