Friday, April 26, 2024

సర్వ దేవతాత్మకుడు హనుమ

శ్రీరాముని చరిత్రకు రామాయణం, శ్రీకృష్ణ చరిత్రకు భాగవతం ఎలానో హనుమ భవ్య చరిత్రకు ”పరాశర సంహిత” అటువంటిది. వ్యాసుని తండ్రి పరాశరుడు. స్కాంద, అగ్ని, పద్మ, నారద, మార్కండేయ పురాణాలలోనూ, అగస్త్య, శౌనక, సుదర్శన సంహితులలోనూ విస్తరంగా చెప్పబడిందని శాస్త్రవేత్త లంటారు . శ్రీమహావిష్ణువు శ్రీరామునిగా అవతరిస్తే, అతనికి దుష్టశిక్షణలో, శిష్టరక్షణలో రామకార్యసిద్ధికై సాక్షాత్తు శివుడే హనుమంతునిగా అవతరించాడని పరాశర సంహిత అంటున్నది. రుద్రతేజ స్వరూపుడైన హనుమ సర్వదేవతా త్మకుడు. ”ఆంజనేయ పూజితశ్చేత్‌ పూజితా సర్వదేవతా”అని శృతి.
”రామాయణ మహామాలా రత్నం వందే నిలతాత్మజమ్‌” అన్నారు. హను మయే ప్రధాన పాత్ర (దైవం)గా నడచిన సుందర కాండలో హనుమంతునిలోని సద్గుణాలన్నీ ప్రకాశవంతంగా ప్రతిఫలిస్తాయి. సుందరకాండ అంతా హనుమ కథే. చలనచిత్ర రంగ పరిభాషలో చెప్పాలంటే హనుమ సుందరంగా దర్శనమిస్తాడు. ప్రతి ఫ్రేమ్‌లో. హనుమంతుని సుందరుడని చెప్పింది పరాశరసంహిత. ”సుతరాం అద్రియతే ఇతి సుందరం”అని నిర్వచనం. అందరిచేత ఆదరింపబడేవాడు, అందరికి సంతోషం, ఆనందం కలిగించేవాడు, అందుకే అందరికి హనుమంటే ప్రీతి. హనుమ ప్రవేశంతో రామాయణం మహామహిమాన్వితమైంది. ‘రామా యణంలో హనుమంతుడే ప్రధానదైవంగా నడచిన సుందరకాండ మహామహి మాన్వితమైంది. హనుమ సమగ్ర స్వరూపాన్ని సుందరకాండ చిత్రిస్తుంది హను మంతునిలో గుణాలను చెప్పుకుందాం.
వినయము
యుద్ధం మొదలైనది మొదలు ఏ అస్త్ర శక్తికి లొంగనివారు విభీషణుడు, హనుమ. రణక్షేత్రాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న సమయంలో జాంబవంతుని విభీషణుడు పలకరించాడు, అప్పుడు జాంబవంతుడు మారుతి కుశలమడిగాడు. రామసుగ్రీ వాది ప్రముఖులుండగా ఒక్క హనుమను గురించి ఎందుకడుగు తున్నారని విభీషణుడు ప్రశ్నించగా ”వాడొక్కడు బ్రతికుంటే, మహా యోధులంతా హుతులైనా బ్రతికించగలం. వాడు లేడో వీరంతా ఉన్నా లేనట్లే” అన్నాడు జాంబవంతుడు. ప్రక్కనే ఉన్న హనుమ ఆ మాటలు వింటూనే జాంబవంతుని పాదాలకు ప్రణమిల్లాడు.
హనుమ వినయ సౌశీల్యానికి మరో ఉదాహరణ. యుద్ధం ముగిసింది అందరూ అయోధ్యకు ప్రయాణ మయ్యారు. మార్గమధ్యంలో భరద్వాజ ఆశ్రమం వద్ద ఆగారు.
వాగ్వైదుష్యం

రామాయణ కావ్యాన్ని ప్రారంభిస్తూ నారదునిని ”వాగ్విదావరం”అని ప్రస్తు తిం చారు. అంటే కిష్కిందకాండలో హనుమను ”వాక్య కోవిదుడు” అనే ప్రశంస శ్రీరా ముని ముఖ త: పలికించాడు. వాక్కు అంటే శబ్ద బ్రహ్మము. ఆ బ్రహ్మ తత్త్వము తెలిసినవారే ఇరువురూ. తొలిపరిచయంలోనే ఇతడు ఋగ్వేద వినీతుడు, యజుర్వేదధారి, సామవేద విదురుడు అంటాడు. మాటలలో వ్యాకరణ దోషం లేదు. సందిగ్ధం లేదు. హృదయం నుంచి వచ్చే శబ్దం కంఠం నుండి వెలువడు తు న్నది. హావ భావాల ప్రకటనం లేదు. ”ఇటువంటివాడు సచివు డుగా పొందిన రాజు సాధించలేనిదేమీ లేదు”అని ధృవపత్రాన్ని కూడా ఇస్తాడు. రామాయణంలో ఏనా డూ ఎవరిని ప్రశంసించని శ్రీరాముడు తొలి పరిచయంలోనే హనుమపై గురి కుది రిందనడానికి సాక్షాత్కారం.
వాక్య విశారదుడు

ఎవరైనా తమ కార్యం సాఫల్యం చెందాలంటే మాటతీరు వల్ల సగం సమస్య తీరుతుంది. తొలిసారి రామలక్ష్మణులను కలిసినప్పట్నించి హనుమలో వాక్య చాతు ర్యం కనిపిస్తుంది. ఎవరితో, ఎంతవరకు, ఏమి మాట్లాడాలో హనుమను చూసి నేర్చుకోవాలి. లంకాయానం చేసే సమయంలో సమయస్ఫూర్తితో మైనాకుని, సురసల అవరోధాలను దాటాడు. మంచి మాటలకు లొంగని సింహికను హత మార్చాడు. లంకానగర అధిష్ఠాన దేవత లంకకు చేరగానే ఎదురొచ్చి అడ్డుకుంది. చంపేస్తానని బెదిరించింది. నీవడిగినవాడికి సమాధానం చెబుతానంటూ విన యంగా పలికి, భీకరాకారంగా పెరిగి నీ సంగతి చెప్పు, ఏమి చెప్పాలో, ఎంత చెప్పా లో అప్పుడు చెబుతాను అంటూ ఒక్క ఘాతుకంతో హతమారుస్తాడు. ఈ రెండు సన్నివేశాలలో హనుమవాక్చాతురి, లోకజ్ఞత, వ్యవహార పరిజ్ఞాతృత్వం స్పష్టమ వుతాయి. ”ఉపకారం పొందిన నీవు ప్రస్తుతుడనై ప్రతిజ్ఞా కాలాన్ని మరిచిపోయేవు’ అని మృదువుగా మందలిస్తూనే కర్తవ్యం బోధపరిచాడు సుగ్రీవునికి మరొక సంద ర్భంలో స్వయంప్రభతో మాట్లాడిన తీరుకు ఆమె ముచ్చటపడి వానరసేనకు ఆతి థ్యమివ్వడమే కాకుండా సాగరతీరానికి చేర్చింది. అశోకవనంలో శింశుపావృక్షం కొమ్మలలో అంగుష్ట మాత్రుడుగా ఉన్న హనుమ సీతాదేవి తనకు మరణం తప్ప గత్యంతరంలేదని కేశపాశంతో ఉరివేసుకోవడానికి పాల్పడుతున్న సందర్భం, సమ యం మించిపోతున్నది. వెంటనే హనుమ ”రాజా దశరథోనామ రథకుంజర వాజ్‌ మాన్‌” అంటూ అంతవరకూ జరిగిన కథకు క్లుప్తంగా అసందిగ్ధంగా, అవిలంబి తంగా” చెప్పాడు. మెల్లగా చెట్లు దిగి సీతకు నమస్కరించి నిల్చు న్నాడు. ఆమె శంక తీరేలా రాముడిచ్చిన అంగుళీయకాన్ని అందించాడు. ఆ సందర్భంలో వారి మధ్య ఆత్మీయ తాభావంతో జరిగిన సంభాషణలు ఎంతో ఔచితీవంతంగా ఉంటుంది. ముఖ్యంగా రావణుని ఎదుట ఔచితీ మంతమైన వాక్పటిమను ప్రదర్శించాడు. శతృ వైనప్పటికీ, రావణు నిలో ‘పరదా రాపహరణం’ అనే అధర్మ ప్రవృత్తి లేకపోతే ఇంద్ర పదవి అలంకరించడానికి తగినవాడని గుర్తించిన ధీమంతుడు హనుమ. ”రాముని క్రోధాగ్నీ, సీతా మహాదేవి పాతివ్రత్యతేజాగ్నీ రెండూ లంకానగరాన్నీ, నిన్ను సర్వ నాశనం చేస్తుంటే నీవు ప్రత్యక్షంగా చూస్తావు” అని హెచ్చ రించాడు.


– ఎ.సీతారామారావు

Advertisement

తాజా వార్తలు

Advertisement