Thursday, May 16, 2024

కర్మ బంధ విముక్తి

ఈ చరాచర సృష్టిలో కర్మలకు బందీ అయ్యేది మానవ జన్మ. ప్రతి మనిషి ఆయా దశల్లో కర్మలకు బందీ అవ్వాల్సినదే. బందీ కా కుండా కర్మబంధం నుండి తప్పించుకోవడానికి కొన్ని మార్గాలను తెలియజేస్తున్నాయి మన ఇతి హాసాలు. కర్మ బంధం విముక్తి కలగాలంటె కర్తృ త్వబుద్ధిని విడిచిపెట్టాల్సిందే అంటున్నాయి.
మనస్సు ద్వారా అభ్యాసయోగం చేయలేని వారు శరీరంతో భగవంతుని కొరకు కర్మలు చేస్తూ క్రమక్రమంగా సిద్ధిని పొందవచ్చు. మొ త్తం మీద ఈ మార్గం కూడా మోక్షానికి దారితీ స్తుంది.
ప్రపంచంలో అందరికీ ఒకే సాధన పనికిరా దు. వారివారి స్వభావాన్ని బట్టి, స్థితిని బట్టి, అర్హతలను బట్టి సాధనలు వేరువేరుగా ఉండాలి. ఇలా అనేక మార్గాలను (సాధనలను) చూపితే ఎ వరికి కావలసిన మార్గాన్ని వారు ఎంచుకోవచ్చు.
అయితే ఇక్కడే ఒక సందేహం. అన్నీ భగ వంతుని కొరకే చేస్తుంటే మన పనులు ఎవరు చేస్తారు? మనకోసం కొన్ని పనులు తప్పవు గదా! అని. ఐతే ‘అన్నీ మన పనులే చేసుకోవాలి’- అంటే భగవంతుని కోసం పనులు చేయనక్కర్లేదా? అని ఎవరికీ సందేహం రాదు. అన్నీ భగవంతుని కొ రకే పనులు చేయండి అంటేనే మరి మన పనులో? అనే సందేహం.
సాధారణంగా మన తిండితిప్పల కోసం, సుఖం కోసం, భోగాల కోసం, అవసరాల కోసం కొన్ని పనులు చేస్తుంటాం. ఇవి మన కొరకు చేసే పనులు. ఇక సమాజం కోసం సభలు, సమావేశా లు, దేవాలయాలు, కళ్యాణ మండపాలు కట్టిం చటం, బావులు త్రవ్వించటం, వృద్ధాశ్రమాలు నిర్వహంచటం- ఇవన్నీ సమాజం కోసం. ఇక పూజలు, వ్రతాలు, నోములు, యజ్ఞాలు, వేదాధ్య యనం మొదలైనవి భగవంతుని కొరకు చేసేవి. ఇలా 3 రకాలుగా చేస్తుంటాం. అయితే భగవం తుడేమో అన్నీ నాకొరకే చేయాలి అంటున్నాడు. ఎలా మరి? మనం చేసే పనులన్నీ మన కోసమై నా, సమాజం కోసమైనా, భగవంతుని కోసమై నా- అన్నింటిని భగవంతుని పనులుగానే చె య్యాలి. ఎలా? నేను కర్తను, నేనే వీటిని చేస్తు న్నాను అనే అహంకారాన్ని- కర్తృత్వ భావాన్ని వదిలి, నా కర్తవ్యం అనుకుంటూ చేస్తే సరి. నా వల్లనే ఈ పనులు జరుగుతున్నాయి అనే అహంకారం లేకుండా మనం భగవంతుని చేతిలో పనిముట్టులా చేస్తే అవి అన్నీ భగవత్‌ కర్మలే అవుతాయి. అన్ని అనర్థాలకు కర్తృత్వ మే మూలం. బల్బులు వెలుగుతున్నాయంటే బల్బుల గొప్పతనం కాదు. కరెంటు గొప్పతన మే. కలం కవిత్వాన్ని వ్రాస్తున్నదంటే కలం గొ ప్పతనం గాదు. దాన్ని పట్టుకున్న వాడి గొప్పత నమే. అవయవాలన్నీ పనిచేస్తున్నాయంటే వాటి గొప్పతనం కాదు. వాటికి శక్తినిస్తున్న చైతన్యం యొక్క గొప్పతనమే.
పరిస్థితి ఇదైతే మధ్యలో మనకు లేనిపోని పెత్తనం- అహంకారం ఎందుకు? అహంకారం విడిచిపెడితే ఆత్మప్రాప్తియే. కనుక కర్మలు చేస్తు న్నాం అంటే అవి మనను బంధంలో పడేస్తాయి. కర్మబంధం నుండి తప్పించుకోవాలంటే కర్తృ త్వబుద్ధిని విడిచిపెట్టాల్సిందే. మన దృష్టిని భగవంతునిపై నిలిపి ఏరకం కర్మలు చేసినా, ఎన్ని కర్మలు చేసినా అవి అన్నీ భగవత్పరమైన కర్మలే అవుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement