Friday, May 3, 2024

సంకల్ప ఫలితమే సృష్టిలో సమస్తం!

ఎందుకో కారణం సరిగా చెప్పలేం, ఒక్కొక్క రోజు ఆకస్మికంగా మాటలలో చెప్పలేనంత గా దిగులుపడుతుంది మనస్సు. అంతకుముం దు రోజున్న ఉత్సాహం అకారణంగా అంతరించిపో యినట్లుగా అయిపోయి, మనసు స్తబ్దుగా మారిపో తుంది. స్పష్టతలేని ఆలోచనల వైపుకు తెలియకుం డానే దారిమళ్ళుతుంది. పక్కకు తెచ్చే ప్రయత్నం చేయాలన్న ఆలోచనే మనసుకురాదు. అలా దిగులు లో ఉండడమే ఉపశమనాన్నిస్తుంది. ఎవరొచ్చి పల కరించినా సరిగా సమాధానం చెప్పే ప్రయత్నం కూ డా చేయం. తెల్లవారేసరికి ముసురు పట్టిన వాతావ రణంలాగా మారిపోయుంటుంది అంతరంగం. తృప్తితీరా ఒక గట్టి వాన పడితేగాని అంతా శుభ్రమై పోయి మళ్ళీ పరిస్థితి మామూలయ్యే మార్గం లేద న్నట్లుగా ఉంటుంది లోపల. ఏదో అస్థిరత మనసు ను భయపెడుతున్నట్లుగా ఉంటుంది. వేదాంతం వైపు ఆలోచనలు వాటినే మననం చేసుకోవడం మొ దలుపెడుతుంది. ఎక్కడ మొదలు, ఎక్కడ తుది? అన్న ప్రశ్నల వైపు పరుగెట్టడంలో ఏదో శాంతి ఉన్న ట్లుగా కూడా అనిపిస్తుంది. నిజానికి తన మనసులోని దిగు లుకు అందులోనే సమాధానం ఉందన్న భరోసా కూ డా కలుగుతుంది. ఆ విధంగా, సమాధానం కోసం చేసే ప్రయత్నం సమాధానం కంటె కూడా గొప్పదిగా, శాంతి కలిగించేదిగా కనిపిస్తుంది. ఆ ప్రయత్నమే మడికి సింగన ‘వాసిష్ఠ రామాయణం’లో జరిగింది.
సాక్షాత్‌ దైవస్వరూపుడైన శ్రీరామచంద్రుని మన సులోనే తాను సమాధానపరుచుకోలేని దిగులు ప్రభ వించి సకల చరాచర సృష్టి, అందులో మనిషి జీవి తం గురించిన ఎన్నో ప్రశ్నలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దాని కి ఏమి చేయాలో తెలియక, ఎవరిని అడగాలో తెలియ క అందరికీ దూరంగా తన అభ్యంతర మందిరంలో మౌనంగా కూర్చుని ఉన్న శ్రీరాముడిని, యాగ రక్షణా ర్థమై తనతోపాటు తీసుకుపోదామని వచ్చినట్టి వాడై న, విశ్వామిత్ర మహాముని చూస్తాడు.

సీ|| తండ్రి రాజ్యస్థుఁడై ధరణి బాలింపంగ
యువరాజువై భోగయోగ్యమైన
¸°వనంబున సౌఖ్యమనుభవించుచు నుండ
కిట్టి మనోవ్యథ యేల కలిగె?
నెలుకలు ద్రవ్విన యింటిచందంబున
దిగజారినీ మేను మిగుల డస్సె
నీ దు:ఖములు నీకు నేయర్థమున బుట్టె?
నిట్టి విరక్తి నీ కేల వచ్చెఁ?
తే||గీ|| గెలనివారు నవ్వ–ఁ గలఁగి మ్రాన్పడి యున్న
నిన్నుఁ జూచి వగ జనించె నాకు.
వినుము దెవులు లేని వేదనఁ బొరలుచు
నున్నరూపు సెప్పవోయి వత్స.
( వాసిష్ఠ రామాయణము, ప్రథమాశ్వాసం 76వ పద్యం)
”తండ్రి దశరథ మహారాజు రాజ్యపాలనానికి సంబంధించిన పనినంతటినీ చూసుకుంటూ ఉండ గా యువరాజువై భోగభాగ్యములను అనుభవిస్తూ సుఖంగాను, సంతోషంగానూ ఉండకుండా, ఈ వైరా గ్యం ఏమిటి నీకు? పక్కనున్నవారు నిన్ను చూసి పరి హాసం చేయగలిగేంతగా మ్రాన్పడిపోయి ఉన్న నిన్ను చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది రామయ్యా! ఇలా అంతంలేని, సమాధానం లేని దిగులులో కూరుకుని పోయిన ఈ వైరాగ్య స్థితిలో ఉండడానికి కారణం ఏమిటో చెప్పు నాయనా!” అని శ్రీరాముడిని విశ్వా మిత్ర మ#హర్షి అడగడంపై పద్యాలలో భావం.
”ఎలుకలు ద్రవ్విన యింటి చందమై దిగజారి నీ మేను మిగుల డస్సె” అని అచ్చ తెలుగు పదబంధాల తో కూడిన సామెతతో పోలిక చెప్పించాడు విశ్వామిత్ర మహర్షి చేత మడికి సింగన. మనిషి మనసులో సమా ధానం దొరకని ప్రతి ప్రశ్న కూడా ఒక ఎలుకలాంటిద ని పోలిక. మనిషి అంతరంగం ఒక ఇల్లయితే, ఆ ఇం టిలో సమాధానం దొరకకుండా తిరిగే ఎలుకలు ఎన్ని ఎక్కువగా చేరితే అంత ఎక్కువగా యజమానికి నష్టం జరుగుతుందని, అది ఏమాత్రం ఆరోగ్యకరమైన స్థితి కాని, అభిలషణీయమైన స్థితి కాని కాదని భావం.
అలా విశ్వామిత్రమహర్షి బుజ్జగించి అడగడం తో, శ్రీరాముడు తన మనసులోని బాధను ఆయన ముందు ఇలా వెళ్ళబోసుకుంటాడు-
సీ|| బ్రహ్మయోగీంద్ర యీ భవరోగములు నాకు
నేవెంట నెడఉబాయు? నెద్ది సార?
మేమార్గమునఁ జేసి ఈ దుష్టసంసార
దు:ఖంబు వెడలు? సత్పురుషు లొందు
గతి నాకుఁ గలుగు మార్గము విస్తరించి మీ
రెఱిఁగిన భంగి నా కెఱుఁగఁ జెప్పుఁ;
డెఱిఁగింప కుంటిర యేని మజ్జన భోజ
నాదులఁ దొఱఁగి మీ యడుగులొద్ద

తే||గీ|| మేను దొఱఁగువాఁడ; మీయాన; యని పల్కి
నిబిడ భాష్పకలిత నేత్రుఁడగుచుఁ,
జిత్రరూప భంగిఁ జేరి యూరక యుండె
సత్యధనుఁడు రామచంద్రుఁ డనఘ.
‘భవరోగము’ అనగా ఈ పుట్టుక చావులకు సం బంధించిన వేదన నుండి నాకు ఎప్పటికి విముక్తి కలు గుతుందో చెప్పమంటాడు శ్రీరాముడు. ఈ సాంసారి క బంధాలకు అనుబంధమైయున్న మహాదు:ఖం ఏదైతే వున్నదో అది మదిలోంచి ఎప్పుడు సంపూ ర్తిగా తొలగిపోయి, ఈ లోకంలో సత్పురుషులుగా పేరు పొందిన వారికి లభించిన ముక్తి నాకు ఎప్పుడు లభి స్తుందో తెలియజెప్పమని అంటాడు. ఈ విష యంలో మీకు తెలిసినదంతా తెలియజేయమని అడుగుతాడు. కళ్ళలో నీళ్ళు ఉబికి వస్తుండగా, చెప్పకపోతే మీ పాదా ల చెంతనే ప్రాణాలు వదలడం తప్ప వేరే గత్యంతరం లేదని శ్రీరాముడు అర్ధించడం పై పద్యం భావం.
శ్రీరాముని ఆ మాటలకు చాలా సంతోషించిన వాడైన విశ్వామిత్రుడు -పూర్వం వ్యాసమహర్షి కుమా రుడైనటువంటి శుకయోగికి కూడా ఇలాంటి అవస్థే కలుగగా, వ్యాసులవారు చెప్పగలిగింది చెప్పి ఈ విష యంలో మిథిలను యేలే రాజైన జనకుడు బాగా సందే హనివృత్తి చేయగలడు కాబట్టి అతని వద్దకు వెళ్ళమని కొడుకుని పంపుతాడు. అలా వెళ్ళిన శుకయోగికి జన కుడు చెప్పిన మొదటి మాటలు ఈ క్రింది పద్యం.

కం|| అనఘ, చిత్పురుషుఁ డొక్కఁడె;
విను మన్యము లేదు; తత్త్వవిధ మిట్టిదగున్‌;
దన సంకల్పమె బంధము
తన సంకల్పక్షయంబ తగ ముక్తి యగున్‌.
(వాసిష్ఠ రామాయణము, ప్రథమాశ్వాసం, 143)

ఇందులో జనకుడు చెప్పిన అత్యంత విలువైన మాట పైపద్యంలోని మూడు, నాలుగు పాదాలలోని ది. ఏ మనిషికైనా ‘సంకల్పమే బంధం, సంకల్పం క్షీ ణించి పోవడమే ముక్తి’ అన్నది ఆ మాటల సారాంశం.
అలా ‘వాసిష్ఠ రామాయణము’లోనే మరికొంత ముందుకెళ్తే వసిష్ఠులవారు చెప్పిన మాటలు మరింత గా ఈ సంగతిని ధృవీకరించి మనస్సనే మాట మరేదో కాదు ‘సంకల్పమే’ అన్నది స్పష్టమవుతుంది.

- Advertisement -

కం|| విను మాత్ముని సంకల్పమె
మన మనఁబడుఁ గాక, వేఱ మన సొక్కటియే?
దనరఁగ సంకల్పము నెడ
మన మని వర్తించుచుండు మహత వివేకా!
(వాసిష్ఠ రామాయణము, ద్వితీయాశ్వాసం, 27)
అట్లు గావున మనస్సంకల్పంబులకు నెన్నఁ డును దేనిచేతను భేదంబు లేకుండు…
(ద్వితీయాశ్వాసం, 28 వచనంలో భాగం)
మనిషిలో ఆత్మ యొక్క ‘సంకల్పమే’ మనసు. అది తప్పితే మనసు అనే మాటకు వేరే అర్థం ఎక్కడి ది? అందువలన, మనసు, సంకల్పం అనే మాటలు ఎప్పుడూ, దేని చేతనూ వేరుచేయబడలేనటువంటివి కనుక ఈ రెండింటికీ భేదం ఏమీ లేదని సారాం శం.
సామాన్యార్థంలో ‘సంకల్పం’ అనే మాటకు ‘నిర్ణ యించుకోవడం’ అనే అర్ధాన్ని చెప్పుకుంటాం. ఒక పని చేయడానికి సంకల్పించుకోవడం అంటే మానసి కంగా గట్టి నిర్ణయం తీసుకోవడం అని అర్థం. అయితే మడికి సింగన రచించిన ‘జ్ఞానవాసిష్ఠ రామాయణం’ లో ఈ ‘సంకల్పం’ అనే మాటను విశేషమైన అర్థంలో ఉపయోగించారు. సృష్టిలో సంకల్ప ఫలితమే సమ స్తం అన్న స్థాయి దాకా ఈ విశేషార్థం వెళుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement