Thursday, April 25, 2024

ట్రాక్ట‌ర్ డ్రైవ‌ర్ గా బిజెపి తెలంగాణ అధ్య‌క్షుడు-పొలం దున్నిన బండి సంజ‌య్

బిజెపి తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ట్రాక్ట‌ర్ డ్రైవ‌ర్ గా మారారు. ప్ర‌జా సంగ్రామ యాత్ర మూడో ద‌శ‌లో భాగంగా ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు… త‌ను వెళ్లే దారిలో ఓ పొలం వ‌ద్ద ట్రాక్ట‌ర్‌తో క‌నిపించిన రైతుల‌తో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ట్రాక్ట‌ర్ ఎక్కి డ్రైవ‌ర్ సీట్లో కూర్చున్న సంజ‌య్‌… ట్రాక్ట‌ర్‌ను న‌డుపుతూ ముందుకు సాగారు. త‌న‌కు ఓ వైపున రైతును కూర్చోబెట్టుకుని ట్రాక్ట‌ర్‌తో పొలాన్ని దున్నిన సంజ‌య్‌… ఇరగమరగ సాలిరవాలు దున్నాలె.. రైతన్న ఇంట సౌభాగ్యం నిండాలె.. అంటూ వ్యాఖ్యానించారు. ట్రాక్ట‌ర్‌తో పొలం దున్నుతున్న ఫొటోల‌ను ఆయ‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement