Friday, May 10, 2024

Tarun Chugh : బండి సంజయ్ ను మార్చేది లేదు..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని మార్చేది లేదని బీజేపీ జాతీయ నాయకత్వం స్పష్టత ఇచ్చిందని తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… పార్టీలో ముఖ్య నేతలు అందరికీ కీలకమైన బాధ్యతలు ఉంటాయన్నారు. రాష్ట్ర నాయకత్వం సమిష్టిగానే పనిచేస్తుందని తరుణ్ చుగ్ వెల్లడించారు. బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేక సామాజిక మాధ్యమాల్లో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ల మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయన్నడం అభూత కల్పనగా కొట్టిపడేశారు.

నితీష్ నేతృత్వంలో విపక్షాల భేటీకి కాంగ్రెస్‌తో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా హాజరవుతున్నారన్నారు. దీనికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెబుతారని అన్నారు. పై స్థాయిలో అంతా కలిసి పనిచేస్తారని.. రాష్ట్రానికి వచ్చేసరికి విమర్శలు చేసుకుంటారన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల సంస్కృతి ఇదేనన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు బీ టీంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందన్నారు. కొన్ని సందర్భాల్లో బీ టీంగా, కొన్నిసార్లు సి టీంలో కూడా కాంగ్రెస్ పార్టీనే పోటీ పడుతోందని తరుణ్ చుగ్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement