Friday, March 29, 2024

వచ్చెను… సంక్రాంతి పురుషుడు

మకర సంక్రాంతి… ఒక కాల విశేషం. మనవారు విశిష్ట లక్షణాలతో ఒక ఆకారాన్ని భావించి ఏర్పరుస్తూ ఉంటారు. అదొక చిత్రలిపి. విశిష్ట లక్షణాలతో ఉన్న సంక్రాంతి కాలాన్ని ఒక పురుషునిగా వర్ణించారు. ఈ సంక్రాంతి పురుషుడు నిర్మల జలంతో స్నానం చేస్తాడు. అంటే శుభం కలిగిస్తాడు అని అర్థం. ఇతడు పెసలను అక్షతలుగా ధరిస్తాడు. అంటే- పెసలు నశిస్తాయి అని భావం. పెసల ఖరీదు పెరుగుతుందని భావిం చవచ్చు. ఎర్రటి వస్త్రం కట్టుకుంటాడు అంటే కొట్లాటలు జరిగే అవకాశం ఉందని భావం. మినుములు అక్షతలుగా తాల్చును అంటే మినుములు తక్కువగా లభిస్తాయని అభిప్రాయం. చందనం గంధంగా ధరిస్తాడు అంటే ఆరోగ్యం బాగుంటుం దని ఉద్దేశ్యం. జాజిపువ్వు ధరిస్తాడు అంటే కీర్తి బాగుంటుం దని భావం. నీలాభరణం ధరిస్తాడు అంటే క్షామం కలుగు తుందట. వెండిపాత్రలో తింటాడట. అంటే వెండి తగినంత లభించదు. పాయసం తింటాడు అంటే వర్షాలు సరిగా పడవ ని సూచన. అరటిపండు ధరిస్తాడు అంటే ఆరోగ్యం కలుగు తుందని భావం. అతనికి వాహనం పులి. అంటే మృగాలు నశిస్తాయని సూచన. భిండినాలం ఆయుధంగా ధరిస్తాడు. భిండినాలాలు పూర్వకాలంలో ఉండే ఆయుధాలు. ప్రభువు లకు అరిష్టం కలుగవచ్చని సూచన. ఎర్రటి గొడుగు వేసుకుం టాడు అంటే యుద్ధం రావచ్చని సూచన. దక్షిణ దిక్కు వైపు వెడతాడు అంటే దక్షిణ దేశాలకు అరిష్టం అని భావం. క్రోధ ముఖంగా చేష్ట చేస్తాడట. దీనివలన ప్రజలకు ఇబ్బంది. అతడు నివిష్టుడుగా ఉన్నాడు. అంటే సస్యవృద్ధి అవుతుంది.
ఇలా చెప్పడం ఎందుకు? సూటిగా చెప్పవచ్చు గదా! దేవతలకు పరోక్షంగా చెప్పడం ఇష్టమట. ఈ సంవత్సరం సంక్రాంతి కృష్ణ పక్షంలో వస్తోంది. అంటే చీకటి రాత్రులలో వస్తోంది. శుభ పరిణామం. దీనివలన మంచి వర్షం, ఆరోగ్యం, సస్య సంపదలకు అనుకూలం.
అష్టమి తిథిలో శనివారం రాత్రి మకర సంక్రమణం ప్రవేశి స్తున్నది. ఇది నాయకులకు రణాన్ని సూచి స్తుంది. అష్టమి ప్రవేశం ధరలు ఎక్కువగా ఉంటా యని సూచిస్తుంది. చిత్త నక్షత్రంలో సంక్రాంతి వచ్చింది. ఇది ధాన్యవృద్ధిని తెలుపుతుంది. చాలువ కరణంలో వచ్చింది. ఇది సుభిక్షం సూచిస్తుంది. సుక ర్మ యోగంలో వచ్చింది ఇది అభివృద్ధిని తెలుపు తుంది. సింహలగ్నంలో సంక్రమణం జరిగింది. ఇది యుద్ధం సూచిస్తుంది. 19వ ముహూర్తంలో సంక్రమణం కలిగింది. ఇది శుభ సూచకం. రాత్రి వచ్చింది. రాత్రి తిరిగేవారికి హానిని సూచిస్తుంది. ఈ సంక్రమణం సస్యాభివృద్ధిని కూడా తెలుపు తుంది.
ఆదివారం ఉదయం సంక్రమణం పుణ్యకాలం. రెండు కాల భాగాలు విరుద్ధ ఫలాలను సూచిస్తే దేన్ని తీసుకోవాలి అనే సందేహం వస్తుంది. ఆ రెండు కలిసి సమ ఫలం తెలుపుతా యని చెప్పవచ్చు. దేవతలకు ఉత్తరాయణం పగలు. దక్షిణా యణం రాత్రి. కనుక వారికి ఉదయకాలం ప్రారంభ మవు తుందన్నమాట. కాబట్టి మకర సంక్రాంతి ప్రభావం సంవత్స రంపై ఉంటుంది. ఉగాదికి చెప్పిన ఫలాలను, వీటిని సమన్వ యించుకొని సంవత్సర ఫలం గ్రహించాలి.
సంక్రాంతి రోజు కంచు, ధాన్యం దానం చేస్తే దోషాలు తొల గుతాయన్నారు. పళ్ళు, బంగారం, నువ్వులు, చెరకు గడలు, గోవులు, ధాన్యం సూర్యుని మకర ప్రవేశ సమయంలో దానం చేస్తే విశేష పుణ్యం వస్తుందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement