Monday, April 29, 2024

మహత్తర సంగమం

సప్త అశ్వాలు పూడ్చిన ఏకచ్రక రథంలో అనూరుడు రథసారధిగా సర్పములు కళ్ళము లుగా గగన తలంలో నిత్యం సంచరించుచు సూర్యభగవానుడు నవ్రగహాధిపతిగా సృష్టిని సమదృష్టితో పాలిస్తూ ఉదయాన తన నులి వెచ్చని కిరణాలతో జీవకోటికి దర్శనమిచ్చే ప్రత్యక్ష దైవం. సూర్యుని సంచారం ప్రతినెల ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తూ ఉంటాడు. ఈ విధంగా సంచారం చేయడాన్ని సంక్రమణం అంటారు. దీనినే సంక్రాం తి అని అంటారు. అందువల్ల మనకు ప్రతినెల ఒక సంక్రాంతి వస్తుంది. కాని సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మాత్రమే మనం పండుగలా జరుపుకుంటాం. దీనికి కారణం రవి మకరంలో ప్రవేశించినది మొదలు ఉత్తర దిశగా తన పయనం ఆరంభం అవుతుంది. దీనినే మనం ఉత్తరాయణం అని అంటాము. అతి పవితమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో పితృకార్యాలు చేయటం వల్ల వారికి ఉత్తమలోక ప్రాప్తి కలుగుతుంది. ఉత్తరాయణం ప్రాముఖ్యత చెప్పాలంటే చాలా వున్నది. ఇది దేవతలకు పగటికాలం అని దక్షిణాయనం రాత్రికాలం అని విజ్ఞలు అందురు. కాబట్టి దేవతలకు ప్రీతి కలిగించడానికి చేసే యజ్ఞ యాగాదులకు ఉత్తరాయణం ఉత్తమమైనది. ఈ ఉత్తరాయణం పుణ్యకాలంలో మరణించిన వారికి మరుజన్మ వుండదని, ఉత్తమలోక ప్రాప్తి కలుగుతుందని భీష్మపురాణం చెబుతుంది. ఇన్ని విధాలుగా కీర్తించబడిన ఉత్తరాయణం ఏర్పడటానికి మూలమైన రవి మకర సంక్రమణం మహత్తర సంగమంగా భావించవచ్చు. ఇది సృష్టి క్రమం. శుభప్రదం. ముందుగా వచ్చేది భోగి పండుగ. పౌష్యలక్ష్మి రాకతో ఇళ్ళు, వాకిళ్ళు, ధాన్యపు రాశులతో పాడిపంటలతో అవి తినడానికి వచ్చిన పక్షుల కిలకిలలతో అందరి ముఖాలు కళకళలాడుతూ వుండగా ఆరోజు ఉదయాన్నే భోగి మంటలు పెద్ద ఎత్తున వేసి అందరు కలిసి అగ్నిదేవునికి ఆహ్వానం పలికి అందరి జీవితాలు ఆనందంగా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తారు. ఈ భోగి రోజు దక్షిణాయనం ఆఖరిరోజు. ఆ స్వామి తేజం భూలోకమంతా వెలిగిపోవాలని, తమ గృహాల్లో వున్న, పేరుకుపోయిన చెత్త, చెదారం, పనికిమాలిన వస్తువులను, అదేవిధంగా పనికిమాలిన ఆలోచనలు ఆ మంటలనందు వేసి అవి కాలుతుంటే అగ్ని చుట్టూ చేరి సందడి చేసి రాగిపాత్రలలో వేడినీరు కాచుకుంటారు. భోగి పిడకలు మంటల్లో వేస్తారు. ఇక పల్లెల్లో ఆ శోభ చెప్పతరం కాదు. ఇది అన్నదాతల పండుగ గాదెల నిండుగా ధాన్యం నింపి ఆ పంట ఇంటికి వచ్చిన ఆనందంతో రైతన్న తన కష్టాన్ని మరచి తన వారితో సంతోషాన్ని పంచుకుంటాడు. ఏ వీధిలో చూసినా మామిడి తోరణాలు, చెఱకుగడలు ముంగిట రంగవల్లులతో అలంకరించబడి వుంటాయి. కొన్ని చోట్ల కోడిపందాలు, ఎడ్ల పందాలు పొట్టేళ్ళ పందాలతో బహుసందడిగా వుంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement