Monday, May 6, 2024

క్రియాశీలత్వమే లక్ష్మీదేవి నివాసం!


అన్ని జన్మలలోకి ఉత్తమోత్తమమైనది మానవ జన్మ. మనిషి ఆలోచనలు నిత్య నూతనంగా, క్రియాశీలకంగా వుంటా యి. క్రియా శీలకత్వం వున్న ప్రదేశమంటే లక్ష్మీదేవికి ఇష్టం. అదే ఆమె నివాస స్థానం. ‘క్రియాశీలత్వమే లక్ష్మీదేవి నివాసం’. ఇది వినటానికి ఆశ్చర్యంగా కనిపిస్తున్నది కదా కానీ ఇది ముమ్మాటికీ నిజం. అదేమిటో తెలుసుకోవడానికి ముందుగా త్రిమూర్తుల గురించి ఒకసారి మననం చేసుకుందాం.
సృష్టి రచన చేసే బ్రహ్మ. ఆయన ధర్మపత్ని చదువుల తల్లి సరస్వతీదేవి. సృష్టి రచన చేయటానికి కావలసింది జ్ఞానం. అందుకే ఆయనకు సహధర్మచారిణిగా వున్న తల్లి చదువుల తల్లి. తరువాత విష్ణుమూర్తి. ఆయన స్థితికారకుడు అంటే బ్రహ్మ సృష్టించిన సృష్టిని నిర్వహించే (మేనేజ్‌) దేముడు ఒక సంస్థను నిర్వహించాలంటే కావలసింది ధనం అంటే సంపద. కాబట్టి ఆయన ధర్మపత్ని లక్ష్మీదేవి. ఆ తల్లి సకల సంపదలకు కారకురాలు.
మూడవ దేవుడు పరమశివుడు. ఆయన లయకారకుడు. అనగా సృష్టిని నశింపచేయటం ఆయన పని. అట్లా చేయా లంటే కావలసింది శక్తి. శక్తి లేకుండా వినాశనం జరగదు కదా. అందుకే ఆ దేవదేవుడు పత్ని పార్వతీదేవి. ఆ తల్లి శక్తి స్వరూపిణి. ఇటువంటి క్రమాన్ని మనకు అందించాయి వేదాలు,
యద్భావం తత్‌ భవతి అనే ఆర్యోక్తి ననుసరించి మనం ఏ దేవుడిని లేక ఏ దేవతను ఆరాధిస్తామో ఆ దేవీదేవతలు మనకు ప్రసన్నులై వారి ఆధిపత్యంలో వున్న శక్తిని మనకు ప్రసాదిస్తారు. అంటే చదువు కొరకు సరస్వతి అమ్మవారిని, సంపదల కొరకు లక్ష్మి అమ్మవారిని. అదేవిధంగా శక్తికొరకు పార్వతి తల్లిని మనం కొలవటం కద్దు.
ప్రతి పురుషుని ప్రయోజకత్వంలో తన ధర్మపత్ని సహాయసహకారాలు ఉంటాయి అంతేకాదు నడిపేశక్తి కేవ లం అంటే కేవలం స్త్రీమూర్తిదే అదే మనం మనదేవుళ్ల ద్వారా తెలుసుకోవచ్చు. ఇక విషయానికి వస్తే క్రియాశీలత్వము అం టే ఒక కార్యం చేయాలనే భావన. ఆ భావనే మనం లక్ష్మి అమ్మవారుగా భావించవచ్చు. అదెలా అంటే-
ఊరుకు వెళ్లి కొంతకాలం తరువాత తిరిగి వచ్చాక తలుపు తీయగానే ఇల్లు మొత్తం దుమ్ము ధూళితో పేరుకొని వుంటుంది. ఇంటి ఇల్లాలు వెంటనే ఇల్లు ఊడవడానికి సన్నద్ధమవుతుంది. ఇల్లు ఊడవాలి అనే భావనే క్రియాశీల త్వం దానిని అమలు చేసిన తరువాతే అంటే ఊడ్చిన తరువా తే ఇల్లు పరిశుభ్రంగా వున్నది. ఇటువంటివి కోకొల్లలుగా మ నం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అందుకే మనధర్మంలో గృహిణిని గృహలక్ష్మి అని పేర్కొన్నారని అనిపిస్తుంది.
ఎవరైనా సరే కొత్తగా ఓ అమ్మాయిని చూస్తే ”చక్కగా, లక్షణంగా… సాక్షాత్తు లక్ష్మీదేవిలా వుంది” అనటం మనం చూస్తూ ఉంటాము. నిజానికి ప్రపంచంలో ఎవరూ లక్ష్మి అమ్మవారిని చూడలేదు మరి ఎలా అలా అంటారు అంటే లక్ష్మి అమ్మవారికి కొన్ని గుణాలను ఉంటాయి అని తెలుసు కున్నాము కాబట్టి అటువంటి సద్గుణాలు వున్న స్త్రీలను ఆ తల్లితో పోలుస్తూ వుంటాము. ప్రతి గృ#హస్తు తన దైనందిక జీవితాన్ని సుఖవంతంగా గడపటానికి ఏ ఉద్యోగమో, వ్యాపా రమో చేయక తప్పదు. గడియారం ముల్లులాగా పరిగెత్తక తప్పదు అందుకే లక్ష్మీదేవిలాంటి సహధర్మచారిణి లభించి ప్రతి విషయంలోనూ తన క్రియాశీలకత్వాన్ని చూపెడితే ఆ పురుషుడు పురుషార్ధాలను సాధించగలడు.
భర్త ఏదైనా కార్యార్థిగా వెళుతుంటే తన కార్యం సఫలంకావాలనే ఆపేక్షతో పత్నిని ఎదురు రమ్మనటం మన సాంప్రదాయం దానికి అర్ధం తన భార్య లక్ష్మి దేవిలాగా చక్కగా నుదిటిన కుంకుమ దిద్దుకొని, కురుల పువ్వులు పెట్టుకొని చేతులకు గాజులు వేసుకొని మనోహరిగా ఉన్న భార్య ముఖకమలం చూసి కార్యోన్ముఖుడు అయితే ఆ రోజంతా మనస్సు ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉండి తాను చేసే పనిమీద మనసు లగ్నం చేయగలడు. తద్వారా కార్యసిద్ధి కలు గుతుంది.
”యత్ర నార్యంతు పూజ్యతే, రమంతే తత్ర దేవత..” అంటే ఎక్కడ నారీమణులు పూజింపబడతారో అక్కడ దేవ తలు కొలువై ఉంటారని పురాణాలు, ధర్మ శాస్త్రాలు చెప్పాయి. పురుషుని అభివృద్ధికి స్త్రీమూర్తే కారణం.

లక్ష్మీదేవి నివాసాలు

గురు భక్తి. దేవ భక్తి. మాతా పితృభక్తి కలవారిలో లక్ష్మీకటాక్షం ఉంటుంది.
అతి నిద్ర లేని వారిలో. ఉత్సాహం. చురుకుదనం. ఉన్నవారిలో లక్ష్మీకళ ఉంటుంది.
ముగ్గు. పసుపు. కుంకుమ. పువ్వులు. పళ్ళు. పాలు లక్ష్మీ స్థానాలు.
దీపం. ధూపం. మంగళ ద్రవ్యాలు. ఆ తల్లికి నివాసాలు.
పాత్ర శుద్ధి శుభ్ర వస్త్రధారణ కలిగిన ఇల్లు అమ్మవారి నివాస స్థలం.
బొద్ధి. ధైర్యం. నీతి. శ్రద్ధ, గౌరవించే స్వభావం. శాంతి. లక్ష్మిని పెంచే శక్తులు. సంతృప్తి లక్ష్మికి ప్రధాన నివాసం.
అంటే లక్ష్మీదేవి మంగళకారిణి. సకల శుభాలకు కారణం లక్షి అమ్మవారు. లక్ష్మి అంటే చురుకుదనం, ఉత్సాహం, సత్వగుణం, శాంత స్వభావం, నిజాయితీ, ధర్మాచరణ ఇటువంటి గుణాలన్నీ క్రియాశీలకత్వమే అంటే లక్ష్మీదేవి అను గ్రహం పొందడానికి మానవులకు వుండవలసిన ప్రధాన లక్షణాలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement