Saturday, May 4, 2024

బేబి బంప్ తో ఇలియాన‌.. వైర‌ల్ గా ఫొటోస్

బేబి బంప్ తో ఉన్న ఫొటోల‌ని న‌టి ఇలియాన సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.గోవా బ్యూటీ ఇలియానా గర్భవతి అయిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంకోవైపు ఇలియానా నిజంగానే తల్లి కాబోతోందా? అని ఎంతోమంది అనుమానాలను వ్యక్తం చేశారు. ఈ అనుమానాలను నివృత్తి చేసేలా తాజాగా ఆమె బేబీ బంప్ తో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. బ్లాక్ కలర్ స్లీవ్ లెగ్ గౌన్ లో ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఇలియానా ఏ సినిమా చేయడం లేదు. ఇంట్లోనే ఉంటూ ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేస్తోంది. మరోవైపు, తన బిడ్డకు కాబోయే తండ్రి ఎవరన్నది మాత్రం ఇప్పటికీ ఆమె సీక్రెట్ గానే ఉంచింది.

చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది న‌టి ఇలియానా. అటు సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు చాలా సైలెంట్ అయిపోయింది. ఈ క్రమంలోనే ఇటీవల తాను తల్లిని కాబోతున్నానంటూ పోస్ట్ చేసి అందరికీ షాకిచ్చింది. తన మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నానని.. రెండు వారాల కిందట చిన్నారి డ్రెస్సును, తన మెడలో మమ్మా అని రాసి ఉన్న లాకెట్ ఫోటోస్ షేర్ చేసింది.అయితే పెళ్లి కాకుండానే తల్లి కావడమేంటనీ ? నెటిజన్స్ సందేహం వ్యక్తం చేయగా.. సినిమా ప్రమోషన్స్ కోసం కొత్త ట్రెండ్ అన్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే తాజాగా ఆమె తొలిసారి బేబీ బంప్ తో ఉన్న వీడియోను తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుండగా.. పెళ్లెప్పుడు అయ్యిందంటూ కామెంట్స్ చేస్తు్న్నారు నెటిజన్స్.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement